కెగయ మెట్లు కట్ట సమకట్టిన మానవులకు పెక్కుబాసల గల్పించి కలహములు పెంచి కార్యవైకల్యము గావించిన పరాత్పరుని మాయను క్రైస్తవవేదము కొనియాడు చున్నది. అట్టిపొగడ్త భాషాశక్తిని వేనోళ్ళబ్రకటించు చున్నది. మన భాగ్యవశమున నాంధ్రభాషవంటి పైతృక ధనము మనకు దొరకినది. దానివృద్ధి గావించి మన సంతతికి నమూల్యమగు నిధానముగ మనము విడచు బాధ్యతయును మనయెడగలదు.
ఆంధ్రసారస్వతము.
ఆంధ్రసారస్వత మేనాకు బాదుకొనినదోయింతవఱకును గుర్తింప రాకున్నది. వాగమశాసనుండు సృజియించినట్లు వర్ణింపబడి యుండెనుగాన నన్నయభట్టారకునికి పూర్వమున సుపూర్ణవిశాసముతో నాంధ్రకవిత్వము విరాజిల్లుచు౦డెననుటకు భారతమే సాక్షిగనున్నది. ఇంకను నాంధ్రవాఙ్మయచారిత్రము పరిశోధింపదగియున్నది. వ్రాయబడవలసియున్నది. కవిజీవితములు గలవుగాని సవిమర్శకమగు సారస్వత చరిత్రము వ్రాయ దజ్ఞులగువారలు యత్నింతురు గాక! ఏ దేశముననేని సాంఘిక జీవనమునకు వాఙ్మయము దర్పణతుల్యముగనుండును. నాగరికత, ఔన్నత్యము, సౌశీల్యము, శిల్పకళాకాశలము, అభినవాభిప్రాయప్రాదుర్భావము ౼ పెక్కేల సాంఘిక జీవనమంతయు నిరుపమశోధచే వాఙ్మయమున ప్రతిఫలించుచునే యుండును. సామ్రాజ్యములు పరివర్తనమును జెందినవి. సారస్వతము మాత్రము నిలచియున్నది. పూర్వదేశములు గౌరవము వాఙ్మయప్రసిద్ధివలననే గ్రహియింపదగి యున్నది. గీర్వాణవాఙ్మయ ప్రశస్తిని పాశ్చాత్య పండితవర్యులు - వేనోళ్లగీర్తించియుండిరి. దేవభాషయంతయు మనపైతామహధనము. సంస్కృతభాషా పరిచయమున ప్రపంచక చరిత్రమును వ్రాయదగియుండునని నిర్ణయింపుబడి యున్నది. భాసలకెల్ల దల్లియగు సంస్కృతమున ప్రాచదువులు బయలు వెడలినవి. ఆంధ్రవాఙ్మయ చరిత్రముగూడ నాహ్లాదజనకము గాకపోదు. వర్తమానమం దనంత శాఖలు గలిగి విజృంభించుచున్నది. భాషాంతరిక్షము నిరంతరశోభాభాసమానమై వెలుగుచున్నది. ఆంధ్రవాఙ్మయము నందంతటను నాంధ్రత్వమే ప్రతిఫలించుచున్నది. భారతజాతీయతత్వము నూతనవికాసము గాంచి యాంధ్రవ్యక్తి మూలమున బ్రస్ఫుటవీప్తి తో బ్రకాశించుచున్నది.
ఆంధ్రగ్రంథాలయములు.
ఇమ్మహాతరుణమున గ్రంథాలయోద్యమము ప్రాముఖ్యముగాంచుట యరిదికాదు. గ్రంథాలయోద్యమ మాంధ్రోద్యమమునకు వెరువెంట తదంతక్భూతముగ వెలసినది. జీవశక్తియగు భాష పెంపుజెంది విజ్ఞానము విస్తరిల్లిన గాని యాంధ్రోద్యమమునకు సంపూర్ణ వికాసము చేకూరదు. కావున గ్రంథాలయోద్యమము మన యాందోద్యమమునకు ప్రధానాంగమగు ననుబంధము. ఇయ్యది విజయ వాటిక నెలకొల్పబడినది మొదలు దినదిన ప్రవర్ధమానముగ వింత తేజమును చెందుచున్నది. గ్రంథాలయములు పూర్వమునుండియు గలవు. గ్రంథభాండాగారములు చిరకాలమునుండియు దేశమున నిలచియున్నవి. కాని వానికి నూతనశక్తిని బ్రసాదించి గ్రంథాలయ సూత్రములు కేంద్రీకృతములు గావించి యభినవపక్కిని విజృంభింప జేయదలచినది గ్రంథాలయోద్యమము. ఆంధ్రదేశగ్రంథాలయ సభ మా విశాఖపురిని కొలదిదినములలో జరుగనున్నది. సుప్రసిద్ధ కవిపుంగవులును, ఉభయభాషా సాహితీమండనులును ఆంధ్రభాషాపోషకులునగు శ్రీయుత పోలవరం జమీందారు వారి యాధిపత్యము క్రింద జరుగనున్నది. మండల సభలుగూడ మెండుగ జరుగుచున్నవి. వివిధ గ్రంథాలయములు వార్షికోత్సవములు మిక్కిలి యుత్సాహముతోడను వైభవముతోడను జరుపుచున్నవి. ఆంధ్రదేశమునందంతటను, యాంధ్రులునివసించుచోట్ల నెల్లెడులను గ్రంధాలయములు దినదినప్రవృద్ధిగా స్థాపింపబడుచున్నవి. ఈ యభివృద్ధి గ్రంథాలయోద్యమముయొక్క బలిమిని బ్రకటించుచున్నది. మనగంజాముమండలమున గత సెప్టెంబరుమాసమున తమ యాదరణము క్రింద గంజాముమండ లాంధ్రగ్రంథాలయ సంఘమును నెలకొల్పి బ్రహ్మపురాంధ్రభాషాభివర్ధనీ సమాజమువారు మనకృతజ్ఞతను బడిసిరి. భారువగ్రామమున శ్రీకృష్ణదేవరాయ గ్రంథభాండాగారమువారు ఆంధ్రదేశగ్రంథాలయ ప్రతినిధులు చతుర్ధ సమావేశమును బహుజయప్రదముగ గతసంవత్సరమున జరిపి మెప్పువడసిరి. ప్రస్తుతమీమండలమున బురువదియైదు గ్రంథభాం