Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.5 (1919).pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నీవు “పటాల” మందుగాని, "జట్టు" నందు గాని సభ్యుడవు అగుటకుముందు ప్రాధమిక శక్షయందు ఉత్తీర్ణుడవు కావలయును. ప్రాధమిక శిక్షావిధాన మంతయు ఈ పొత్తమందు గాననగును. పిమ్మట, భటుని ప్రతిజ్ఞను గైకొందువు; అంతట భటసోదర బృందమునందు నీఒక సభ్యుడవగుదువు. అప్పటినుండియు నీవు బాలభట చిహ్నమును ఒకే విధమగు దుస్తులను ధరించి, భటుని సంజ్ఞలను ఉపయోగింపవచ్చును.

3 భటుని ప్రతిజ్ఞ

౧ దేవునకును, రాజునకును, దేశమునకును నావిధ్యుక్తధర్మమును చేయుట నా ప్రధమ ప్రతిజ్ఞ.

౨ అన్ని వేళలయందు అందరికిని తోడ్పాడుట నాద్వితీయ ప్రతిజ్ఞ.

3 బాలభట శాసనమును నిర్వివాదముగ సిరసావహించుట నాతృతీయ ప్రతిజ్ఞ.

నేను నా గౌరవముమీద ఈ ప్రతిజ్ఞలను దీసికొనుచున్నాను.

ఈ ప్రతిజ్ఞలను చేసి, బాలభట దీక్షనుగైకొనుట మహా పవిత్రవంతమైన కార్యము. మానవునకు గౌరవముకంటె ఘనమగు విషయము లేదు. ద్రవ్యముపోయిన, ఇండ్లుపోయిన, పొలములు పోయిన మరల సంపాదించు కొనవచ్చును. కాని గౌరవముపోయిన మరల లభ్యముగాదు. అట్టి మహత్తరమైన “గౌరవము” మీద ఈ ప్రతిజ్ఞు గైకొనుచున్నావు. కావున నీశక్తియుక్తుల నన్నిటిని వినియోగించి, ఆ ప్రతిజ్ఞకు ఎంత మాత్రము భిన్నము గాకుండునిట్టు వర్తింపవలయును.

కాబట్టి ఈ ప్రతిజ్ఞ యొక్క అర్ధమును నీవు బాగుగా తెలిసికొని యుండవలెను. ప్రతిదినమును ఎవరికైన ఉపకారమును చేయుటవలన నీవు దేవుని సేవించు చున్నావు. ఆయన యొక్క అధికారమును శిరసావహించుట వలనను, ఆయన యొక్క బావుటాకు నమస్క రించుట వలనను శ్రీజార్జి ప్రభువర్యుని సేవించుచున్నావు. నీవు స్వశక్తివలనను, పెద్దల వలనను, తరిబీతును పొందుటవలన సన్మార్గుడగు పౌరుడవై, మాతృదేశమును సేవించుచున్నావు.

దీనినంగీకరించిన, ప్రతిజ్ఞయందు రెండువ భాగమగు ఇతరులకు సహాయము చేయుటను, మూడవ భాగమగు భటుని ధర్మములను దెలిసికొనుటయును సంభవమగును. భటుని దీక్షను సంతృప్తికరముగ నిర్వహించుటయు, ఈ సోదరత్వము యొక్క పవిత్రవంతమగు ప్రతిజ్ఞలను నిలుపుకొనుటయు సులభములగు పనులు గావు. అందుచేత భటుడగుట సులభముగ చేయదగిన కార్యమని తలంపకుము. ఇతరులకు సహాయము చేయవలయునని నీకు హృదయ పూర్వకమైన వాంఛగలదా ? మాతృదేశమును సేవింపవలయునని, నీహృదయము పరితపించుచున్నదా? సేవా వ్రతమునకై నీ కాలమును నీ శక్తిని కొంత వినియోగింప సిద్ధపడియుంటివా? ప్రతిదినము నీవు తప్పకుండ “ఇతరుల కుపకారకరమగు కార్యము” ను ఒక్కదానినైన చేయుటకు తయారుగా నున్నావా? పట్టుదల గలిగియుండి స్థిర సంకల్పమును జేయ సంసిద్ధుడ వేనా? తన ధర్మమును సరిగ నిర్వహించు భటుని జీవితము ఆనందపూరితమై యుండుననుట యధార్ధము. ఏలయన, ఇతరులను సేవించుటయం దాతడు స్వార్ధమును మరచి పోవును. ఒక సారి భటధర్మము నలవరచికొనెనా, ఎప్పుడును దానిని విడువజాలడు. అందుచేత అతని జీవితకాలమంతయు ఆనందప్రదమై