Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.2 (1918).pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లోను సామాన్యగ్రంథాలయములును స్థాపింపఁబడి యున్నవి. మొదలు 30వ ఇంక మన తెలుఁగుదేశపు గ్రంథాలయచరిత్ర సంగ్రహముగఁ జెప్పవలయును. పదునారవ శతాబ్దానంతరమున, తంజావూరు తెలుఁగు నాయకరాజుల పరిపాలనములో నున్నప్పుడు, అచ్చటి ప్రభువులు సంస్కృతగ్రంధముల వ్రాతప్రతులను బ్రోగుచేసిరి. ౧౮ వ శతాబ్దమున నా దేశము మహారాష్ట్రుల యాధీనమయ్యెను. తంజావూరి ప్రభువగు శరభోజిరాజు ౧౮౨౦ మొదలు ౩౦ వ సంవత్సరము వరకును కాశీనగరమున నివసించునపుడు పెక్కు గ్రంథములను సంపాదించెను. ఇప్పుడాభాండాగారమున ౧౮ వేల గ్రంథముల ప్రతులున్నవి. ఇవి దేవనాగరి, తెలుఁగు, కన్నడము, గ్రాంధి, బంగాళి మొదలగు భాషలలో నున్నవి. అందనేకము లముద్రితము లును, మరికొన్ని ముద్రితములును నగు గ్రంధములు గలవని చెప్పుచున్నారు.

చెన్నపురిలో బ్రౌనుదొర గారిచేత స్థాపింపబడిన ప్రాచ్యలిఖిత పుస్తకభాండాగారము మంచి స్థితిలో నున్నది.

౧౮౮౬ సంవత్సరమున విశాఖపట్టణమున స్థాపింపఁబడిన. సరస్వతీ నిలయసార్వజనిక గ్రంథాలయమునుఁ, ౧౯౦౪ వ సంవత్సరమున రాజమహేంద్రవరమున నెలకొల్పఁబడిన వీరేశలింగ పుస్తకభాండాగారమును, ౧౯౦౪ వ సంవత్సరమున హైదరాబాదులో నారంభింపఁబడిన కృష్ణ దేవరాయాంధ్రభాషానిలయమును, ౧౯౧౧ వ సంవత్సరమున బెజవాడలో స్థాపింపఁబడిన రామమోహనరాయధర్మపుస్తక భాండాగారమును ముఖ్యము లైనవి.

గ్రంథభాండాగార సంఘములు.

ప్రపంచములో గత ౨౫ సంవత్సరముల నుండియును గ్రంథాలయములలో నెన్నియో మార్పులు గలిగినవి. పూర్వము, పుస్తక భాండాగారమనిన విద్వాంసుల కుపకరించు గ్రంధములు నిక్షేపింపఁబడియుండుచోటు అని తలంచుచుండెడివారు. ఇప్పుడన్ననో, గ్రంథాలయములు, అందఱి జనుల జ్ఞానోత్తేజమునకు నుపకరించెడి సాధనములని భావింపఁబడుచున్నవి. ప్రజాప్రభుత్వ ప్రజాస్వాతంత్య్రములు వ్యాపించెడి ప్రకృత కాలమున గ్రంథాలయములు పండితులకేకాక, జనసమూహమునకును ఉపయోగకరములని భావింపఁబడు టొక వింత గాదు. గ్రంథాలయములు స్వాభావిక విద్యావిధానములలో న౦తర్భాగమనియె అమెరికావారు తలంచుచున్నారు. ౧౯౭౭ సంవత్సరమున లండనులో జరిగిన ప్రధకు నానాదేశీయ గ్రంథాలయసభవారిచే “విద్యా లయసంఘ" మొకటి స్థాపింపఁబడెను. ఈ సంఘము వారు సభలుచేయుచును, పత్రికాప్రకటన మొనరించుచును, పరీక్షలు జరుపుచును, విద్య నేర్పుచును ఉందురు. యూరపు ఖండములో ననేక దేశములలో గ్రంథాలయా సమాజములు స్థాపింపఁ బడినవి.

లోకములోని పుస్తకాలయసమాజములలో గొప్పదియు ముఖ్యమగునదియును అమెరికా గ్రంథాలయ సమాజము, ౧౮౭౬ వ సంవత్సరమున నెలకొల్పబడెను. ఆదేశమున అనేక గ్రంథాలయములు నూతన పద్ధతులు చొప్పున స్థాపింపఁబడి పనిచేయుచున్నవి. అచ్చటి గ్రంథాలయములలో, శిశువిద్యకు దోడుపడు సాధనము లున్నవి. ఇచటనుండు బొమ్మలు పటములు మొదలగునవి పాఠశాలకుఁ బంపఁబడి వానియందుపయోగింపఁబడుచున్నవి. అమెరికా దేశపు నవీనపద్ధతుల ననుసరించి యేర్పడిన బరోడా రాష్ట్రీయ కేంద్రగ్రంథాలయము చర్యలోఁగూడ ననేకశాఖలు గలవు. ఇందలి భాలశాఖ యందు పిల్లలకుఁ వారివారి వయసునకు దగిన పుస్తకము లున్నవి. వానినిఁ జక్కగాఁ బ్రదర్శించుటకు విద్యాధికారిణియుఁ గలదు. పాఠకులకు వినోదము గలిగించు క్రీడలున్నవి. మ్యాజికులాంతరు మొదలగు సాధన సామగ్రివలన సామాన్యజనులకు విద్యనేర్పఁబడుఛున్నది.

౧౯౧౪ వ సంవత్సరమున ఏప్రిల్ ౧౦ వ తేదీని