అవకాశము గలుగును. అముద్రిత గ్రంథములు పోగుచేయుట కష్టసాధ్యమేగాని అంతగ ద్రవ్యవ్యయముతో కష్టించి పనిచేసిన మనదేశమున నెన్నియో యముద్రితగ్రంధములు బయలు దేరును, ఒక్కమూల కొలదికాలము పనిచేసి ‘ఆంధ్రపరిశోధక మహామండలివారు ౧౨౦౦ అముద్రిత గ్రంథములను జేర్చినారు. ఒక్కొక్కప్పుడు ఈ యముద్రిత గ్రంథములకు విలువ అమూల్యముగనుండును. ఈ గ్రంథసంపాదనమువలన వివాదగ్రస్తములగు పూర్వవిషయము లెన్ని యేనిసంశయవారణమునందును. కప్పుపడిన మహానుభావులు చరిత్రములు బయలుపడును. భాష యొక్క వృద్ధిక్షయములు తెలియును. పుట్టుపూర్వోత్తరములు విడిపోవును. శబ్దతత్వము విమర్శింపననువుపడును. దేశముయొక్క పూర్వస్థితికిని యిప్పటి స్థితికిని తారతమ్యము తెలియును. ఇట్టివే ఇంకనెన్నియేని ఉపయోగములున్నవి. 'ఆంధ్రపరిశోధకమహామండలి' వారు ఆంధ్రదేశముయొక్క కృతజ్ఞతకు పాత్రులు. దానిని స్తాపించిన శ్రీయుత చెలికాని లత్సారావుగారి యాశయము సంస్తవనీయము. దానినిగూర్చి శ్రీ వంగూరి సుబ్బారావుగారు తీసికొనుచున్న పరిశ్రమ మెంతయును బ్రసంశనీయము. ఆంధ్ర గ్రంథాలయమున సంస్కృత గ్రంధములుకూడ నుండవలెను. అవియేగదా మనకు ప్రమాణములు. శ్రుతిస్మృతుల యాంధ్రీకరణము అవసరము. ఈపని కొంతవరకు జరిగినది, జరుగుచున్నది. ఇది కష్టసాధ్యమైనపని. కేవలము ఈపని, భాషాంతరీకరణములనుజూచి చేయదగినపని కాదు. శ్రుతులర్థము చేసుకొనుటకు కేవలము, సంస్కృత సాహిత్యము చాలదు. షేక్సుపియరు, చాసర్ల యింగ్లీషునకు వారికాలములనాటి నిఘంటువులు కావలసివచ్చినట్టులే, వేదార్థమునకు, ప్రత్యేక నిఘంటువున్నది. స్వరమునుబట్టి అర్థభేదము లున్నవి. అవి యన్నియును విచారించి, బుద్ధిసూక్ష్మత కొలది గ్రంధకర్తభావమును గ్రహించి తెలుగు చేయుట అవసరము. అటుపయిన వేదములందు ప్రమాణబుద్ధికూడ గ్రంధకర్తకుండవలయును. అదిలేకుండ మనయుద్దేళమున కనువుగా యిప్పటి, ఆచారముల ననుసరించి అర్థముచేయబడు నేని దానికి, అంగవైకల్యము సంభవించును. వేదము భాషాంతరీకరణమునుబట్టి ముందుగ తెలిసినయెడల ప్రమాణమువలయునపుడెల్ల వేదమునందలి ఆయాభాగములను తీసిచదివి ప్రమాణము క్రింద నొసుగు చుందురు, దానిని సభలలో నుచ్చరింపవలసివచ్చు నెడల మొదల నపస్వరములతో మొదలిడి యాపరిహాసమును వదల్చుకొనుటకై కష్టించి కావలసిన భాగములను స్వరయుక్తముగ నేర్చుకొని పండితులనిపించుకొనుటకు ప్రయత్నింతురు. ఎట్లయినను నేర్చుట కర్తవ్యము. ప్రమాణమునకు శ్రుతికంటె మిన్న యగునది లేదు. కాన నెదుటివారికి నమ్మకము పుట్టించుటకై సులభసాధ్యం బైనచో, అన్నిటికిని ప్రమాణముగా, దానినే, ఉపయోగింతుము. బైబిలు, ఎన్ని భాషాంతరీకరణములందినదో వేదముకూడ నన్ని భాషాంతరీకరణముల నందవలెను.
తెలుగుదేశమున కంతకును కేంద్ర గ్రంథాలయ మొక్కటుండిన జాలును. మండల మండలమునకును వేరు వేరు గ్రంథాలయము లుండవలయును. పిమ్మటివి గ్రామగ్రంథాలయములు. ఇవన్నియును మీ రెరింగినవే. గ్రామగ్రంథాలయమున గ్రంధములెచ్చుగ నుండుట యసంభవము. కాస వానికి వలయు పుస్తకముల పేర్లు గ్రంథాలయసంఘమువారు విమర్శనా సంఘమును, యేర్పాటుచేసి తయారుచేయించుట అవసరము, ఆపట్టిక లేనియెడల పల్లెటూళ్ళకు, నేయేగ్రంథములు, ఉపయోగమో తెలియబోదు. తెలిసినవారికైనను నామరూపములు చూచినమాత్రమున గ్రంధము భాగోగులు బోధపడనేరవు. చదివిచూచినవారు చెప్పినదానిని బట్టి మంచి చెడుగుల నిర్ణయింతుము.
విమర్శనసంఘము.
ఈ సంఘ మేర్పడుటవలన గ్రంధములు నిష్పక్షపాత బుద్ధితో విమర్శింపబడి మంచి గ్రంధములు మనకు దెలియుచుండును. చెడు : గ్రంధములు మనకంటబడనేపడక చదివినవి మంచినే చదువుదుము. విమర్శనసంఘముచేత మఱియొక పనికూడ చేయింపవలెను. ఇది ప్రకటనాల