అగ్రాసనాధిపతిగారు తిమ యాసనము నలంకరించి, ప్రారంభోపన్యాసమును జెప్పిరి. (వీరి యుపన్యాసము లభింపకపోవుటచే ముద్రింపజాల మైతిమి.) అనంతరము ఆంధ్రదేశ గ్రంథాలయసంఘమునకు కార్యదర్శులకు అయ్యంకి వేంకటరమణయ్యగారు గతవ్సరముయొక్క కార్యనివేదిక నిట్లు జదివిరి:౼
ఆంధ్రదేశ గ్రంథాలయసంఘము
౧౯౧౭-౧౯౧౮ సంవత్సర వృత్తాంతము.
కడచిన సభ.
ఆంధ్రదేశమున గ్రంథాలయప్రతినిధుల మహాసభను జేయుట ప్రారంభించి నాలుగుసంవత్సరము లైనది. నేటితో అయిదవ సంవత్సరము ప్రారంభ మైనది. ఇదివఱకు జరిగిన సభలయం దెల్ల కడచిన సంవత్సరమున "బారువ” యందు జరిగిన నాల్గవ సభ అనేక విషయములచే ప్రాముఖ్యతజెంది యున్నది. "బొరువ" పట్టణముగాదు; చిన్నగ్రామము. ముందటేడు ఈ గ్రామవాస్తవ్యులు వ్యయ ప్రయాసల కోర్చి నెల్లూరు పురమున జరిగిన సభకు వచ్చి ఈ సభను తమ గ్రామమున కాహ్వానముజేసినప్పుడు ఈ కుగ్రామమునకు బోవుట కనేకమంది సందేహించిరి. పట్టణవాసులు సభల నిర్వహించు పరిస్థితుల నెరుఁగుదురేగాని, పల్లెలవారి కేమి తెలియునని కొందరు పరిహసించిరి. మఱి కొందరు ఈ గ్రామమును గూర్చి మనకేమి తెలియనిది మన మా గ్రామమునకు బోవుట్డెట్లని సందేహించిరి. ఇంకొక కొందరు ఇంతి వరకు జరిగిన మూడుసభలును పట్టణములయందే జరిపి యుంటిమి; కావున ఒక సంవత్సరము పల్లెయందు జరుపుటకుగూడ అవకాశమిచ్చి ఆదియెట్లు జరుగునో చూతమనిరి. ఈ యాలోచనప్రకారము "బాషవ" వారి ఆహ్వాన మంగీకరింప బడెను.
గంజాముజిల్లా గ్రంథాలయ సంఘము
. గ్రంథాలయ ప్రతినిధల మహాసభను నిర్వహించిన దినము “భరువ” చరిత్రయందు సువర్ణాక్షరములతో లిఖియింపదగినదని చెప్పవచ్చును. ఇంతవరకు జరిగిన గ్రంథాలయప్రతినిధుల మహాసభలఁయందెల్ల ఈ సభయే అగ్రస్థానమును వహించినదని చెప్పితినిగదా ఆంధ్రులే గాక ఉత్కలులుగూడ ఈ సభ కేతెంచి కార్యక్రమమునందు పాల్గొనిరి. సభ జరిగిన పిమ్మట ప్రతి నిధులలో గొందరు శ్రీజగన్నాధమునకు యాత్ర వెడలి, తన ప్రసాదస్వీకరణయందు కులభేదమును ఎన్నియో వేలసంవత్సరముల నుండియు తీసివైచిన యా జగద్రక్షకుని గ్రంథాలయోద్యమ విజయమున కై ప్రార్ధించిరి.
ఈసభయొక్క ఫలితముగ గంజాముజిల్లాయం దెల్లెడల ఈ యుద్యమమునందు నూతన ప్రబోధముగలిగినది. అట్టి ప్రబోధముతో లాభమేమి? తత్ఫలితముగ మండలగ్రంథాలయసంఘమేర్పడి, తాలూకా సంచారకార్యదర్శులేర్పడి, " మూడుమాసముల కొకసారి జిల్లాయందలి వివిధప్రాంతములయందు గొప్పసభలను సమకూర్చి ఈ యుద్యమవ్యాప్తికై సకలవిధముల దోడ్పడిరి. తుదకు ఈ మాసప్రారంభమునందే మండలగ్రంథాలయ ప్రతినిధులనుహాసభనుగూడ మిక్కిలి జయప్రదముగ నిర్వహించిరి. ఇన్ని విధముల గంజాంమండలమున గూడిన సభ ఫలప్రదమై యొప్పినది.
“వావిళ్ల” వారి దానము
ఆంధ్రభాషయందు అచ్చుగ్రంథము లింకను ప్రబలుటకు ప్రారంభము కాని యాకాలమున, ఆంధ్రభాషయందు గ్రంథపఠనాభిలాష ఇప్పటి దానిలో సహస్రాంశమైన లేనియాకాలమున, ముద్రణాసౌకర్యమిప్పటి దానిలో శతాంశమైనలేని యాకాలమున - సంస్కృత సారస్వతమునందు నిధియు, ఆంధ్రభాషయందు వేత్తయునగు శ్రీవావిళ్ళ రామస్వామిశాస్త్రులుగారు ప్రప్రథమమున సంస్కృతాంధ్రగ్రంధము లనేకములనుముద్రించి ఆంధ్రదేశమునకు మహోపకార మొనర్చి యున్నారు గదా! వారి పుత్రులును, వారివలే విద్యాధికులును నగు శ్రీ వేంకటేశ్వరశాస్త్రులుగారు తండ్రిగారి యుద్యక్షమును కొనసాగించుచున్నా రను సంగతి మీ కందరికని దెలిసియే యున్నది.