Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.3 (1918).pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ఆంధ్ర మహాజనసభ స్థాపితోపసంఘము వారు సంచార కార్యదర్శి కొరకు ... ౧౫౦౼౦౼౦
వెరసి ...౨౨౬౼౧౦౼౦
వ్యయము:౼
ప్రధమగ్రంథాలయప్రదర్శనమునకు వస్తువులను పంపుటకు, తిరిగి తెప్పించు కొనుటకు అయిన వ్యయములు ... ౨౦౼౦౼౦
పోస్టుఖర్చులు ... ౧౬౼౪౼౬
పత్రికలు ... ౭౼౧౩౼౦
చిల్లరలు ... ౭౼౧౦౼౦
అచ్చు ... ౭౼౪౼౦
గ్రంథములు ... ౦౼౧౪౼౦
టెలిగ్రాఫ్ లు ... ౨౼౧౧౼౬
సంచార కార్యదర్శుల జీతములు రైలు ఖర్చులు ... ౯౨౼౧౦౼౬
గతవత్సరము తాలూకు బాకీతీర్చినది ... ౫౬౼౧౩౼౯
.............................. ౫౬౼౧౩౼౯
నిల్వ:౼ రు ౧౪౼౮౼౯

సోదరులారా! ఈవత్సరమున జరిగిన పనినిగూర్చియు, ఆదాయవ్యయములగూర్చియు మీరువినియే యున్నారు. ఇట్టి ఆదాయముతో మనమిక ముందు కార్యములను కొనసాగించుట దుర్ఘటము. ముందు మనము ప్రారంభింపవలసిన మహత్కార్యములను గూడ వివరించి యుంటిని. ఇంతేగాక బెజవాడ రామమోహన గ్రంథాలయమువారు కేంద్ర గ్రంథాలయ విషయమై చేసిన ప్రయత్నములను గూడ మీకు విశదపరచితిని. వావిళ్ళవారి దానముతో కేంద్రగ్రంథాలయుస్థాపనయు, మనసంఘముయొక్క స్థిరత్వమును తప్పని సరివయ్యెను. కావున ఈవిషయములన్నిటిని చక్కగాయోచించి, కార్యవిధానమును నిర్ణయించెదరని కోరుచున్నాడను.

నిస్సారమును, భావోద్రేకరహితమును నగు నీదీర్ఘవ్యాసమును మీరు ఓపికతో విన్నందులకు నాహృదయపూర్వకవందనము లర్పించుచున్నాడను.

సభనలంకరించిన పెద్దలలో గొందరు: ఆకెళ్ల సూర్యనారాయణ రావు గారు, భూపతిరాజు వేంకటపతిరాజు గారు; సి.పి.ఎన్. నరసింహరాజుగారు, మహామహోపాధ్యాయ తాతా సుబ్బరాయశాస్త్రిగారు, దివాకర్ల తిరుపతిశాస్త్రిగారు, వఝుల చినసీతారామశాస్త్రీ గారు, రాయబహద్దరు సూర్యనారాయణశాస్త్రీగారు, ఆచంట వేంకట రాయసాంఖ్యాయనశర్మగారు, బుర్ర శేషగిరిరావుగారు, ప్రభల లక్ష్మీనరసింహముగారు, ఎనమండ్ర నారాయణమూర్తిగారు, రావు బహద్దరు నరసింహారావుగారు, చెలికాని లత్సారావుగారు, దేవులపల్లి స్వామిశాస్త్రిగారు, నేలనూతుల సుబ్బారావుగారు, శ్రీజగన్నాథ పాడిఖడంగగారు, కోలవెన్ను రామకోటేశ్వరరావుగారు, ఉమ్రేఆలీషాకవి గారు, ఆతీ అప్పడు పంతులుగారు, కోపల్లె హనుమంతరావుగారు, బెల్లంకొండ రాఘవరావుగారు, తిత్తి బలరామయ్యగారు, వంగూరి సుబ్బారావుగారు, తల్లా ప్రగడ సూర్యనారాయణరావు గారు, సి.వి.రంగం శ్రేష్టి గారు.

పిమ్మట సభకు రాజాలమనియు, జయప్రదముగ జరుపబడుగాకయని భగవంతుని ప్రార్థించుచు వ్రాసిన ఈ క్రింది వారు పంపిన యుత్తరములును తంతీవార్తలును జదువబడెను:— కొడాలి శివరామకృష్ణారావుగారు, గోనుగుంట్ల వేంకటసుబ్రహ్మణ్యంగారు, బూదూరు రామానుజులురెడ్డిగారు, పొనకాపట్టాభిరామారెడ్డిగారు, ఆరెకపూడి రామశాస్త్రులుగారు, దేవరాజు సీతారామ స్వామిగారు, ఆచంట సూర్యనారాయణరాజుగారు, సోంభొట్ల వెంకయ్యగారు, తాడంకి వెంకయ్యగారు, చట్టి నరసింహారావుగారు. రాబోవువత్సరము ఈ సభను బందరునందు జరుపవలసినదని కొడాలి శివరామకృష్ణాగావుగారును, చెన్నపట్నమునందు జరుపవలసినదని గోను