గ్రంధాలయోద్యమము ప్రయోజనకారియై యున్నది. ఏపండితుడు, ఏవార్తాపత్రిక, ఏపాఠశాల నిర్వహింపజాలని మహాకార్యమును గ్రంథాలయములు నిర్వహింపజాలని మహాకార్యమును గ్రంథాలయములు నిర్వహించుచున్నవి. ఆంధ్రోద్యమసాధ్యములైన సకలా దర్శములును నాంధ్రగ్రంథాలయములయందు విస్పష్టముచేయబడుచున్నవి.
భారతవర్షముంతకునుఁ భారతవర్షమున కననేల ప్రపంచమున కంతకును, ఆంధ్రదేశమునందు ప్రబలియున్న గ్రంథాలయోద్యమము ఆదర్శప్రాయమైయున్నది. ఇట్లంటినని స్వోత్కర్షగభావింప వలసినది లేదు - ప్రపంచ మునందెచటనైనను, ఎవ్వరికైనను, స్వస్వరూపానందము లభించినగాని ఆత్మౌన్నత్యమును బొందజాలరు. అదేవిధమున, మనయుద్యమముయొక్క స్వస్వరూపానందము ననుభవించినగాని, ఉద్యమమునం దున్నతస్థానము నాక్రమింపజాలము. కావున ఈ యుద్యమము యొక్క శ్రేష్ఠతను గ్రహింపవలెను. గ్రహించి అనుభవింపవలెను. అప్పుడుగాని ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమము ప్రపంచమున కంతకును ఆదర్శప్రాయతని గోచరింపదు. ఇట్టి మహోత్కిృష్టమైన ఉద్యమాశయములను భారతవర్షమునకును, తన్ములమున ప్రపంచమునకంతకునుగూడ ఒసంగుట మన విధ్యుక్తధర్మమై యున్నది.
గ్రంథాలయ సర్వస్వము.
ఈధర్మమును నిర్వర్తించుటకై ఈసంఘపక్షమున ప్రకటింపబడు గ్రంథాలయ సర్వస్వమును ఆంగ్లేయభాష యందుగూడ ప్రకటించుటకై ప్రయత్నించుచున్నాము. గ్రంథాలయ సర్వస్వము యొక్క రెండు సంపుటములు ముగింపబడినవి మూడవ సంపుటమునందు ఒక సంచిక వెలువడినది. రెండవ సంపుటమునకు రు ౧3౦ లు నష్టమువచ్చి యుండినను, సంవత్సరమునకు నాలుగు సంచికలకు బదులు ఆరు సంచికలను ప్రకటింపవలెనని నిర్ణయించుకొంటిమి.
భవిష్యత్తు.
ఆంధ్రదేశమునందు గ్రంథాలయోద్యమము ఇంతవరకు, భారతవర్షమున జన్మించిన యుద్యమములన్నింటికంటె మిన్నయకు నభివృద్ధినే జూపియున్నది కాని గ్రంథాలయములను నిర్వహించువారి కి౦తటితో తృప్తి గలుగలేదు. వారు ఇంకను పలువిధములు ఆంధ్రవ్యక్తి వికాసమునకును, ఆంధ్ర దేశాభ్యుదయమునకును పాటుపడవలెనని సంకల్పించుకొనియున్నారు మూడవ ఆంధ్ర దేశ గ్రంథాలయ ప్రతినిధుల మహాసభకగ్రాసనాధిపతులగు శ్రీ కాశీనాధుని నాగేశ్వర్రావు గారిట్లు చెప్పిరి:౼
“గ్రంథాలయములు, పఠనమందిరములు, వ్యాయామనిలయంబులై, కర్మక్షేత్రంబులై, సేవాసదనంబులై, విద్యాలయంబులై సుందర మందిరంబులై, నాటకరంగంబులై, ధర్మసంరక్షణ సాధనంబులై విరాజిల్లునప్పుడు జాతీయ వికాసంబునకు మహత్తరంబైన సాధనంబులు కాగలవు."
ఇందుసూచింపబడిన విషయములయందన్నిటియందును మనము ఇంతవరకు కొద్దిగానో, గొప్పగనో పనిచేయున్నాము. అయినను మనము ఆయావిషయములందింతకంటే ఎన్నియో మడంగులెక్కువగ కృషి విపలుపవలసియున్నది.
కావున ఈవత్సరమునుండియు, ఆంధ్రదేశ గ్రంథాలయసంఘమునకు ౧ సేవాశాఖ ౨ సారస్వతశాఖ 3 వ్యాయామశాఖ ౪ లలిత కళాశాఖ ౫ నిమ్మ జాత్యుద్ధరణశాఖ ౬ విద్యాశాఖలను స్థాపించి మనకు చేతనైనంతవరకు పనిజేయుట అత్యంతావశ్యకమై యున్నది. వివిధములగు ఇన్నిపనులను బెట్టుకొనుటవలన మనపని ఇప్పటికందే అనేకవిధముల పెరుగుననుట కేంత మాత్రమును సందియము లేదు. అయినను మనము ఎంతమాత్రమును సంకోచింపవలసినది లేదు. అల్పారంభములే మహదువ్యమములగుచుండుననుట మనకు స్వానుభవవైక వేద్యమేగదా; కావున ముందంజవేయుటయేగు గాని వెనుకకడుగువేయ వలసినదిలేదు.
మనము చేయవలసిన ముఖ్యమగుపనిఇంకొకటిగలదు. ప్రపంచమందెచటనైనగాని మతముపైనను ధర్మముపైన