ములును, గతయుగ నాగరకతావిశేషమును సహస్రము ఖంబులఁ జాటుచున్నవి . త్రయీ విద్యయం దెట్టి యద్భుత నాగరకతా చిహ్నము లుండునవియు నెట్టి యాధ్యాత్మిక విద్య యుపదేంపబడియున్నదియునది యానుభవైకవేద్యము ; కాన వేఱుగ విస్తరింపఁబనిలేదు. కాని నాగరక తారుణోదయ ప్రభామరీచికలుమాత్రమందుఁదొచుచున్నననియును, నట్టి ప్రాభాత సమయమున మానవజ్ఞానము పరతత్త్వాన్వేషణమున సలిపిన ప్రయత్నములు బాలజల్పితముల పగిది మహోపనిషద్విద్యయందు భాసించుచున్న వనియుఁ బాశ్చాత్యపండితులలోఁ గొందలు నుడువుట యెంతిమాత్రమును సరికాదు. మానుషశేముషీప్రభ వెలుగొందినంతదనుక వేదములయందును వేదశాఖలందును బ్రతిపాదితములగు నుత్తమరహస్యములను గ్రహించి యుండెని చెప్పఁజాలము. వేదములు బ్రహ్మముఖోరితములైనను గాకున్నను బ్రోమినుకులకంటెబ్రాచీనములగునట్టియు వానిని బోలునట్టియుఁ జదువు లేవియును బుడమిని గానరావు. అట్టి యమూల్యధనము మనపాలబడియుండ వద్దాని మనమెట్లుపయోగించుకొనుచున్నామో చెప్పసిగ్గుగుచున్నది. త్రయీరహస్యంబులమాట యటుండనిచ్చి ప్రపంచ నాగరకతాచారిత్ర పునర్నిర్మాణమునకు హేతుభూతమగు గీర్వాణభాపను గనుఁగొనుఁడు. దేవభాషయని కొనియాడఁబడు సంస్కృతము భాషలకెల్లఁ దల్లియని ప్రసిద్ధిగాంచినది; ఆర్యజనైకభావమును బోధించినది;. అభినవశబ్దశాస్త్రపరిజ్ఞానమున వివిధరూపములుదాల్చి వేసములు మాఱియున్న భాషలన్నియునొక భాషాకల్పకము యొక్క శాఖోఖలని తెలియ జెప్పినది; దేశమతాచారనిభేదజనితవైసమ్యరహితమగు జాతీయైక్యభావమును బ్రాక్పశ్చిమదేశవిజ్ఞాన ధర్మైక్యమును బ్రబోధించినది; మఱి మన భాగ్యవశమున మన భరతఖండమునందు నది నిక్షిప్తమై యున్నది. దానిని మన ముపయోగించుచుండిన విధమును దలపోయఁ దలలు వంచుకొనవలసి వచ్చుచుండును. లెక్కకు మీఱిన గ్రంథరాజములతో రాజిలుచు పట్ఛాస్త్రములు చతుష్టష్టికళలు మున్నగు విద్యలకెల్ల నాకరంబై రత్నాకరంబు పగిది శోభిలుచుండిన గిర్వాణవాఙ్మయ మంతయు మనవశమై యుండఁగా, దేశమున స్వాతంత్రమ స్తమించి సామ్రాజ్యము పరహస్తగత౦బగుటను కొంతవఱకు విద్యలు క్షీణించి విజ్ఞానముతమోవృతము గాఁజొచ్చెను. మన యాంగ్లప్రభువర్యులాదినుండియు దేశభౌషాపోషణపరాయణలై, దేశీయ మతాచార ధర్మపరిపాలనాతత్పరులై యుండటను బ్రప్రధమముని సర్ విలియమ్ జోన్సు అను మహానీయుఁ డైరోపాఖండము నంతయు నాశ్చర్యవిమగ్నము గావించిన కాళిదాసకృతమగు శశిజ్ఞానశాకుంతల నాటకమును నాంగ్లమున ననువాదమొనర్చి ప్రకటించెను. తదాదిగభారతీయులకుఁ బాశ్చాత్యపండితవర్యులుగూడఁ బొగడఁదగిన విజ్ఞానవిస్తరంబగు వాఙ్మయము గలదని నెమ్మది నమ్మి పాశ్చాత్యపండితులనేకులు సంస్కృతభాషాభ్యాసమునకుఁ, గడఁగిరి. జర్మినీ, ఆస్ట్రియా, రష్యా,ఫ్రాన్సు, అమెరికా మొదలగు దేశములు సిద్వద్వరేణ్యులు సంస్కృతిభాషను బూర్ణముగ నభ్యసించి తమ్మలమున డెక్కు శాస్త్రసంతతుల నుత్పాదించి పిజృంభింపఁ జేయుటయేకాక, సంస్కృతిమునఁ గూడ మనపండితులకు దుర్ఘటములగు కార్యములను ఘటియించిరి. మోక్షములకు మహాపండితుని యుత్కృష్టభాషాసేవయందఱకును నిదితిమే. ఋగ్వేదమును శాయనాచార్యభాష్యముతో శ్రీమదానందగజపతి మహారాజేంద్ర సాహాయ్యమునఁ జక్కగ నచ్చొత్తించి శాశ్వతికీర్తిని బడసెను. ఇంకను బలువురు పలువిధంబులగు సేవలంజేసి యున్నారు. పాశ్చాత్యదేశీయులకు గీర్వాణభాషయందు నూతనముగా నుదయించిన యాదరభావమునకు ఫలము మనయమూల్యపుస్తకరత్నములను మన దేశమునుండి తీసికొనిపోయి తమతమదేశములందలి భాండాగారముల నించుటయే. కావుననే లండను, బెర్లిను, వియన్నా, సెంటుపీటర్సు బర్లు (పెట్రోగ్రాడు) మున్నగు పాశ్చాత్య దేశరాజకీయపుస్తకభాండాగారముల యందు మనదేశమునం దిప్పుడు సంగ్రహముగాని యద్భుతగ్రంధము లెన్నియో స్థిరవసతిని గాంచినవి. స్వామిదయానంద సరస్వతిగారు జర్మనీనుండి తెప్పించు వఱకును మననాలుగవవేదము మనదేశమున లేకుండెను! లిఖితప్రతులు నన్నింటిని మహోపాధ్యాయమోక్షమూల
పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.3 (1918).pdf/11
స్వరూపం