విషయమై మూకీభావమునువహించి, శరీర పాటనము లేక సకల రోగముల కాలవాలమగుచున్నారు. ఇక బాలురన్ననో వారి సంగతి చెప్పనక్కరయేలేదు. పాఠశాలలందు వారు శరీరపరిశ్రమ విషయమై రెండుదినముల కొకసారియైన కొంతకాలము వినియోగించు చున్నారనుట నిజమేను. కాని అట్లు వారు చేయుచున్న పరిశ్రమ నిరర్ధకముగా నున్నదనుట కెంతయు జింతిల్లు చున్నాడను. ఇట్లు నిరర్థకమగుటకు ముఖ్యమగు కారణములు రెండు గలవు. మన దేశమునందు ౼ అందు ముఖ్యముగ మన పట్టణములయందుగల పాఠశాలలన్నియు ౼ పట్టణములందు ఇండ్లన్నియు క్రిక్కిరిసియున్న భాగములలో దుర్గంధముతో నిండియుండిన కాలువలచే నిరుప్రక్కల నలంకరింపబడియున్న గొందులందు - మిక్కిలి జనమ్మర్దముచేతను బండ్ల రాకపోకలచేతను ఎడతెగని రహదారీగలిగి వాయువంతయు ధూళిచే నిండియుండిన ప్రదేశములందు నెలకొల్పబడి యున్నవి. అట్టి పరిస్ధితులందు దుమ్ముచే నిండి యుండిన గాలిని పీల్చుచు చేయు శరీరసాధకము బాలురకు ఆరోగ్యమును గలిగించునో అనారోగ్యమును గలిగించునో మీకు దెలియకపోయిన యెడల, ఎవరయినను శాస్త్రవేత్తల నడిగి తెలిసికొనుడు. ఇక రెండవది; ఇపుడు పాఠశాలలందు పాశ్చాత్యసాంప్రదాయముల ననుసరించి శరీరసాధకము గరుపబడుచున్నది. ఆ సాధకపద్ధతి మన దేశపరిస్థితులకు దగినది గాదు. చలిదేశములందు కాళ్ళును చేతులును కొంకరలు బోవుచున్నపుడు, చేతులును కాళ్ళును సరిగా చాపు కొనులు, సరిగా ముణుచుకొనుటలే శరీరసాధకములై యుండును. కాని మన దేశమందు దేశీయవ్యాయామములు అంతకన్న సర్వ విషయములందు అనేక రెట్లు మిన్నయగునవి అనంతములు గలవు. అమెరికా దేశశాస్త్రవేత్త యగు "రేమాండ్ ఫ్రాన్సిస్ యేట్సు" అను నాయన ఆ దేశ పాఠశాల లందలి వ్యాయామమును గూర్చియే ఇటుల వ్రాసి యున్నాడు:——
"A brisk walk for ten blocks in the open air is in many instances far better than going through the Robert's Dum-bell Drill a dozen times” (రాబర్టుగారి డంబెల్ సాధకమును పన్నెండు పర్యాయములు చేయుటకంటె పరిశుభ్రమగు గాలితగులు బహిరంగప్రదేశమున పది ఫర్లాంగుల దూరము వడిగా నడచిన అనేక విధముల మంచిది) బలహీనులగు బాలురకు ఇప్పుడు పాఠశాలలలో విసుగు పుట్టించెను 'డ్రిల్లును' జెప్పుట వట్టి యవివేకమని యవివేకమని ఆయనయే ఇట్లు జెప్పు చున్నాడు; — "It seems to be pure irrationality to impose the monotony of drilling upon school boys who are not physically sound.”
శారీరక పరిశ్రమకు పరిశుభ్రమైన గాలి యొక్క యావశ్యకతను గూర్చి ఎంత జెప్పినను తనివి దీరదు. పరిశుభ్రమగు గాలిని పీల్చుటకు అవకాశమును, తగినంత పరిశ్రమయును గలిగిన పాటకపుజనులు ఆరోగ్యవంతులై చూడ సొంపుగా నుండుటయు, భాగ్యవంతుల బిడ్డలు అట్టి యవకాశము లేక అనారోగ్యవంతులై తీతువు లై యుండుటయు మనము నిత్యమును జూచు చున్నారము. పాటకపు జనులలో గూడ, స్థిరనివాసములు లేక ఏ చెట్టుక్రిందనో పడి నిద్రింపుచు ఎండకెండుచు వానకు దడియుచు జీవించువారు ఇంకను ఎక్కువ బలవంతులై యుందురు. దీనికి గారణమేమి ? వారు ఇంకను ఎక్కువ పరిశుభ్ర