గుంట్ల వేంకటసుబ్రహ్మణ్యం గారును ఆహ్వానములక౦పిరి. అంతటితో నాటి సభ ముగిసినది.
తిరిగి ౨౩-౬-౧౮ తేదీ ఉదయము తొమ్మిదిగంటలకు పురమందిరమున సభకూడెను. అప్పుడే దిగువ తీర్మానములు చేయబడినవి:-
తీర్మానములు
౧ ప్రపంచ కళ్యాణము కొరకును ధర్మసంస్థాపనకొరికును మన ఏలికలిప్పుడు జరుపుచున్న మహాసంగ్రామమున, వారి కచిరకాలమున జయము పరమేశ్వరుడు చే కూర్చుగాత మని ఈ సభవారు భగవంతుని ప్రార్థించు చున్నారు.
అగ్రాసనాధిపతి.
౨. ఆంధ్రమహాజన సభతోబాటుగ ఈగ్రంథాలయ సభను ఆంధ్రమహాజనసభ జరుగు ప్రదేశములయందే ప్రతివత్సరము జరుపుచుండవలెనని, ఆసభవారు చేసిన తీర్మానమును ఈసభవారు అంగీకరించుచున్నారు.
ఈతీర్మానమునకు వ్యతిరేకముగ నేలనూతుల సుబ్బారావుగారు (మద్రాసు), కె.యస్. నారాయణరావుగారును మాట్లాడిరి. అంతట ఓట్లు తీసికొనగా ఈతీర్మానమునకు అనుకూలముగా ౧౯ మందియును, వ్యతిరేకముగా ౧౭౧ మందియును సమ్మతులనిచ్చిరి. అందుచేత ఈతీర్మానము ఓడిపోయెను.
౨. ౧౮౬౦ సం॥ 0౨౧౧ నెం. ఆక్టు ప్రకారము రిజిస్టరు కాగోరు గ్రంథాలయములయొద్దనుండి రుసుమును వసూలు పరచకయే అట్టి రిజస్టరీ అంగీకరింపవలెననియు, ఆంధ్రజేశగ్రంథాలయములన్నిటికి ఆంధ్రభాషయందు దోరతనమువారు ముద్రించు ప్రకటనము లన్నింటిని ఉచితము దొరతనమువారు ఇచ్చుచుండవలెననియు గ్రంథాలయములకు స్థానిక స్వపరిపాలనా సంఘములనుండియు దొరతనమువారి బొక్కసమునుండియు ధనసహాయము చేయుచుండవలెననియు ఈసభవారు దొరతనమువారిని ప్రార్థించుచున్నారు,
అగ్రాసనాధిపతి
3. గ్రంథాలయముల యాజమాన్యము క్రింద ఆంధ్రుల ప్రత్యేకవ్యక్తిని, కళలను, ఆచారములను, పండుగలను, వర్ధంత్యుత్సవ ములను, ప్రోత్సాహపఱచుటయు — తనకు సంబంధించిన రాత్రిపాఠశాలలయందు, ఆంధ్రుల ప్రత్యేక వ్యక్తిని, కళారూపమును దెలుపు విద్యావిధాన మవలంభింపవలెననియు ఈసభవారు ఆంధ్రదేశ గ్రంథాలయ సాంఘికులను కోరుచున్నారు.
౪. ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘమునకు బెజవాడ రామమోహనధర్మ గ్రంథాలయము కేంద్రగ్రంథాలయముగా జేయుచు, ఆంధ్రదేశ గ్రంథాలయసంఘమువారిచే నిర్వచింపబడిన నిబంధనల ననుసరించి అత్సంఘమును నిర్వహించుటకీ సభవారు తీర్మానించుచున్నారు.
ఈ తీర్మానమునుగూర్చినచర్చ ఆఖరు కాకుండుటచే ౧౦-౩౦ గంటలకు సభ ముగింపబడి, తిరిగి మధ్యాహ్నము ౨ గంటలకు కూడెను. అప్పుడు కొంత చర్చ జరిగినపిమ్మట అందరిచే నేకగ్రీవముగ నంగీకరింపబడెను.
౫. ఆంధ్రపరిశోధక మహామండలి పక్షమున పిఠాపురమునందు లిఖితమాతృగ్రంథాలయమును స్థాపించి ఆంధ్రదేశ భాషావాఙ్మయ చరిత్రెభివృద్ధికి బాటుపడుచున్న ఎర్నగూడె౦ జమీందారులగు శ్రీ చెలికాని లచ్చారావుగారి నీసభవారు హృదయపూర్వకముగ నభి