- దగ్గరకులాగుటవలన ఇది బిగియును. (ఒకటన పటము నందు(e నిజూడుడు)
- ౪ పొడుగుది పొట్టిది చేయుముడి ౼ పొడుగు తాడును దానిని కోసి వేయకుండగ నే కావలసినంతనరకు పొట్టిదిగా చేయుటకిది పనికివచ్చును. తాడు యొక్క చివరలను ఉపయోగింపకుండ దీనిని వేయవలెను (ఒకటవ పటము J, 8, 14. లనుజూరుడు)
- ౫ ఏనుగ మెలిక ౼ కర్రకుగాని చెట్టునకు గాని ఒక తాడుయొక్క చివరకు ముడివేయుటకిది ఉపయోగమగును. ఒక చివరమాత్రము ముడి వేయవలెను. పరంజా కర్రలు కట్టునపుడు, వంతెనలు కట్టునపుడు, కొరడాకు తాడును కట్టునపుడు దీనినే ఉపయోగింతురు. (రెండవ పటమునందు a, b లను జూడుడు.)
- ౬ బ్రహ్మముడి ౼ ఇది జారిపోని ముడి. జంతువులను కట్టి వేయుటకుగాని, ఎత్తుమీదనున్న మనుష్యులను క్రిందికి దింపుటకుగాని ఇది ఉపయోగమగును. ఒక వైపు మాత్రమే కట్టవలెను. కండ్లుమూసికొని, ఒకభటుడు ఇంకొక భటునిచుట్టును ఈముడిని వేయగలిగి యుండవలెను. (రెండవ పటమునందు c, d లను జూడుడు)
రెండవ పటమునందు e అను గుర్తు వేసి వేరొకముడి కలదు. ప్రతిభటునకును మెడ రుమాలుండును. దానిని ముడి వేసికొను పద్ధతి ఇందు జూపట్టియున్నది. ప్రతిభటుడును తాను ఇతరులకు ఉపకారము చేయవలెనని జ్ఞప్తి యందుంచు కొనుటకై, ఈ రుమాలునకు మామూలుగా వేసికొను ముడిగాక వేరొక దానినిగూడ వేసికొని యుండును.
ఈ ముళ్ళ యొక్క ఉపయోగమును భటును జాగ్రత్తగ తెలిసికొని యుండవలయును. బ్రహ్మముడిని, ఏనుగు మెలికను తాము యొక్క ఒక కొసతో మాత్రమే వేయవలెను. తన చుట్టును, ఇంకొక చుట్టును గూడ భటుడు ఈ ముళ్ళను వేయగలిగి యుండవలెను.
(చ) భటధర్మములు
౧ బాలభటుడు విశ్వాసపాత్రుడు
“నా గౌరవముతోడుగా నేనీ పనిని చేసెదను” అని ఏభటుడైన జెప్పిన, ఆతడా కార్యమును తప్పక నిర్వర్తించునని తలంపవలసినదే. భటుని మర్యాద ఎల్లప్పుడును విశ్వాసపాత్ర మైనదియే. “నా గౌరవము తోడు” అని ఏభటుడైన వాగ్దానము చేసిన అది గొప్ప ఒట్టుతో సమానము. “నీ మర్యాద తోడుగా ఈపనిని చేసెదవని నమ్ముతాను” అని భటోద్యోగీయుడెనరైన భటునితో చెప్పిన తన సమర్థతనంతను వినియోగించి భటుడా ఉత్తరువును పాలింపవలసినదే; ఆ ఉత్తరువును నిర్వర్తించుటయందు ఏయడ్డంకులు కలిగినను లక్ష్యపెట్టగూడదు. అతని గౌరవముదనిూద నమ్మినప్పుడు అబద్ధము చెప్పుట మూలమున