Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.5 (1919).pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

౨ నిర్మాణము.

బౌలభటులందరును చిన్న చిన్న "జట్టు” లుగ నేర్పడుదురు. ప్రతి జట్టు”నకును “జట్టు పెద్ద” ఉండును. “జట్టు పెద్ద ” క్రింద ఏడుగురుభటులకు తక్కువగాకుండ నుందురు. ఇట్టి “జట్టులు" మూడింటికి దక్కువగాకుండ నేర్పడిన, ఒక“పటాలము ”అగును. ఇట్టి "పటాలము” ఒక "సేనాపతి" యొక్క పరిపాలనము క్రింద ఉండును; “సేనాపతి” కి ఒకరుగాని ఇద్దరుగాని “సహాయ సేనాపతు" లు౦దురు. ఇట్టి "సేనాపతు” లందరి మీదను ఒక్కొక్క జిల్లాకు ఒకొక్క “సేనానాయకు” డుండును. ఈపద్ధతి య౦దు చిన్నయుద్యోగి "జట్టు పెద్ద” యును పెద్దయుద్యోగి "సేనానాయకుడు"ను అయి యున్నాడు. ప్రతిపటాలమందలి ఉద్యోగుల౦దరును జేరి "ఆలోచన సభ" గ నేర్పడుదురు. ఈఆలోచన సభయందు "జట్టు పెద్ద ” గూడ సభ్యుడు గా నుండును. తద్వారా పెద్దవాడైన మిమ్మట వహింపవలసిన జవాబుదారులయందు జరపవలసిన ధర్మములయందును అద్భుతమైన తబీతును పొందిన వాడగును.

3 తరిబీతు పద్ధతి

జట్టుపెద్దలు ఆదిగాగల భటులందరును, ఈక్రింది పరీక్షలయందు జయమునుగాంచవలెను.

(క) ప్రధమశిక్ష. అది ఈ క్రిందివిధముగ నుండును:-
1. భటుని రహస్యపు గుర్తుల నెరుగుట, నమస్కరింప నేర్చుకొనియుండుట. ఇందువలన ఒకే సోదరబృందమునకు చేరిన భటులందురును ఒకరికొకరు గుర్తింప గలిగియుందురు; ఇంతేగాక భటునికి ఉపయుక్తమగు విషయములనేకములను దెలిసికొనుటకు తగిన శక్తి నిచ్చును.
2. అనుభవమువలన ఈ క్రింది ముళ్ళను వేయగలిగియుండుట: - దర్భముడి, నడితడపముడి, పల్లెముడి (తడితాడు ముడి), ఏనుగ మెలికి, పొడుగుది పొట్టిది చేయుముడి, బ్రహ్మముడి. భటుడు నేర్పుగలవాడై యుండుటకు ఇది మొదటి తరిబీతు.
3 భటుని నియమముల (ధర్మముల) ను తెలిసికొని అర్ధము చేసికొనుట. భటుని నియమములు (ధర్మములు) ఇవి:౼
౧ బాలభటుడు విశ్వాసపాత్రుడు.
౨ బాలభటుడు రాజభక్తిని, దేశభక్తిని, మాతాపితలయంగుభక్తిని, తన అధికారుల యెడల భక్తిని. తాను సేవ జేయువారియెడల భక్తిని, తనకు లోబడి యుండువారియెడల భక్తిని కలిగి యుండును.
౩ బాలభటుడు ఎల్లప్పుడును జనోపకారి.
౪ ఏ జాతి మతము వారయినను అందరికిని బాలభటుడు స్నేహితుడు; బాలభటవర్గ మాతని సోదరులు.
౫ బాలభటుడు ఎల్లప్పుడును వినయశీలుడు.
౬. బాలభటుడు భూతదయగలవాడు.
౭ బాలభటుడు తల్లిదండ్రులయొక్కయు, బాలభటోద్యోగుల యొక్కయు ఆజ్ఞలను నిర్వివాదముగ శిరసావహించును.
౮ బాలుభటుడు ఎట్టికష్టములందును సంతోషమును విడువడు.
౯ బాలభటుడు మితవ్యయి.
౧౦ బాలభటుడు త్రికరణ (మనస్సు, వాక్కు, కాయము) శుద్ధిగలవాడు. ఆత్మశుద్ధి కలవాడు. కావున ధీరుడు.

ఈ నియమములు ఆజ్ఞలెన్నటికి గావు. అవి ఎవరికివారుదీసికొను ప్రతిజ్ఞలై యున్నవి. ఈ ప్రతిజ్ఞలను నిర్వహించుటకు దప్పినవాడు