చిరముగఁ గోరుచున్న యది,
చిత్తమునందిలకింపుఁ డాంధ్రజుల్ .
చ, మనలనుగూర్మి గాంచి, యభి
మానముతో మనుపంగజాలి జీ
వనమునోసంగి, యద్భుతి కృ
సామతిఁ జూచి, సలక్షణం గా
ధన యసమాన చాతురి య
ధావిధిఁకన్నుల గట్టినట్టులుం
డీవ మనయాంధ్రమాతను దృ
ణీకరణం బొనరింపకుండ సే
వనుతగుపద్ధతి స్సలిపి,
స్వార్ధపర్వమువీడి తల్లి గా
ఋణమును ఏర్పదీక్షను వ..
హింపగ సోదరులెల్లఁ భ్రార్ధితుల్.
ఉ. వీణయ చేలి బూని, పృధి
వీజన సన్నుతిమైన సత్కళా
జ్ఞానము, గాలము న్వెలయఁ
గమ్మని గీతము, దేవనాదము౯
బూనికఁ గూర్చి సద్భవన
మోహనగానము సేయు శారదా
మానిని, దివ్యవిగ్రహము
మానకలోన భజింపుఁ డాంధ్రజుల్
అప్పుడు ఆహ్వాన సంఘాధ్యక్షులగు శ్రీవిక్రమదేవవర్మగారు ప్రతినిధులకు స్వాగత మొసంగుచు నిట్లుపన్యసించిరి.
ఆహ్వాన సంఘాధ్యక్షుల ఉపన్యాసము
"ఆర్యులారా! ఆంధ్రగ్రంథాలయముల యీ యైదవ మహాసభకుఁ దమ క౦దఱకు వాహ్వానసంఘపక్షమున హృదయపూర్వకమగు స్వాగతము నొసంగుచున్నాఁడను. కృపామతులును, దేశసేవానిరతులును, భాషాభిమానరతులు నగువారందఱును బెక్కు నికట్టుల కోర్చి, యీ గ్రీష్మకాలమున నూష్మబాధను సరకుసేయక పను లడ్డగించిన వాని వారించుకొని మించు తాల్మితో దూరాధ్వములఁ గడచి యీ మహాసభకు విచ్చేసితిరి. మాచేయు సత్కార మల్పమైన, నాదర భావమునను సోదరస్నేహమునను గొఱ౦తలేకుండుటం దప్పులనుసైఁచి యొప్పులుగ గ్రహించి మాయూహలు క్రియారూపమును జెందకున్న నదిశక్తిలోపముగాని భక్తిలోపముగాదని విశ్వసింపఁ వేఁడుకొనువాఁడను.
మా విశాఖపురీభాగ్యవశమున మహానీయులరగుతారందఱు నిమ్మహాసభను సమావేశమైతిరి. బుధగురు కవిసంసేవితమై, మిత్రద్విజరాజ విభ్రాజితమై, మంగళధ్వజశోభితమై, దివ్యప్రభానంతవిభూతి వెలుంగు జ్యోతిర్మండలము భాతి విరాజిల్లు నీ పేరోలగమునఁదెలుంగుఁ బలుకుఁ జెలి నిండుఁగొలువుండుటఁ గనులారఁ జూడఁగంటిమి. మా విశాఖపురి పురాతనపుట భేదనములలో నొకటియై కుళోత్తుంగచోడదేవుని కాలమునుండియుఁ బ్రశస్తిగాంచినట్లు చరిత్రాత్మక నిదర్శనములు గలవు. నాఁటంగో లెఁ బెక్కు మార్పులను జెందినను మానగరము సమశీతోష్ణమై ప్రకృతిశోభారామణీయకమై మలయానిలవిహారోద్యానమై తోయనిధితోయములు శ్రీవిశాఖస్వామి పాదకుశేశయములకుఁ బాద్యము లొసంగుచుండి తద్దివ్యనామమును బడసి విరాజిల్లును. తురక లిసాక్ మదీనాపీరు పేరున నిది పరిఁగినదని పేర్కొందురు. అది చింతనీయము. వతవైషమ్యజ్వాల లీటఁ జల్లారిన వనుటకుఁ దార్కాణముగ రామకొండ నాశ్రయించు త్రిమతముల దేవళములే సాక్షీభూతములు. పరాసు సిబ్బందుల గెల్చి యాంగ్లహస్తవిన్యస్తముగ నీరేవు నర్పించిన దేశహితుండు విజయనగరపాలకుండయిన యానందగజపతీంద్రుఁడు. మా విశాఖపట్టణమండలము బ్రిటిషుప్రభుత్వమునకుఁ బూర్వము స్వతంత్రాధికారములతో రాజ్యముచేసిన ప్రసిద్ధ వంశజులయిన రాజాధిరాజుల నివాసస్థలమైయుండెను. ఇప్పటికిని దొమ్మిది పాళ్ళు జమీందారియు నొకపాలు దొరతనమువారి నేలయునై యున్నది. మన ప్రభువులు విద్వత్పక్షపాతముగలవారలై కొలువుకూటములు పండితసభలుగా నిరంతరమును విద్వగ్గోష్ఠితోఁ గాలముఁ బుచ్చుచుండిరి. అగ్రహారములు, మాన్యములు మొదలయిన పెక్కు బహుమతులతోఁ గవులు, పండితులు, గాయకులు, వైద్యలు; శిల్పకారు