Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.3 (1918).pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్రంథాలయము (పద్యములు)

వేదశాస్త్రపురాణ విద్యారహస్యంబు
       లాలింపఁజేయు గ్రంథాలయంబు
సర్వతంత్రాక్రాంత చర్చామృతరసంబు
       గ్రోలింపఁజేయు గ్రంథాలయ౦బు
స్వాతంత్ర్యమున సర్వసర్వంసహారాజ్య
       మేలింపఁజేయు గ్రంథాలయంబు
కామాదినిద్విప ద్రౌమ ప్రకోపంబుఁ
       మాలింపఁజేయు గ్రంథాలయంబు
ధర్మనీతివివేక మర్మంబు లనిశంబు
       గిలింపఁజేయు గ్రంథాలయంబు
సంసారసంతాప సాగరంబుననుండి
       తేలింపఁజేయు గ్రంథాలయంబు
దేశాభిమాన విద్వేషప్రతాపంబు
       వ్రాలింపఁజేయు గ్రంథాలయంబు
ఉగ్రాత్ములగు నాస్తికాగ్రగణ్యుల నెల్ల
       సోలింపఁజేయు గ్రంథాలయంబు
సరసగానకవిత్వ సాహిత్యములఁ గడఁ
       గ్రాలింపఁజేయు గ్రంథాలయంబు
లౌకిక ప్రజ్ఞావివేక ప్రచారంబుఁ
       బాలింపఁజేయు గ్రంథాలయంబు
రసనాగ్రమందు సరస్వతిందాండవం
       బాడింపఁజేయు గ్రంథాలయంబు
అవ్యయంబగురీతి దివ్యతేజోరాసి
       నార్జింపఁజేయు గ్ర౦థాలయంబు
సత్పాత్రులైన విద్వత్పుంగవులఁజీరి
       ప్రార్థింపఁజేయు గ్రంథాలయంబు
స్థైర్యయుక్తంబైన ధైర్యసాహసలక్ష్మి
       నాశింపఁజేయు గ్రంథాలయంబు
అత్యాశమైదూకు మృత్యు దేవతనైన
       నడలింపఁజేయు గ్రంథాలయంబు
భక్తివైర్యాసంసక్తి సార్థక్యంబుఁ
       బ్రాప్తింపఁజేయు గ్రంథాలయంబు
నానామతాంచిత జ్ఞానోదయస్ఫూర్తి
       సర్థింపఁజేయు గ్రంథాలయంబు
చిత్రసృష్టిక్రియా పాత్రసాధనశక్తి
       న౦డింపఁజేయు గ్రంథాలయంబు
మించుఁ గార్యములు సాధించు విద్యుచ్ఛక్తి
       నర్పింపఁజేయు గ్రంథాలయంబు
ఘనయశోయుతులైన కవిసార్వభౌముల
       సర్చింపఁజేయు గ్రంథాలయంబు
కాలమెరిగింపఁజేయు గ్రంథాలయంబు
       శీలముఘటింపఁజేయు గ్రంథాలయంబు
ఆలయములకు నెగ్గు గ్రంథాలయంబు
       పాలపైఁబొల్చునిగ్గు గ్రంథాలయంబు.

—పిసుపాటి చిదంబరశాస్త్రి, శతావధాని.


ద్వితీయ ఆంధ్ర దేశ గ్రంథాలయ ప్రదర్శనము.

ప్రథమ భారత పత్రికా ప్రదర్శనము.

ఈ ప్రదర్శనముల యొక్క ప్రారంభోత్సవము ౧౮ స౦ ౹౹ జూను గెల ౨౨ వ తేదీ ఉదయము ౭ గంటలకు పఠనమందిరమున జరిగినది. ఆహ్వానసంఘాధ్యక్షులగు భూపతిరాజు వేంకటపతిరాజుగారు ప్రతి నిధులకు స్వాగతమిచ్చుచు ఇట్లుపన్యసించిరి:౼

ఆహ్వానసంఘాధ్యక్షుల ఉపన్యాసము.

గ్రంథాలయోద్యమము మనదేశమున చిరకాలము నుండి వ్యాప్తిలో నున్నను కొంతకాలము క్రిందటనుండి క్రొత్త పద్ధతులవలంబించి, క్రొత్త త్రోవలు త్రొక్కి, పూర్వముకంటె హెచ్చుగా జనసామాన్యమునకు ఉప