Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.3 (1918).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చుటకనువుగానుండును గదా? దేవాలయమునకుడు గ్రంథాలయమునకును సంబంధములుగ జేయుటవలన, గ్రంథాలయమునకు కొందరిని రాకుండ జేయుచున్నామేమోయను సపోహ కొందరు గలుగవచ్చును. కావునమన మిట్టి నపోహకవకాశము లేకుండ చేయుట కర్తవ్యము.

గ్రంథాలయములకును, దేవాలయములకును పరస్పర భా౦ధవ్యముండు యొక్క యావశ్యకతను గ్రహించి, నూజివీడునందు సత్పురుషుల సహాయముతో సూరి సీతారామయ్యగారను భక్తవర్యుడు సీతారామమందిరమును నిర్మించియున్నారు. ఇందు దేవాలయమును గ్రంధాలయమును కలసియే యున్నవి. ఇదేరీతిని గుంటూరు పట్టణయి గూడ పాటి౦డ సూర్యనారాయణ పంతులుగారు దేవాలయమును గ్రంధాలయమును కలిపియే నిర్మించుకున్నారు. వీనియొక్క ఫలితమును బట్టీ దేశమునఁ దెల్ల ఇటులనే జరుకుననుటకు సందియములేదు.

పురపాలక సంఘముల సహాయము.

కడచిన సంవత్సర న౦దువలెనే ఈవత్సరమునగూడ బెజవాడ పురపాలక సంఘమువారు అదటి రామోహన గ్రంథాలయమునను రు ౧౦౦౦ విరాళమొస౦గిరి. ఈ ప్రకారమే ప్రతిసంవత్సరమును ఇచ్చుచుందురు. ఏలూరు పుపరపాకల సంఘము వారు గూడ అచటనున్న హిందూయువజనసంఘము వారికి నెలకు రు ౫ లు చొప్పున విరాళమునిచ్చుచున్నారు.

జిల్లాబోర్డువారి సహాయము.

క్రిందటిసంవత్సరమున కృష్ణాజిల్లాబోర్డువారు అంగలూరునందలి బాలసరస్వతీగ్రంథాలయమునకు నెలకును రు ౧౦ లు విరాళమునిచ్చిరి. కాని కారణము నేమియ దెలుపకయే, ఈవత్సరమున విరాళమును ఆపుదలజేసిరి. ఈవిరాళమును తిరిగి దయచేసెనని ప్రార్థించుచున్నారము.

ప్రభుత్వమువారి సహాయము.

అంగలూరుందలి బాలసరస్వతీ గ్రంథాలయమునకు ప్రభుత్వమువారు వారిచే ప్రకటింపబడిన ఆంధ్రప్రచురముల నన్నిటి దయచేసి సహాయము చేసిరి. ౧౮౬౦ సం॥ ౨౧ అని నెం. ఆక్టు ప్రకారము సంఘములను రిజిస్టరు చేసి కొనుటకు ఏబదిరూపాయల రిజిష్టరు ఫీజునకు బదులుగా ఇరువదిరూపాయలు మాత్రమేతీసికొనుటకు ఏర్పాటు ఛేయవలసినదని ఆంధ్రమహాజనసభవారు తీర్మానించి, దానిని ప్రభుత్వము వారిక౦పిరి. ఆటుల తగ్గి౦పజాలక పోయినప్పటికిని ప్రత్యేక సంఘములనుండి వచ్చు దరఖాస్తులను వానివాని యోగ్యతలను బట్టి యోచించెననని ప్రభుత్వము వారుత్తరువొసంగిరి. కానీ అంగలూరు బాలసరస్వతీ నిలయమువారు పంపిన దరఖాస్తును నిరాకరించిరని దెలుపుటకె౦తయు చింతిల్లుచున్నారము.

“హిందూపత్రిక ”యందలి వ్యాసములు. అమెరికా దేశమునందు పల్లెటూండ్ల గ్రంథాలయములు జ్ఞానవేదిక నెల్లెడల వ్యాపి౦పజేయుటకు ఆత్యద్భుతముగ బనిచేయుచున్న వనియు, అదేరీతిని, మన దేశమునందు గూడ పల్లెటూండ్లయందు గ్రంథాలయములను స్థాపించి పనిజేయుటకు తగిన సావకాశములను గూర్చి చర్చింపవలసినదనియు, మద్రాసునందుప్రకటింపబడుచున్న "హిందూ” పత్రికాధిపతి చదువరలును గోరియండెను. అందుమీద మనసంఘముయొక్క ఉపాధ్యక్షులును, గ్రంథాలయోద్యమ శాస్త్రవేత్తయునగు శ్రీ సూరి వెంకటనరసింహ గారు.

౧. గ్రంథాలయొద్మమ మందలి ప్రధమా౦శములు: దీని ఉత్పత్తి.
౨. ఐరోసాఖడనుందును, బరోడాదేశమందును అమెరికాఖండమందును గ్రంథాలయోద్యమము చేయుచున్నపని
3. ఆంధ్రదేశగ్రంథాలయోద్యమ వ్యాపన (ప్రస్తుత స్థితి).
౪.ఆంధ్రదేశ గ్రంధాలయమందు లీనమైయున్న సూత్రములు.
౫.అంధ్రభాషయందు సకలాంగ సౌష్టముల