గ్రంథాలయవిధులు.
అజ్ఞానతమము దేశము నిండి యున్నది. చదువను వ్రాయను నేర్చినవారిసంఖ్య స్వల్పముగ నున్నది. గ్రంథముల జదివి రసము గ్రహియించువారిసంఖ్య యత్యల్పమని చెప్పుటకు సంశయము లేదు. ప్రారంభవిద్య నిర్బంధముగను ఉచితముగను బ్రసాదించుటకై ప్రభుత్వమువారివలన కొన్నిప్రయత్నములు సలుపబడు చున్నని. ఇంకను నవి రూపు గనలేదుగాని శుభసూచకములు మెండుగా గానవచ్చుచున్నవి. రాజకీయవిషయములగూడ హెచ్చుస్వాతంత్య్రము ప్రజలకు గలుగు సంస్కరణము లుపపాదింప బడునని దేశ ముత్కంఠవృత్తితో నెదురుచూచు చున్నది. ఈ సమయమున బ్రజలకు జ్ఞానాభివృద్ధియు కార్యనిర్వహణశక్తియు గలుగునటుల బనిసేయు విధి మనయందుగూడ గలదు. అట్టి జ్ఞానప్రదానమున గ్రంథాలయములు ముఖ్యముగ బాల్గొనవలసియున్నది. ఆంధ్రమున వార్తాపత్రికలు వెలువడినది మొదలీకొఱంత కొంతవఱకు దీరినది. ఉత్తమగ్రంథరచనవలన బ్రజలకు ప్రబోధము గలిగించుట గ్రంధకత౯లకును, తద్గ్రంథ సంపాదమునను ప్రచురమునను జ్ఞానవ్యాప్తి గలిగించుట గ్రంధాలయములకును విధియై యున్నది. పూర్వకాలమున కవులు గ్రంథకతలు ప్రభువుల నాశ్రయించి యుక్తముగ భోషింపబడు చుండెడివారు. మహాకవులును శాస్త్రజ్ఞులును గొ౦దఱు దారిద్య్రాద్యముననే ప్రశస్తిగాంచి లోకోపకార మొనరించిరి. ఈ కాలపరిస్థితుల ననుసరించి రాజావలంబనము కంటె ప్రజావలంబనమే గ్రంధకతలకు జీవనాధారమై యున్నది. “సంఘే శక్తిః కలౌయుగే" యను నార్యరచనము స్మరణకు వచ్చు చున్నది. ప్రజాహితియులగు గ్రంధములు ఆదరణమును బడసి వాసిగాంచ గలవు. పూర్వకాలముకంటే చౌకగ గ్రంథములు లభించుట చేతను, సులభముగ రాకపోకలు జరుగుచుండుటను చదువరులు హెచ్చుగ నుందురు. కాని వారలకు గ్రంథములు చదువుటయందభిరుచి మాత్రము జనియించునటుల గ్రంథాలయములు పాటుపడవలసి యుండును. ప్రజల హృదయము నాకషీ౦పని గ్రంథ మేనాడును జీపింప జాలదు. గుణగ్రహణము, నిమార్షకజ్ఞానము అందరకును సామాన్యముగ లభింపవు. గ్రంథాలయము లట్టి వివేచనముతో గ్రంథసంపాద్యమును జేసిపాఠకులకుద్బోధము గావించుచుండ వలయును. దేశమున నూతనయుగము ప్రారంభమగుచున్నది. ఇట్టి సంధికాలమున నన్నివిధముల పుస్తకములును బయలు వెడలును. మంచివి, చెడ్డవి, సామాన్యముయినవి - యన్నియు నీ ప్రవాహమున బోవుచుండును. గ్రంధకర్తలయందు ముఖ్యముగ స్వాతంత్రము హెచ్చుగ గానవచ్చుచున్నది. కవు లెప్పుడును నిరంకుశ ప్రతిభ గలవారలేగాని పూర్వకాలమున కావ్యనాటకరచనలయందును, శైలియందును, రసపోషణమునందును, ఇతివృత్తి నిర్మాణమునందును, పాత్రల యౌచిత్యమునందును, దృశ్యప్రబంధముల ప్రదర్శింపదగిన విషయములగూర్చియు కఠినసూత్రములు నిర్మింపబడి యున్నవి. ఆధునికనాటకములయందు పూర్వపు నాటకలక్షణములు పాటింపబడుచున్నట్లు కానరాదు. ప్రదర్శనమున కర్హములగు రంగము లెన్నియో కూర్పబడు చున్నవి. సంఘసంస్కరము మొదలుగాగల యంశముల గ్రంథకర్తలు తమకభిమానము గలవాని నౌచిత్యమును నాటకనిబంధనలను దాటి యుపన్యాసరూపకమున పాత్రల ముఖమునుండి వెలువడజేయంచుందురు. మఱియు నవలలయందీ విషయమున మిక్కిలి దోషము గన్పట్టుచున్నది. గ్రంథాలయములు కొన్ని పనిబూని పారితోషికములనిచ్చి గ్రంథరచనకు సాహాయ్యమొనరించు చుండుటచే నీ విషయమును గూర్చి యిచ్చట బ్రస్తావింపవలసి వచ్చినది. కావ్యనాటక రచన యందు ప్రాచీన సంస్కృతాంధ్రసూత్రముల విడువక రచించుట యొప్పని తోచుచున్నది. నాటకము లాంధ్రమున క్రొత్తగ బయలు దేరు చున్నరు. సంస్కృతి నాటకములు భాషాంతరీకరణములు సమాప్తి జెందినవి. సుప్రసిద్ధాంగ్లనాటకములుగూడ పూతి౯యైనవి.
పురాణకధల ననుసరించి క్రొత్తనాటకములు వ్రాయబడుచున్నవి. భాషాంతరీకరణములందు భాష చిత్రముగ నుండును. కొన్నిపట్ల నుభయభాషాభ్రష్టత్వము గానూపించును. మాతృకయొక్క సహాయముండినగాని పరివర్ధనము మగవగాహమే యు౦డును. అన్యభాషా సాంప్రదాయము లటులనే అనుగుని నిమిడ్చిముండుట