Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.3 (1918).pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంఘములు చక్కగ పనిచేయుచున్నవి. ఇందులో బాపట్ల తాలూకా గ్రంథాలయసంఘ కార్యదర్శిగారగు శ్రీ కోన వెంకటరాయశర్మగారు తమతాలూకాయందే గాక, జిల్లాయం దితరభాగములయందుగూడ సంచారముచేయుచు జే నుంచు పాటుపడుచున్నారు. బాపట్ల తాలూకాకు తాలూకాగ్రంథాలయ ప్రతినిధుల మహాసభగూడ జరిగిది. ఈవత్సరము కృష్ణా, గోదావరి, గుంటూరు మండల గ్రంథాలయ ప్రతినిధులు మహాసభలు, మండల రాజకీయసభలతో బాటుగ జరిగినవి. గ౦జాంమండల గ్రంథాలయ ప్రతినిధుల మహాసభ ప్రత్యేకమ్యు టెక్కలి యందు జరిగినది. గోదావరిమఁడల గ్రంథాలయ ప్రతినిధుల మహాసభనుగూడ రాబోవువత్సరమునుండియు, మండల రాజకీయసభతోబాటుగచేయక, ప్రత్యేకముగానేనిర్వహించేటకు తీర్మానించియున్నారు. మండల రాజకీయసభతోగూడ చేయట వలన, ఈసభ యొక్కకార్యములు సరిగ నెరవేరుటలేదనియు, అందుచేత ఈ సభను మండల రాజకీయ సభనుండి వేరుపరచితి మనియు ఆజిల్లా గ్రంధాలయ సంఘకార్యదర్శులు దెలుపుచున్నారు. ఈ సభను రాబోవుసంవత్సరము చిత్రాడకాహ్వానించియున్నారు.

ఈవత్సరము గంపలగూడెమునందు జరిగిన కృష్ణామండల గ్రంథాలయసభయందు ఆమండలమున గ్రంథాలయోద్యమమును వ్యాపింపజేయుటకుగాను, ప్రత్యేకమొకకార్యదర్శిని నియమించుటకై ప్రయత్నించిరి. కార్యదర్శికి జీతము, ప్రయాణవ్యయములు మున్నగు ఖర్చులన్నిటికిని గలిపి వత్సరమునకు రు ౫౦౦ కావలయును. ఇరువది గ్రామములవారు గ్రామమునకు ఇరువది యైదురూపాయిల చొప్పున ఇచ్చిన ఈపని సుకరముగ నెరవేరగలదని తలంచి ౫ గ్రామములనుఁడివచ్చిన పతినిధులు తమతమ గ్రామములయఁదు ఇరుపరియైదరూవ్యములచొప్పున వసూలుజేసి పంపెదమనిరి. త్వరలోనే ఈపని నెరవేరవచ్చును.

సంచార కార్యదర్శి.

ఈ సంఘపక్షమున దవ్వురిజగన్నాధశర్మగారిని సంచార కార్యదర్శిగ నియమించియున్నారు. కాని మూడుమాసములకాలము పనిజేసినపిమ్మట అనివార్యములగు కారణాంతరములచేత వారు మానుకొనవలసివచ్చినది. వారు బాపట్ల, పిఠాపురములయందు జరిగిన గ్రంథాలయసభలకుబోయి యుపన్యాసముల నిచ్చియు గుంటూరుజిల్లా యందు కొన్ని గ్రంథాలయములను దర్శించియు పాటుపడియున్నారు. వఱియు గోదావరిజిల్లా యందలి కాకినాడ తాలూకాయందు సంచారము చేసి నూతన గ్రంథాలయములను స్థాపించుటకై విశేషకృషినిసల్పి యున్నారు.

వీరికి పిమ్మట గోపరాజు బ్రహ్మానందంగారు ఈ సంఘపక్షమున పనిజేసి యున్నారు. వీరును గ్రంథాలయములకు బోయి నిబంధనలు జేసికొనుట మున్నగు విషయములయందు దోడ్పడి యుండిరి.

గ్రంథాలయ శాస్త్రగ్రంథములు.

పాశ్చాత్యదేశములయందు గ్రంథాలయములు ఎట్లు నడువవలయునో, ఎట్లు జనుల నాకర్షింపవలయునో, ఎట్లు గ్రంథముల నుంపవలయునో, ఎట్లు గ్రంధములను విభజింపవలయునో ఎట్లు భవనములను నిర్మింపవలయఁనో ఈ విషయములన్నియు ప్రత్యేక మొకశాస్త్రమె విలసిల్లినది. అందుచేత మన మా శాస్త్రమునుగూడ కొంత వరకు దెలిసికొనుట ఆవశ్యకమై యున్నది. కావున ఈ సంవత్సరము గూడ గ్రంథాలయశాస్త్రగ్రంథములను కొన్నింటిని తెప్పించి యుంటిమి.

రామప్రసాదము.

పావనవంతమును, పుణ్యఫలప్రదంబును నగు శ్రీగోదావరినదీ తీరమునందు భద్రాచలపుణ్యక్షేత్రము గలదుగదా! ఆ క్షేత్రమునందు ప్రతిసంవత్సరమును చైత్రశుద్ధనవమికి శ్రీసీతారామచంద్రుల కళ్యాణమహోత్సవము జరుగునేను సంగతి మీ కఁదరికిని దెలసీయే యున్నది. భద్రాచలక్షేత్రిమునందు “శ్రీకల్పవల్లి గ్రంథనిలయ” మను పేరున గ్రంథాలయ యొకటి కలదు. ఆ గ్రంథాలయము