Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.4 (1918).pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇదియంతయు భావనాప్రపంచ సృష్టియేగాని అనుభవసిద్ధమగునది కాదని ఆంధ్రగ్రంథాలయములతో సంబంధమంతగ లేనివారని యందురుగాక! అట్టివారలకు నావిజ్ఞాపన మేమనగా; ఉద్యమ చరిత్రను చదివి చూడుడు; ప్రతిదినము వార్తాపత్రికలయందు గ్రంథాల యము లాచరించుచున్న కృషినిగూర్చి ప్రచురింపబడెడు వార్తలను పఠింపించుడు; గ్రంథాలను ప్రచారకులతో వారి యాశయములను గూర్చియు వారి అనుభవములను గూర్చియు ముచ్చటింపుడు. అప్పుడు నేను చెప్పిన దంతయు యదాధు౯మేనని మీకు నమ్మకముకల్గక మానదు.

నేను ఆంధ్రగ్రంథాలయతత్వమును గూర్చి పైన జెప్పన వాక్యములు యదాధ౯మును స్థిరపర్చుటకు మాదిరికి కొన్ని గ్రంధాలయ సంఘముల చరిత్రను క్లుప్తముగా తమకు నివేదించినచో బోధపడగలదు.

గుడివాడ తాలూకా అంగలూరు గ్రామమందు గ్రంథాలయ మొకటి కలదు. అగ్రంథాలయ సభ్యులచే చిత్రింపబడిన పటములను మీరు ప్రదర్శనశాలయందు చూడగలరు. ఆ సంఘము వారి యాజమాన్యము క్రింద స్త్రీ లకు ప్రత్యేక మొక గ్రంథాలయమేర్పడి చక్కగ పనిచేయుచున్నది. బాలబాలి కాపాఠశాలలు స్థాపితమై పిమ్మట స్థానిక సంఘముల కప్పగింపబడి దినదినాభివృద్ధిని గాంచుచున్నవి. గ్రామమంతటను అజ్ఞానతిమిరము పారదోలబడి జ్ఞాన తేజస్సు ప్రతిష్ఠింపబడినది. బెజవాడ తాలూకా రొయ్యూగను గ్రామమున గ్రంధాలయ సంఘమేర్పడిన కొలది కాలమునకు గ్రామమందు జాతీ యోద్బోధముకలిగి గ్రామసంఘమొకటియు జాతీయ పాఠశాల యొకటియు స్వరాజ్యసమితియు స్థాపింపబడినవి.

ఈ గ్రామవాసులే మాంటేగూ రాయభారము జరుపుటకుముందు మొదటితాలూకా సభను జరిపినవారు.

ఆనేక గ్రామములందు కొలగారపు పాటలమీద వచ్చు ద్రవ్యమును గ్రామములలో గల కట్టువలన పాటలమీదవచ్చునట్టి సొమ్మును ఈ యుద్యను ప్రచారణకొరకు వినియోగింప బడుచున్నది. నెల్లూరు తాలూకా లింగాలగ్రామమందు ఫారెస్టు పంచాయితీల సొమ్ములో కొంతభాగ మీయుద్యమాభివృద్ధి కొరకై వెచ్చింపబడు చున్నది. పరపతి సంఘముల ధర్మనిధినుండిగూడ ఈయుద్యమము సహాయము నొందుచున్నది.

కావున నోయాంధ్రనాయకులారా! ఆంధ్రసోదర ప్రతినిధులారా! ఆంధ్రమహాజనులారా! నాకు తెలిసినవరకు ఈ యుద్యమమందు గర్భితములై యున్న శక్తులలో కొన్నిటినిగూర్చి మీకు నేను ముచ్చటించితిని. మన దేశముయొక్క ప్రస్తుతస్థితిలో దేశాభివృద్ధికి గ్రంథాలయోద్యమము ప్రధమసోపానము. జనసామాన్యమునకు ధర్మాసక్తియు విద్యయు లభించిననేగదావార లభివృద్ధి నొందుట; ఆరెండును ఈ యుద్యమమూలమున లభింపగలవు. కావున మీ యౌదాశీన్యభావమును వదలి ఈ యుద్యమమునకు చేయూత నొసంగెదరు గాక!

- సూరివేంకట నరసింహశాస్త్రి


శ్రీ సరస్వతులు విద్యయు ధనంబు నెక చోట వెలయఁ బోవు నదివలసిన నది యొక్కటేలభించు నెుక్కఁ డిరువురిఁ గొలుచుట, నొప్పు నెచట? నెవరికో యొక్క రికి మనం బెరియకుండఁ బోవు టెట్లబ్బు? సమసూత్రమునకు బ్రేమ మిరువురందున నొకరీతి నెసఁగు నెందు ? ' ఇరువురునుగూడ నొకని బేమించు నెడల నెుక్క మాదిరిగను బ్రేమ మొప్పు నెందు ?

సిద్ధ మియ్యది ప్రకృతి నీక్షితు మేని. , విద్య కధిదేవతయగుచు, వెలయు వాణి ధనమునకు లక్ష్మీయగు నధి దైవతంబు శ్రీని వాణిని వేర్వేరు సేవ సేయ నమరు ఫలమున భేద మెంతైనఁ గలను. శ్రీ మనకు సౌఖ్యమును దరి జేర నీదు వాణి తత్సౌఖ్యము 3 యనవతరం మొసఁగు నె నెంత గొల్చిన భారతి నంత సుఖము,