ధ్యానుసారంబుగ నొకటి రెండు బహుమానంబులు పుస్తకరూపంబుగ నొసంగుచుండిన గ్రంథాలయముల కనేకులువచ్చి భాషాభివృద్ధి చెందుదురని నాయభిప్రాయము.
ఇక మన టెక్కలిపురములోని గ్రంథాలయ ప్రశంస కొంత సేతము. ఈ గ్రంథాలయము శ్రీయుక టంకాల సాంబమూతి౯యను వైశ్యశిఖామణియొక్క సుప్రయత్నమువలన ౧౯౧౭ సంవత్సరములో స్థాపింపబడినది. దీనికి కాళిదాసగ్రంథాలయ మని పేరు. అది సాంబమూతి౯ గారి భవనమునందే ప్రస్తుతము నెలకొల్పబడి యున్నది. దానికి వారును, వారి తండ్రిగారుగు సూర్యనారాయణశ్రేష్టి గారును దాదాపు 3౦౦ గ్రంథంబు లొసంగిరి. పురజనులు, తాలూకా ప్రజలు కొన్నిటి నొసంగిరి. ప్రస్తుతము దానిలో ౪౯౦ తెనుగు పుస్తకములును ౨౫ం ఆంగ్లగ్రంథములును ౮ సంస్కృతపుస్తకములును ౧౪ తాళపత్రగ్రంథములును గలవు. వేరవి ౭౬౨ పుస్తకములు గలవు. కొందరు విద్యార్థులు పుస్తకముల నిండ్లకు తీసికొనిపోయి చదివితిరుగ నిచ్చివేయు చుందురు. భగవద్గీతోపన్యాస మప్పుడప్పుడు జురుగు చుండును. దీని యధ్యక్షతక్రింద నన్నదానసమాజ మొకటి యేర్పాటు కాబడినది. వారమునకు 3౮ మంది బీదలకు జన ౧కి తవ్వెడు బియ్యము ఒక కాని నగదు చొ॥ ప్రతి ఆదివారము నాడు పంచిపెట్టబడుచుండును. రాత్రొత్యచితపాఠశాల నొకదానిని స్థాపించుట నాలోచన చేయబడుచున్నది. ఈ గ్రంథాలయముయొక్క ప్రధము వార్షికోత్సవము నిన్ననే జరిగినది. కార్యదర్శి గారు చదివిన చరిత్రవలన అన్ని సంగతులు విశదమయి యుండును. కనుక చర్వితచర్వణము నుండునని భావించి యిచ్చట సంక్షేపముగ విన్నవించితిని.
పిమ్మట ప్రభల లక్ష్మీనర సింహంపంతులుగారిని సభాధిపత్యమునకు ఉపపాదించుచు గరిమెళ్ళ సీతారామమూతి౯గారు ఉపన్యసించిరి. ఈ తీర్మానమును గిడుగు సీతాపతిరావు, టంకాల సాంబమూర్తి గార్లు బలపరచిరి. అంతట లక్ష్మీనరసింహంపంతులు గారు ఆహ్వాన సంఘాధ్యక్షునిచే కర్పూరమాలాలంకృతులై అగ్రాసనాధిపత్యమును వహించి ఈ యుపన్యాసమిచ్చిరి:౼
అధ్యక్షుని యుపన్యాసము.
ఆంధ్రోద్యమ మెల్లయెడల బ్రాకి దుర్నిరీక్ష్యతేజోవిభాసితమై వెలుంగుచున్నది. అట్టి ఆంధ్రోద్యమమునకు మూలశక్తి యాంధ్రభావయే. ఆంధ్రభాషయే మనయాంధ్రత్వమునకు బ్రధానలక్షణమై యున్నది. “దేశభాషల లోన దెనుగు లెస్స”యని ప్రాచీనకవిపుంగవులును, మృదుమధుర ఫణితిని ప్రాచ్య భాషలయం దాంధ్రమిటాలియా భాష వంటిదని పాశ్చాత్యులును మన తల్లి భాషను గీర్తించుచుందురు. నేటికిని నెనలేని తీపులూకు తేనె సోనలపగిది తేట తెనుంగుపల్కు లుల్లముల జొక్కజేయుచుందురు. ఆంధ్రకల్పవల్లి భూలోకమున బాదుకొనినది మొదలు దిశలబ్రాకి యనంతశాఖాపరివృతంబై నూతనాదర్శ రూప నానావిధసౌరభ్య సంభరితదివ్యపుష్పశోభావిభాసితమై నిండు వెలుంగుతోడ గోదసినిండి గ్రాలుచున్నది. మధురానగరమున నీయేడు జరిగిన యాంధ్రపరిషత్సమావేళమును నచ్చటి యాంధ్రులయానందమును, మనకు దార్కాణము. మఱియు బర్మా, బొంబాయి, వంగదేశము మొదలగు భారతవర్ష సీమలయందును, సీమయందును, అమెరికా, ఆఫ్రికా మొదలగు విదేశములయందును మనయాంధ్రసోదరులు నివాసము గాంచుచు యాత్రలు సలుపుచు విద్యలగఱచుచు కలనబోరుచు నాంధ్రవ్యక్తికి వన్నె దెచ్చుచున్నారు. బర్మాదేశమున నాంధ్రులు చిరనివాసము గాంచి రాజ్యము లేలుచుండిరి. భారతవర్షమున సామ్రాజ్యపదవులగూడ నలంకరించియుండిరి. దక్షిణదేశమున నిరుపమసంపదలతో దులదూగు చుండిరి. ఆంధ్రులమని నిండుగరువమ్ముతో మనము దలలెత్తదగు గౌరవాతిశయముల, మన పెద్దలు మనకు మూలధనముగ నొసంగి యుండిరి. ఇట్టి ప్రాక్తనౌన్నత్యమునకును వర్తమాన నూతన సంరంభ నవ్యకళాదీప్తికిని ప్రాణభూతమగునది మన మాతృభాషయే. వాగనుశాసనుండు కుండలీంద్రుడు శ్రీనాధుడు నాంధ్రకవితాపితామహుండు మున్నగుమహాకవీంద్రులవలన బోషింపబడి భాస్కర సోములవలన దీప్తి గాంచిన యీ “బహుళాంధ్రోక్తి మయప్రపంచమును” రామ రాజభూషణను చక్కగ వర్ణించియుండెను. అంధ్రో ద్యమమునకు నాంధ్రభాషకును కార్యకారణసంబంధము గలదు. భాషాశక్తి సాంఘిక జీవనమునకు జీవగఱ్ఱ. మింటి 2