Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.4 (1918).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రంథాలయ సర్వస్వము రిక్కలన్ని యు తెరచాటు నక్కి పోయె కలువ నిదురించె తుమ్మెద , కులము లే చె వీచుగాలిని రాలిన విరుల వాస నలు చెలు గెను మగ నాలి వలపు కురుల దురిమి రాల్చిన పువ్వులఁ దోఁగెననఁగ అదిగో వినవచ్చెచూడు మ। వ్యక్త మధుగ రవసుధారసధారలు గ్రాలునట్టి


గ్రంథాలయోద్యమము - ఆంధ్రుల సిద్దాంతము

భూగోళముని ప్రాగర్థము భానుకిరణసందీప్తమై, తేజోవంతమై, పుష్టిసంపన్నమై, భాసిల్లు సమయంబున పశ్చిమార్ధమంధకారబంధురంబై నిస్తేజస్కా౦బై భయాపాదకమై సుషుప్త్యవస్థలో మునిగియుండెననుట సర్వవిధితము, అటువలెనే జ్ఞానసూర్యుడు ప్రాగ్దేశములపై కరుణాపాంగప్రసార మొనరించినన్నిదినములు,పాశ్చాత్యసీమ లజ్ఞానవిపినసంక్లిన్నములై ఆనామధేయములై అనాగరక ధ్వాంతావృతములై యుండెడివి. ఎప్పుడో చారిత్రికుల మనో వేగమునకుగూడనందరాని యనుశృతలౌననేక యుగములకు పూర్వము పాశ్చాత్యులు బట్టగట్ట నేరక పశుప్రాయులై మాసాంశనులై దరీద్వారంబుల పర్వతాగ్రంబుల నిచ్చట నచ్చట, నెచ్చటనేని విచ్చలవిడి చెల్లాచెదరై యిల్లు లేక తమవేటాడు మృగములకంటె నావంతయు జ్ఞానము లేనివారై సంచరించునాటికి పూర్వము ప్రాగ్దేళము మనోజ్ఞాహాటకచ్ఛవిభాసమానంబగు నుషఃకన్యయంబోలె జగన్మాతయ విజ్ఞానమున కాలవాలమై యమూల్యమైన యశోధవమును సముపార్జించి యున్నది. ఆకాలంబున బాలసూర్యుడు తన వేయిచేతులనిండారు ప్రేమ గౌగలింప వెల్లువలైపారు నానంద భాష్పప్రవాహమోయన హిమాచలాగ్రములనుండి ప్రవహించు పవిత్రభాగీరథీ తటములయందును లేక విధ్యపరిసరోపవనంబుల గగనకాంతామణి దిద్దుకొననిడుకొన్న నిద్దంపుటద్దమో నానిర్మలంబై విస్తరంగమై విలసిల్లు నచ్ఛోదసరసీతీరఁబులను హోమధూమంబులు మెలమెల్ల లేచి యుంగరములుచుట్టుచు పైకెగయు తావులను కువకువలాడు ముచుపక్షి సంతానములు తమ తమ యవ్యాజగా నామృతమును చిప్పిలజేయు స్థానములందును భారత యోగివరులుజిజ్ఞాసకులై సమాధినిష్టాగరిష్టులైజపతత్పరులై బ్రహ్మపదార్థంబు నిరీక్షించుచు జీవాత్మ పరమాత్మలకు గల బాంధవ్యము తర్కించుచు త్రికాలవేదులై యాత్మారాములై బ్రహ్మానందమం దోలలాడుచుండెడివారు.

ఆకాలంబుననే వైదేహ, కోసల, కాశి, కురు, పాంచాల ప్రకృతి రాజాస్థానములు వాగ్దేవికాటపట్టులై సకల కళారహస్యవేత్తలౌ రాజపుంగవులచేతను, దేవ గురుసన్నిభులే విద్వద్వరేణ్యులచేతను, నలంకరింపబడు చుండెడివి. అట్టి రాజసభామంటపముల విద్వత్పుంగవు లపుడపుడ్డ తార్కిక, వయ్యాకరణ వేదాంతచర్చ లత్యుత్సాహముతో జరిపి శారదాశ్రవణసంతర్పణం బొనర్చు చు౦డువారు. ఆకాలంబుననే సుబల, గార్గి, మైత్రేయి మున్నగు మహాయోగినులు జీవన్ముక్తులై స్వేచ్ఛావిహార మొనరించు చుండెడివారు.

కాలచక్రము కొన్ని వలయములు తిరిగిన దనుక గౌతమ బుద్ధుడు మహావీరుడు మొదలగు మత స్థాపకులకును చరకుడు మున్నగు శాస్త్రనిర్మాతలకు నాలవాలమగు తక్షశిల మొదలగు విద్యాస్థానములును “హుయానుత్స్యాంగు" వంటి పరదేశీయాత్రాపరుల నాకర్షించగల ధాన్యకటక నలంద వంటి విశ్వవిద్యాలయములును మన భారతభూమియం దుద్భవిల్లి జ్ఞానజ్యోతిని వెలుదెసల ప్రజ్వలింపజేసెను. ఇట్టి యుద్యమము నే క్రీస్తుశకము ౧౫ వ శతాబ్దమునందు తంజావూరు పట్టణమున తెలుగు నాయ