Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.3 (1918).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీయులుకు నగు శ్రీఆకెళ్ల సూర్యనారాయణరావుగారిని గ్రంథాలయప్రదర్శన పత్రికాప్రదర్శన ప్రారంభోత్సవమును సాగింప ప్రార్థించెద.

అంతట శ్రీఆకెళ్ల సూర్యనారాయణరావు గారు ప్రదర్శనములను తెరచి, ప్రదర్శింపబడిన వస్తువులను, పత్రికలను గ్రంథములను విశేష ఆసక్తితో దిలకించిరి.

పత్రికలు

ఈ ప్రదర్శనము మహారాజా గజపతి హిందూపఠనమందిరముయొక్క పైయంతస్థునందు ఏర్పరుపబడినది. హాలు అంతయు పలువిధములగు ప్రదర్శనములతో నలకరింపబడి మిక్కిలి శోభస్కరముగ నుండెను. - హిందూదేశముయొక్క అన్నిభాగములనుండియు బెంగాలీ, గుజరాతీ, హిందీ, ఉర్దు, మహారాష్ట్రము, అరవము, తెలుగు, ఆంగ్లములయందు ముద్రింపబడుచున్న ౪౦౦ పత్రికలు ప్రదర్శింపబడెను. ఇవియన్నియు పెద్ద పెద్ద బల్లలమీద పరువబడి యున్నవి. వీనియందు దినపత్రికలు, వారపత్రికలు, పక్షపత్రికలు, మాసపత్రికలుగూడ గలవు. ఇంతే గాక ఆంధ్రభాష యందిదివరకు ప్రకటింపబడియున్న ప్రాచీన పత్రికలనేకము ప్రదర్శింపబడినవి. వీనిలో గొన్నిటిని శ్రీ అద్దంకి సత్యనారాయణ శర్మగారును, మరికొన్నిటిని మారేపల్లి రామచంద్రశాస్త్రి గారును ప్రదర్శించిరి. మిగిలిన పాత పత్రికలన్నిటిని కొడాలి శివరామకృష్ణారావుగారి సహాయముతో బెజవాడ రామమోహన ధర్మగ్రంథాలయమువారు ప్రదర్శించిరి.

భారతవర్షమునందు వివిధ భాషలయందు ప్రకటింపబడుచున్న ఇన్ని పత్రికల నొక్కచో జూచు సరికి, భారతమాత ప్రత్యక్షమైనట్లే కన్పట్టెను. ఈ పత్రికాప్రదర్శనమువలన మహత్తరమైన లాభముగలిగెను. భారతవర్షమునందిన్ని పత్రికలు గలవాయని పత్రివారును ఆశ్చర్యపడసాగిరి. అట్లు ఆశ్చర్యపడుటతో సంతృప్తిని వహిఁపక, ఆంధ్రమునందున్న పత్రికలకు ఇతర భాషలయందున్న పత్రికలను పోల్చిచూచి ఆంధ్రపత్రికలు ఏవిషయములయం దభివృద్ధిని పొందవలసియున్నచో, గుర్తించిరి.

సంచారగ్రంథాలయములు.

వీనికి పిమ్మట గనపడునవి రెండుపెట్టెలు. అందులో ఒకటి చిన్నది. రెండవది పెద్దది. రెండుపెట్టెలనిండ పుస్తకములు కలవు. వీనికే సంచార గ్రంథాలయ పేటికలని పేరు. గ్రంథాలయములేని గ్రామమునకు వీనినిపంపి అచట అవసరమును బట్టి ౧౫ దినములు మొదలు ౩౦ దినములవరకు ఉంచెదరు. అందుగల గ్రంథములను గ్రామస్థుల కెరువిచ్చి వానిని భద్రముగానుంచుటకు ఎవరైన పూనుకొనినయెడల, వారి గ్రామమున కీసంచార గ్రంథాలయపేటిక పంపబడును. ఆగ్రామస్థులు అందుండు గ్రంథములను చదివిన పిమ్మట ఆపెట్టెను వేరొక గ్రామమునకంపి, ఇంకొక రకము గ్రంథములు గలిగిన పెట్టెను ఆగ్రామమునకుపబడును. ఈపద్ధతి వలన గలుగు ప్రయోజనమును అందరురు మెచ్చుకొనిరి.

గ్రంథవిభజనపేటిక

వీనికి ప్రక్కనే, గ్రంథవిభజన పేటిక ఉంచబడినది. ఇది ఒక గ్రంధాలయము నందున్న గ్రంథములయొక్క పట్టిక. ప్రతిగ్రంధము నకును పుస్తకము యొక్క పేరు - గ్రంథకర్తపేరు - విషయము - వీనిని విడివిడిగా "కార్డుల” యందు వ్రాసెను. ఈ పేటిక యందు 3 అరలున్నవి. ఒక అరయందు పుస్తకముల పేర్లు అకారాదిగా వ్రాసిన 'కార్డు" లుండును. రెండవ ఆరయందు గ్రంథకర్తల పేర్లనుబట్టి అకారాదిగా "కార్డు"లుండును. మూడవ ఆరయందు విషయ విభాగమును బట్టి గ్రంథములు అకారాది గానుండును. ఇట్టి గ్రంధముల పట్టికవలన అనేకలాభములు గలవు. ఒక చదువరి గ్రంథాలయమునకు వచ్చి పుస్తకముల పేర్లనుబట్టి తనకు కావలసిన గ్రంథమును నిర్ణయించుకొనదలచిన యెడల, మొదటిఅర వానికి సహాయభూతమగును; గ్రంథకర్తల పేర్లను బట్టి తనకు కావలసిన గ్రంథమును నిర్ణయించుకొనదలచిన రెండవఅర