లు కనుగొని, వారికి చిక్కుబడకుండ, తన సేనానాయకునికి తెలియ జేయవలయును. అట్లు జాడలు తీయునపుడు అతడు శత్రువులకు పట్టుబడవచ్చును; మృతినొందవచ్చును; కాని ఆతడు లక్ష్యముజేయడు. ఎందుచేత? ఆతడు తనపక్షమునకై పనిచేయుచున్నాడు గాని స్వార్థమునకు గాదు. సైన్య సంబంధము లేని మన భటత్వమునకుగూడ, వాని నలవరచు కొనుచుంటినను స్పృహలేకుండనే యోగ్యతలన్నిటిని పొందెదవు. ఇదియే నీకు మాతృదేశ సేవానురక్తిని గలిగి౦చును.
మాతృదేశ సేవానురక్తి గలిగినప్పుడు ముందుగా నీవు కొంత తరిబీతు పొందవలసియున్నది. తరిబీతు లేనిదిఏపనినిగాని చక్కగ నిర్వహింపజాలవు. నీవు వీధివెంబడిగాని పొలముల వెంబడిగాని పోవుచుందువు. ఆకస్మికముగా ఒక మనుష్యున కొక గాయముతగిలి భయంకరముగ రక్తము కారుచుండును అప్పుడు నీవేమి చేసెదవు? రక్తము కారకుండ వెంటనే కట్టు కట్టకపోయిన యెడల, నీవు వైద్యుని తీసికొని వచ్చులోపల నే ఆమనుష్యుడు మృతి చెందగలడు. రక్తము కారకుండ కట్టు కట్టుటకు "ప్రాధమిక చికిత్స”ను నేర్చుకొని యుండవలయును. నదియందుగాని, కాలువయందుగాని, చెరువునందుగాని ఒక మనిషి మునిగి పోవుచుండును; నీకు ఈత వచ్చియుంకుటయేగాక రక్షణోపాయములను గూడ తెలిసికొని యుండని యెడల వానిని ఎట్లు బ్రతికించెదవు? ఒక మనుష్యుడు తాను పోవలసిన దారి తెలియక అల్లాడుచుండును. నీకాదారి తెలిసియుండక పోయిన యెడల, ఆతని కెట్లు చూపింపగలవు ? నీ ఇరుగు పొరుగునందు అగ్ని ఆపద సంభవించును. అగ్నికాహుతియగుచున్న గృహము లోపలనున్న మనుష్యులను రక్షించుటకును అగ్ని ఇతర గృహములకు వ్యాపింపకుండుటకును నీవేమి జేసెదవు? పరదలు వచ్చి గ్రామములు కొట్టు కొనిపోవునపుడు, సాంక్రామిక వ్యాధులు విరివిగ వ్యాపించునపుడు, నీవు వారి కేవిధముగ సహాయభూతుడ వయ్యెదవు?
ఉపన్యాస వేదికల నెక్కి గంభీరోపన్యాసములనిచ్చి మాతృదేశ సేవను చేసినామనుకొనుటకంటె, పైన చెప్పిన ఆపదలయందు నీదేశీయులకు సహాయపడుటయే మాతృదేశమునకు ఎక్కువ సేవజేయుట. అట్లు సేవ జేయు తబీతును పొందియుండని యెడల నీవు వట్టి నిరర్థకుడవు; కాబట్టి భటత్వమునందు ఈ విషయములనేగాక, ఇంతకన్న మహత్తరమైన యంశములనుగూడ నీవు నేర్చుకొనెదవు.
౨ భటుడగుట ఎట్లు?
గ్రామమందుగాని, పట్టణమునకుగాని బాలభట “పటాలము” గాని “జట్ట ”గాని ఉండిన యెడల, ఈపొత్తము చివరనున్న “ఫారము” నందు మొదటి భాగమును నీవు పూర్తిజేసి, రెండవ భాగమును (నీవు ౧౮ సం. వయస్సునకు లోబడి యుండిన యెడల) నీ సంరక్షకునిచే పూర్తి జేయించి, బాలభటోపాధ్యాయుని చేతికీయుము. అట్టి “పటాలము” గాని “జట్టు”గాని; లేని యెడల, నీవే జట్టు నొకదానిని ఏర్పరచుకొనవచ్చును. “జట్టునందు నలుగురు మొదలు ఏడుగురువరకు ఉండవచ్చును. నీవు చేయదలచిన కార్యమును గురించి కొందరు స్నేహితుల జెప్పుము. అట్లు చెప్పి ఒక “జట్టు”ను ఏర్పరచి, జట్టు పెద్దను ఎన్నుకొని, “భారతవర్ష బాలభట సంఘము, బెజవాడ” కు వ్రాయుము. వారు నీకు తగిన సలహా నొసంగెదరు.