స్వయంసహాయము
చేసికొనక తిప్పదు. గ్రంథాలయాభివృద్ధికి సొమ్ము కావలయునుకదా! స్వయం సహాయమువలన ప్రజలలో నీసొమ్ము లభ్యమగు మార్గము చూడవలయు. మనదేశమున ధర్మాదాయములకును దేవాదాయములకును కొరతిలేదు. పూర్వమున విద్యాదానము ద్రవ్యములేకయే మనదేశమున ఉచితముగా సమకూరుచుండెడిది. భృతికాధ్యయనము గర్హ్యముగ గూడ నెంచబడెడిది. ఆకారణమున విద్యాప్రదానమునకు వేరుగ నాదాయములు లేవు. దేవాదాయ ధర్మాదాయములు మునుపటికన్ననిప్పుడు విశేషముగ లాభము నొసంగుచున్నవి. వలయుసొమ్ములకన్న హెచ్చుసొమ్ములను సేకరించుచున్నవి. ఆ సొమ్ముల పరిపాలనములను గూర్చి శ్రీ వల్లూరు సూర్యనారాయణరావుగారు పట్టుదలతో చేయుచున్న కార్యము సంస్తవనీయము. వారు ప్రజల కృతజ్ఞతకు పాత్రులు. దేవాదాయముల నుండి మతగ్రంథాలయములను మత విద్యాపాఠశాలలను నేర్పాటు చేయవచ్చును. మఠములుగూడ గ్రంథాలయములను తమయాదాయము ననుండి నేర్పరచవచ్చును. మా వైపుల పెంటపాడులో నొక మఠమున్నది. దానికి వేలకొలది సొమ్ము రాబడి యున్నది. అందలి నిత్యవ్యయము అత్యల్పము, అనవసరవ్యయము అత్యధికము. ఆసొమ్ములు విద్యాప్రదానమునకును గ్రంథాలయ కార్యములకును కొంతవరకు వినియోగించిన దేశమున కెంతయో మేలు కలిగెడిది. పనిచేయువారు లేరు. చెప్పువారేగాని చేయువారరుదు. ధర్మాదాయముల సొమ్ములు ఇట్టివిద్యవిషయమున నుపయోగించు సాధనముల నారయవలయు. ఊరూరను పల్లె టూళ్ళలో గ్రామఖాయిదా లుండును. ఆ సొమ్ములో కొంత సొమ్ము దీని క్రింద నుపయోగ పరుపవలయును. పరపతి ఘములవారు తమరాబడిలో కొంత భాగము దీని కీయవచ్చును. వర్తకులు ధర్మమునకని కొంతసొమ్ము పోగుచేయుచుందురు. పట్టణములలో నీసొమ్ము వేల కొలదియున్నది. ఆ సొమ్మేమగుచున్నదో సరిగా లెక్కజూచి పోగుచేయువారు మాత్రము తక్కువ. ఇచ్చుట యును కష్టమే. అందులో కొంతభాగమైనను గ్రంథాలయములక్రింద వ్యయపరుపవచ్చును. మనసు కుదిరిన మార్గము లేకపోలేదు. దేశమున ధర్మము తక్కువ లేదు. క్రియావంతులు తక్కువగ నున్నారు. ఆక్షేపణలు హెచ్చు. ఐకమత్యము పూజ్యము. ఈ మండలముననే, దానినిగూర్చి యోజింతము. ఐకమత్యముకలిగి పనిచేయుచున్న పాతకృష్ణాభాగమునకును క్రొత్తగ వచ్చిచేరిన గోదావరీమండల భాగమునకును భేదమారయుడు. మనమండలమునం దిప్పుడున్నవి ౧౪౦ గ్రంథాలయములు. ఇవి ఏభాగమున హెచ్చుగ నున్ననో చూచిన క్రియావంతుల వలని లాభము తెలియగలదు. పాతకృష్ణామండల భాగమున నిప్పుడు పనిచేయువారు హెచ్చుగనున్నారు. వారికీ వారిప్రాంతములందు పలుకుబడి హెచ్చు. ఆ చుట్టుపట్టులకుపోవు నవకాశములు మెండు. అందుచేతను ఆ భాగమున పనివృద్ధిగనున్నది. పాక గోదావరీ మండలభాగముని కబుర్లవారేకాని పనిచేయువారంతెగ కనుపడరు. కార్యోత్సాహము ఉండిన మాత్రముచాలదు. క్రియా కౌశలముకూడ నుండవలయును.
గ్రంథాలయములు
ఉండవలసినవిధానమునుగూర్చియోజింతము. ఇందుండవలసిన వేవి? గ్రంధములు సరే. శాసనములు, నాణెములు, దేశపటములు, చిత్రపటములు, పతకములు, పూర్వపత్రములు, శిలావిగ్రహములు, 'మేజిక్కులాంతరులు,' ఇంక నెయ్యవి జ్ఞానదాయకములో ఆవియన్నియు పోగుచేయవలెను. గ్రంథములు ముద్రిలిములు, అముద్రితములుకూడ నుండవలెను. ఆముద్రితములు ఎన్ని ప్రతులు సంపాదించిన అంతమంచిది. దొరకినతోడనే అముద్రిత గ్రంథముల - గ్రామ గ్రంథాలయముల వారికడనుండు గ్రంధములు కొలదిగనుండు నుగాన - తెలిసినవారు గ్రంథములను జదివి కథాంశమును కవిశాలమును పేరును వ్రాసి గ్రంథములతో గూడ కేంద్రగ్రంథాలయమునకో మాండలిక గ్రంథాలయమునకో పంపుటమంచిది. అన్నియఁ ఒక చోట జేరిన పదిచుటకును కావలసినపని జరుగుటకును గూడ