Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.4 (1918).pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిర్మింపబడి యున్నది. ఈ భవనమునకు చుట్టును, చిత్రవస్తుప్రదర్శనశాలలును, పటముల నుంచు మందిరములును కట్టబడి యున్నవి. అందుచేత వీధియందు కలుగునట్టి ధ్వనులెవ్వియు గ్రంథాలయ భవనమునకు వినబడకుండును. చుట్టునున్న ఇతర మందిరములకుగాక ఈ గ్రంథాలయ భవనమును నిర్మించుటకై ప్రత్యేకముగ ౧౨ లక్షల రూపాయిలయినవి. భారతవర్షమునందింత సొమ్ము ఒక్క గ్రంధాలయ భవనమువిూద నే వ్యయపరచుట ఇప్పటి స్థితియందు అసాధ్యమగు కార్యమేను. ఆ దేశమునందు ప్రభుత్వము వారి ఔదార్యము ఈ విషయమును బట్టియే గ్రహింపవచ్చును. దరహముమీద ఈగ్రంథాలయమునకు ప్రతి దినమును ప్రత్యేకము గ్రంథములను చదువువారు ౫౦౦ లకు తక్కువ గాకుండ వచ్చుచుందురు. ఇండ్లకు ప్రత్యేకముగ ఎరువిచ్చుటకై కథలతో గూడిన మంచి గ్రంథపోయినవి కొన్ని ప్రత్యేకము గలవు. ౧౯౧౨ సంవత్సరమునం దీగ్రంథాలయమునందు పది రూపాయల విలువగల గ్రంథములు మాత్రము పోయినవి. దీని నుండి సంచారగ్రంథాలయ పేటికలు గూడపంపబడు చుండును. ఈ పేటికలమూలమున, సంవత్సరమునకు పది వేల గ్రంథములు రాష్ట్రమునందలి వివిధ ప్రదేశముల కంపబడు చుండును. విశ్వవిద్యాలయములయందు గూడ గొప్ప గ్రంథాలయము లుండినను, ఈధర్మగ్రంథాలయములు రాత్రులయందు ౮-౯ గంటల వరకును తెరచియుండుట చేత, విద్యార్థులీ గ్రంథాలయములకే తరుచుగావచ్చి జ్ఞానము నార్జించి పోవుచుండెదరు.

ఈ భవనమునకు చు ఇం తేగాక “సిడ్నే" అను పట్టణము ఇంకొక రాష్ట్రమునకు రాజధాని. ఈ పట్నమునందు మూడు గొప్ప గ్రంథాలయములు గలవు. ఒకటి “రిఫరెన్సు” గ్రంథాలయము. ఇందలి గ్రంథములు ఇండ్లకు ఎరువీయ బడవు. గ్రంథములు వలయువారు గ్రంథాలయమునకు బోయియే చదువుకొనవలెను. ఇది ౧౮౨౬ సంవత్సరమున స్థాపింపబడినది. అంతకు పూర్వము గూడ ఆ పట్టణమునందలి గృహస్థులు తమ దగ్గర గల గ్రంథములను పరస్పరము ఎరు