Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.5 (1919).pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తోడిభటులందు నిరసింపబడుటయేగాక, అట్లు తరుచుగా తప్పినవాడు భటవర్గమునుండి గూడ విడివడినవాడగుచున్నాడు. అట్లు తప్పినవాడు సోదర బంధమును త్రెంపినవాడగుచున్నాడు. అట్టివాని పేరు “ఆలోచన సభ” యొక్క తీర్మానమువలన భటవర్గమునుండి తొలగింపవచ్చును. కాని ఇట్లు తప్పుటయు, తొలగించుటయును ఎన్నడును జరిగియుండలేదు.

(చ) ప్రతిజ్ఞ, దీక్ష

ప్రథమ శిక్షను పొందిన పిమ్మట, తనయధికారములను, తన భారములను గుతె౯రింగి భటుడు ఈ క్రింది ప్రతిజ్ఞను దీసికొని దీక్షను వహింపవలెను.

౧ దేవునకును, రాజునకును, దేశమునకును నా విధ్యుక్తధర్మమును చేయుట నా ప్రథమ ప్రతిజ్ఞ.

౨ అన్ని వేళలయందు అందరికిని తోడ్పడుట నా ద్వితీయ ప్రతిజ్ఞ

3 బాలభట శాసనమును నిర్వివాదముగ శిరసావహించుట నాతృతీయప్రతిజ్ఞ.

నేను నా మర్యాదమీద ఈప్రతిజ్ఞలను దీసికొనుచున్నాడను.

ఈప్రతిజ్ఞను “సేనాపతి" యొక్కయు పటాలముయొక్కయు సన్నిధానమునందు తీసికొనబడును. ఈ దీక్షను తీసికొన్న పిమ్మట మాత్రమే ఏక విధమగు దుస్తులను, గురుతును ధరించుటకు అర్హుడగును. అప్పటినుండియు అతడు చేయు కార్యములన్నియు భట సోదర బృందమునందు తనకు లభించిన స్థానమునకు గౌరవము దెచ్చునవిగా నుండవలయును. ఇతరుల “కొక్కరికైన” ఉపకారము చేయుట, మెట్టమొదట ఆతడు నిర్వర్తింపవలసిన ధర్మమైయున్నది.

(ట) మధ్యమ శిక్ష.

ఆకస్మికములను సందర్భముల యందు చురుకుదనమును ఆయత్తతను గలిగియుండుటకును, అందరికి ఉపయోగకారియై యుంకుటకును ఆతడు ఇప్పటినుండియు నేర్చుకొనును. మధ్యమశిక్ష యందు ఉత్తీర్ణుడగుటకు ఆతడు ఈ క్రింది వానిని తెలిసికొని యుండవలయును.

౧ ప్రధమశిక్షను పొందిన పిమ్మట ఒకమాసము దినముల కాలము జరుగుట.

౨ ప్రాధమిక చికిత్సయందు కొంత జ్ఞానమును పొందుట (రక్తము కారుచుండ కట్టు నటుల జేయుట. గాయములకు కట్టుగట్టుట)

3 జెండాలతోగాని, ఈలలతో గాని, అక్షరములను మాటలను దెలుపగల సంకేతములను నేర్చికొని యుండుట.

౪ శ్రద్ధతో పరిశీలించు శక్తి, జ్ఞాపికశక్తుల యందలి పరీక్ష. వివిధరకములయిన చిల్లరవస్తువు లనేకములను - సుమారు ఇరువది నాల్గింటిని - ఒక బల్ల పైనగాని క్రిందగాని ఉంచి వానిని భటులకు రెండు నిమిషముల కాలము మాత్రము చూపి, మూసివేసి, ఆ వస్తువులు పేర్లను వ్రాయమనుట. బల్ల మీద నున్న వానిలో ముప్పాతికవాని నైన వ్రాయవలయును.

౬ ఆరుబైటను రెండు నిప్పుపుల్లలకు ఎక్కువ గాకుండ వెలిగించి నిప్పును జేయుట.

౬ ఒక మనుష్యునకు సరిపోవునంత అన్నమునుగాని రొట్టెనుగాని జేసి, కూరను గూడ వండుట

౭ పదియారు దిక్కులను దెలిసికొనుట.

౮ ఎనిమిది అణాల ద్రవ్యము నైన “ఫోష్టాఫీసు సేవింగ్సు బ్యాంకి” లో దాచుకొనుట.

F వందేమాతర కీర్తనను పాడగలిగియుండుట.