లయమును ప్రార్థనమాజము వారి యాదరణకోసంగి దానికి ఒక భవనమునిర్మించి ఇచ్చి యున్నారు. దానిని మద్రాసునందున్న ప్రాచ్యలిఖిత పుస్తకభాండాగారమువలె చరిత్రపరిశోధనకు ఎక్కువ ఉపయోగకరముగ నుండునటుల అభివృద్ధిచేయుదుమని చెప్పిరి. దానికి ప్రార్థన సమాజమువారు శ్రీవీరేశలింగాస్తిక ఒక పుస్తకభాండాగారమని పేరిడిరి. ఇంకను పెక్కుచోట్ల నూతన భవన నిర్మాణ ప్రయత్నములను మిక్కిలి పట్టుదలతో చేయుచున్నారు. కొందఱు స్థలములను కొనియుండిరి. మరికొందరు ఇప్పడిప్పుడే భవనముల నిర్మించుటకు ప్రారంభించుచున్నారు.
యుద్ధభటులకు గ్రంథసహాయము.
దక్షిణాఫ్రికాయందు యుద్ధము చేయుచున్న ఆంధ్రసోదరులు విశ్రాంతిసమయములయందు చదువుకొనుటకై పత్రికలును, గ్రంధములను కావలయునని, యస్.వి. రెడ్డినాయుడు గారు వార్తాపత్రికలయందు ప్రకటించిరి - వెంటనే మన సంఘపక్షమున పత్రికలను, గ్రంథములను వారికి పంపుటయొక్క ఆవశ్యకతను దెలుపుచు ప్రకటించితిమి. పుస్తకములను తనంతట తామే పంపదలచుకొనువారికి, శ్రీ రెడ్డి నాయుడుగారి చిరునామాలు ముద్రించియున్నకాగితముల నంపితిమి. ఈప్రకారము ౪౦౦ ఆంధ్రగ్రంధములను ౩౦౦౦ ఆంధ్రపత్రికలను వారికి పంపి సహాయము చేసితిమి.
ఈవత్సరము జనవరినెలయందు లాహోరు పట్టణమున ప్రభుత్వమువారి యాదరణక్రింద హిందూదేశముందున్న గ్రంథభాండాగారుల సభ జరిగినది. ఆసభకు ఆంధ్రదేశగ్రంథాలయ సంఘముగుండిగూడ ప్రతినిథిని పంపెదమని వ్రాయగా, సభ్యుల సంఖ్య అంతకు పూర్వమే ఎక్కువగానుండి యుండుటచేత, స్థలముండినచో ప్రేక్షకునిగామాత్రమంగీకరింపచెదనని తెలిపిరి. విశేష ప్రయప్రయా సములకులోనై ఆంధ్ర దేశమునుండి లాహోరు పట్టణ మేగినను, సభయందు ప్రేక్షుకుడుగానైనా స్థలము దొరుకునో లేదో తెలియపోవుట యటుండ, ఈగ్రంథ భాండాగారుల సభవలన మనసార్వజనిక గ్రంథాలయోద్యమమున కేవిధమైన ఉత్సాహ ప్రోత్సాహములుకు లేవని గ్రహించి ఆసభకు ఆంధ్రదేశగ్రంథాలయ సంఘమునుండి ప్రతినిధులెవ్వరును పోయియుండలేదు. తుదకు ఫలితముకూడ ఊహించినట్లే జరగినది. ఈవత్సరము విశాఘపట్టణమున మనసభతోబాటుగ, యావద్భారతవర్ష ధర్మగ్రంథాలయ ప్రతినిధుల మహాసభను కూర్పివలెనని యత్నించితిమి . కాని అచ్చట “ప్లేగు" వ్యాధివలన సభయొక్క ప్రయత్నములు ఆలస్యముగా ప్రారంభమగుటవలన అట్లు చేయుట సంభవముగాలేదు.
దేవాలయములకును, గ్రంథాలయములకును సంబంధము.
నేటి కాలమున మనము గ్రంథాలయములను ప్రత్యేకముగ నిర్మించుకొనుచున్నను, ప్రాచీనకాలమందివి, ముఖ్యముగా దేవాలయములతో సంబంధమును గలిగి యుండెను. ఆకాలమునందు గ్రామమునందుండు జనులలో చాల భాగము ప్రతిదినము దేవాలయములకుబోయి దేవుని సేవించు నలవాటును గలిగి యు౦డిరి. అందుచేత అచ్చటికిబోయినపుడే పురాణ కాలక్షేపమును, సద్గ్రంధపఠనమును, పరస్పరభావ ప్రకటనమును భజనలు హరికథలు మొదలగునవిగూడ జరుగుచుండెను. క్రమముగ జనులయందు భక్తిసన్నగిలి దేవాలయములకు పోవుట తగ్గిన కొలదిని, జనులకు వ్యావృత్తు లేమియులేకుండుటంజేసి దుర్వృత్తులకు లోనగుట సంభవించినది. అట్టిస్థితియందు జనులుజ్ఞానవంతులగుటకు దగిన అవకాశములు గ్రంథాలయముల య౦దు గలిగినవి. కాని ఈగ్రంథాలయములుగూడ దేవాలయములకు జేరియుండినయెడల, ఇప్పటికంటే ఎక్కువ ఉపయోగకరములై యుండగలవేమోయని నా యభిప్రాయము. ఏలయన నానాటికి జనులయందు దైవభక్తి సన్నగిలుచున్న మాట వాస్తవము. ప్రపంచమునందే జాతికైనను, అందుముఖ్యముగ భారతీయులకు, దైవభక్తి నశించిన మోక్షములేదు. కావున దేవాలయమును గ్రంథాలయమును ఏకముజేయుటవలన ఐహికాముష్మికములు రెండిటి యందును మానవున కౌన్నత్యము సిద్ధిం