Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.5 (1919).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

౨ శారీర సాధకములు: ౧ం నిమిషములు.

౨ పరీక్షల(Tests) యందుజ్ఞానము. పదునైదు లేక ఇరువది నిమిషములు.

౪ కవాతు:౼ పది నిమిషములు. కొన్ని జట్టు:ుగ విభజించి చేసిన, వారికి అనుభవము కలుగును.

౫ ఇష్టాగోష్ఠి, పది నిమిషముల కాలము. బాలభటులకు సంబంధించిన విషయములను గూర్చి, భటుల ధర్మములనుగూర్చి,

౬ తిరిగి “గుర్రపుడెక్క” ఆకారమున నిలువబడుట. భటులకు మధ్యాహ్నమునకు చెప్పవలసిన ఉత్తరువుల నొసంగుట. జండాను దింపుట - భటులకు సెలవిచ్చుట.

ఎప్పుడును భటులకు శిక్ష నొసంగుటకు పూర్వము ఉపాధ్యాయుడు తన కార్యక్రమమును సిద్ధపరచికొని యుండవలెను. భటుల యెదుట వారితో సంప్రదింపుచు కార్యక్రమమును నిర్ణయింపదలచిన, ఎవరికి తోచినది వారు చెప్పుట సంభవించి, వృధా కాలహరణ మగుటయేగాక, తుదకు ఏదియు నిర్ణయము కాదు.

గమనింపుడు

ఒకే విషయమును గూర్చి ఎన్నడును విశేషకాలము తరిబీతు నియ్యకుము. భటులకు అభిరుచియును ఆనందమును నిలిచియుండు లాగున నీ కార్య క్రమమును తరుచుగా మార్చచుండుము. భటుడెప్పుడును ఒక్కసారిగా భటవిద్య నంతను నేర్చుకొనవలెనని ఆతురతను పొందుచుండును. అందుచేత ప్రారంభమునందే వివరణములను ఎక్కువగ జెప్పి, భటుని చురుకుదనము మందమగునట్లు చేయకుము, భటుని వాంఛలను ఆటల మూలమునను అనుభవముల మూలమునను దీర్చుచుండుము. ముఖ్యములగు చిల్లర విషయము లన్నిటిని క్రమక్రమముగా దెలుపుచుండుము. ఈ విషయములను బాల భటోపాధ్యాయులు ముఖ్యముగా గమనింపవలెను. తాము ఇచ్చునట్టి తరిబీతు యొక్క జయమంతయు దీని విూదనే ఆధారపడి యుండును.

భటులయొక్క ఆటలు కార్యక్రమమునందు అత్యంతావశ్యకమగునవిగ పరిగణింపవలెను. వనభోజనములకు గాని యాత్రలకుగాని వారమునకొక దినమైనను ఒక పూటయైనను తీసికొనిపోయి ఆటలతో గడపిన అత్యుత్తమంబుగ నుండును.

దీక్షాస్వీకరణము

శిక్షను ప్రారంభించిన పిమ్మట పదునైను దినములు కాని ఇరువది దినములుగాని గడచునప్పటికీ, భటులందరును ప్రాధమిక పరీక్ష యందు తీర్ణులగుటకు కావలసిన తరిబీతు సంతయు పొందియుండవలెను. అప్పుడు తన గ్రామమునకు దగ్గరగానుండు ఏ గ్రామమునుండీయైన, బాల భటోపాధ్యాయు నొకని ఆహ్వానము జేసి. తన భటులను పరీక్షింపజేసి, ఆ పరీక్షయందు తీర్లులైన వారికి దీక్షా స్వీకారమిప్పింపవలెను; ఆ సమయమునకు, దీక్షా స్వీకార పద్ధతిని, బాలురు చక్కగా నేర్చి యుండులాగున పలుసారు లదివరకే వారికి చెప్పియుండవలెను.

ప్రాధమిక పరీక్షయందు త్తీర్ణులై దీక్ష స్వికరణ మొనర్చిన వారికి భటచిహ్నములను (Badges) ఇయ్యవలెను. ఆ సమయమునకు భటులందరును ఒకే విధమగు దుస్తులను సంపాదించుకొని యుండవలెను.

జట్టు పద్ధతి

అప్పటినుండియు భటులనందరిని జట్టులుగ విభజించియే వారికి శిక్షను గూడ ఇచ్చు