చుండవలయును. ఇట్లు “జట్టులు" గ తరిబీకు ఆగుటకూడ బాలభట శిక్షణము నందొక ముఖ్యమైన విషయము. మీ దగ్గర తరిబీతు పొందినవారిని ఒక్కొక్క దానియందు ఆరుగురికి తక్కువయు, ఎనమండుగురికి ఎక్కువయు ఉండగుండునట్లు, “జట్టులుగ” విభజింపుము. తిరిగి ప్రతి జట్టునకును ఆజట్టునుండి సమర్ధుడగు వానినొకనిని జట్టు పెద్దగ ఏర్పరచుము. ఎవరిని జట్టు పెద్దగ ఏర్పరచిన బాగుండునో జట్టునందున్న మిగిలినవారియభిప్రాయములను దీసికొనిన మంచిదే; కాని తుదకు ఎవరి నేర్పరచునదియు బాలభట ఉపాధ్యాయుడే నిర్ణయింపవలయును. ప్రతిజట్టు పెద్దయును తనకు సహాయముచేయుట కొకని నేర్పరచుకొని యు౦డవలెను. ఈ సహాయము చేయువారిని జట్టు పెద్దలే ఏర్పరచుకొని క్రమముగా ఆ సహాయకులు తమ (జట్టు పెద్దల) స్థానములను ఆక్రమించుటకు అర్హులుగ తయారు చేయవలయును.
ఇట్లు ఏర్పడినప్పటినుండియు, జట్టుల నన్నిటిని ఆజట్టు పెద్దలే సాధ్యమైనంతవరకు తరిబీతు చేయుచుండవలయును. ప్రాధమిక శిక్షా పరీక్షయందు తప్పిపోయినవారిని, తిరిగి జట్టు పెద్దలే తరిబీతు చేయవలెను; అట్టివారిని బాలభటోపాధ్యాయులు తిరిగి పరీక్షించి, మధ్యమ తరిగతియందు త్తీర్ణులైన వారికి భటచిహ్నముల నొసంగును.
జట్టు పెద్దలకు ఎక్కువశిక్ష
ఇప్పటినుండియు, జట్టు పెద్దలకును వారి సహాయులకును, ఎక్కువశిక్షను ఇచ్చుటకు ప్రారంభింపవలెను; ఇట్లు ఎక్కు వశిక్ష నిచ్చుటవలన వారు మిగిలిన భటులను తరిబీతు చేయుటకు సహకారులగుదురు. వారమున కొకదినము ఇట్టివారికి అదనముగా తరిబీతు నొసంగు దినమునందే వారమున కొకదినమున మిగిలిన భటులనందరిని సహాయ బాలభటోపాధ్యాయుని యాజమాన్యముక్రింద ఏదైన ఆట ఆడుకొనుటకై పపివేసి, జట్టు పెద్దలను వారి సహాయకులను మాత్రముంచి, ప్రత్యేక శిక్ష నొసంగవచ్చును. జట్టు పెద్దలందరును పైన జెప్పిన గ్రంథముల సన్నిటిని చక్కగ జదివియుండవలెను.
మధ్యమతరగతి శిక్ష
పిచ్ముట మధ్యమ తరగతి శిక్ష ప్రారంభమగురు. జట్టు పెద్దలును వారి సహాయములను శిక్షను పూర్తిగను౦దిన పిమ్మట, బాల భటోపాధ్యాయుడుగాని, సహాయోపాధ్యాయుడుగాని వారిని పరీక్షించి మధ్యను తరగతియందు త్తీర్ణతను దెలుపు భటచిహ్నము మెసంగును.
జట్టులకు పోటీలు
ఈ సమయమందు జట్టులకు పోటీల నేర్పరచి కొన్ని బహుమతుల నిచ్చిన ఉత్సాహమును చురుకుదనమును అతిశయించును. ఆలోచన సభ (ఉపాధ్యాయులు, సహాయోపాధ్యాయులు, జట్టు పెద్దలు, వారి సహాయులుగలిసి) నొక దానిని సమావేశపరచి పోటీ పెట్టవలసిన విషయములను, వాని విలువలను నిర్ణయింపవలెను. ఏజట్టునందైన మధ్యమతరగతి శిక్ష యందలి ప్రాధమిక చికిత్సయందు ఒకడు తీర్ణుడైన ఆజట్టునకు పది మార్కుల నియ్యవచ్చును. జ్ఞాపకశక్తి పరీక్ష యందు ఒకడు తీర్ణుడైన ఆజట్టునకు ౫ మార్కుల నియ్యవచ్చును. పండ్రెండు నిమిషములకు ఒక మైలుదూరము భటుని అడుగుల లెక్కప్రకారము ఒకడు వెళ్ళగలిగిన యెడల ఆజట్టునకు అయిరుమార్కుల నియ్యవచ్చును. నిప్పును