Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.3 (1918).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చక్కనికట్టు దిట్టములతో సాంఘికుల శ్రేయోభివృద్ధికై నిరంతరము తోడ్పడుచుండును, ప్రతిసంవత్సరమునందును జరుగు శ్రీసీతారాముల కళ్యాణమహోత్సవమును ఆ గ్రంథాలయ సభ్యులు స్వయముగ వీక్షించి తరించు చున్నారు. ఇట్లు తాము పొందుచున్న లాభముతో తృప్తివహింపక, గ్రంథాలయోద్యమమును ప్రచారము చేయుచున్న తోడిసోదకులకు గూడ, ఆ లాభమును అందజేయవలెనని ఆ సంస్థుకార్యదర్శిగారు తలంచిరి. స్వయముగ స్వామి కళ్యాణమును దర్శింపకపోయినను, సీతారాముల కళ్యాణమహోత్సవతలంబ్రాలు బియ్యమును శిరస్సున ధరించినచో సాక్షాత్స౦దర్శనఫలము లభించునని సనాతనధర్మావలంబకు లందరికిని నమ్మకము గలదు. ఈ నమ్మకము ననుసరించి ఆంధ్రదేశగ్రంథాలయ సంఘసభ్యుల కందజేయవలసినదని, ఆ పట్టణగ్రంధాలయ కార్యదర్శి మన అందరియొక్క శ్రేయస్సును గోరుచు శ్రీవారి తలంబ్రాలను భక్తి పురస్సరముగ మనకు పంపి యున్నారు. వీనిని మీరందరును ఇప్పుడే స్వీకరింపఁ గలరు. మనము పరికించి చూచి

ఈ ఒక్క విషయమును మన గ్రంథాలయోద్యమమునందు ఎట్టి శక్తులు నిగూఢమై యున్నవో వనకు బోధపడక మానదు. మొదట ఆ గ్రంథాలయ సభ్యుల ఈశ్వరభక్తి పొగడ దగినది. పిమ్మట వారు పొందు లాభము వారితోనే నిల్వక “సర్వేజనాఃస్సుఖినోభవన్తు" అను యార్యోక్తి ప్రకారము ఆ లాభము తమ సోదరులకు గూడ లభింపజేయవలయుననువారలకు గల గాఢమగు వాంఛ మనకు గోచరించు చున్నది. దీనివలన మఱియొక విషయముగూడ విషాదమగుచున్నది. భారతీయులు ఎప్పుడును స్వలాభముతోడనే సంతుష్టి నొందరనియు “ప్రపంచమంతయు తన లాభముకొరకే ఈశ్వరునిచే సృష్టింపబడెనని పాశ్చాత్యసిద్ధాంతమును త్రోసివైచి, “ఆత్మవత్సర్వ భూతేషు | యఃపశ్యతి సపశ్యతి” (ప్రపంచమంతను తనవలెనే చూచుకొనువాడే జ్ఞాని) అను నార్యోక్తిని కేవల మాదర్శముగా నుంచుకొనుటయేగాక, అవకాశము కలిగినపుడెల్ల ఆచరణలోనికి తెచ్చుకొనుటకై ప్రయత్నించువారను మరియొక యంశము తేలుచున్నది. ఎట్టి పిదపకాల మాసన్నమైనను, మన దేశమునందు అనుశృతముగ వచ్చుచున్న మర్యాదలను రూపు మాప సమర్ధములు కల పరిస్థితు లెంతగా వ్యాపించి విజృంభించు చున్నను, ఆర్యధర్మము సనాతనమనియు ఆర్యావత౯మందలి ధారావాహికజ్ఞానము అనశ్వరమనియు ఈ చిన్న విషయము మనకు బోధించు చున్నది. అంశముస్వల్పమేమైనను ఆలోచించిన కొలదిని, ఈఒక్క దానిని బట్టియే, మన కెన్నియో మహత్తరములగు నంశములు స్ఫురించు చున్నవి.

మన ఉద్యమప్రాశస్త్యము

గ్రంథాలయోద్యమము యొక్క ప్రాశస్త్యమును గూర్చి మీకు విశేషముగ జెప్ప నక్కరలేదు. ఏ గ్రామమునందైననేమి ట్టణమునందైననేమి, నిత్యజీవనమును గలిగి, నిత్యమును జనుల నుద్బోధింప శక్తి గిలిగిన వీ గ్రంథాలయములే యని చెప్పిన అతిశయోక్తి ఎంతమాత్రమును గాదు. మన సోదరుల జీవితములు పవిత్రపురుషార్ధ సాధకములుగను చేయవలెసన్న ఈ యుద్యమమే పరమతారకమై యున్నది. వంతములుగను, కాని, గ్రంథాలయోద్యమము ఆంధ్రదేశమునందు ఏయే పరిస్థితులయం దభివృద్ధిని జెందుచున్నదో, అట్టిది ఇతర దేశములయం దెచటను గనుపింపదు. బరోడా రాజ్యమునం దైనను, ప్రభువుల సహాయముచేతనే గ్రంథాలయములు స్థాపింపబడి, పోషింపబడు చున్నవి. మన దేశముసందబులగాదు “కార్నీ జీ” వంటిదాతల దాతృత్వమింకను ఈయుద్యము వైపునకు మరలలేదు- "బరోడా” యందువలె ప్రభువుల సహాయమింకను ఈయుద్యమము పట్ల లభింపలేదు - ఇతర దేశముల యందువలె ప్రొత్సాహము లేకపోవుట యటుండ ఈ యుద్యమముకు నాయకుల మనోదృష్టియం దైన స్థాన మేర్పడి యుండలేదు. గ్రామస్థులకన్ననో ఈయుద్యమతత్వ మింకను బోధపడలేదు.