వాఙ్మయ మెంత విజృంభణముగానుండిన దేశమున కంతయభివృద్ధి. రాజకీయాందోళనమందు పనిచేయువారందరును రాజకీయ విషయముల నుద్బోధించు గ్రంథసంపాదనమునకు గడంగవలయు. ఆ నాఙ్మయ మిప్పుడు నామ మాత్రముగ నున్నది. రాజకీయ వాఙ్మయము విస్తరిల్లినగాని, స్వరాజ్యమువలని ఫలముతెలియదు. స్వరాజ్యసంపాదనమైనకాని నిర్యకుశాధికారబలము తగ్గదు. ఆదితగ్గినగాని దేశమున కేది ముందు గావలెనో యది లభింపదు. దేశమునకు ముందు కావలసినది
నిర్బంథోచిత ప్రారంభ విద్య
అన్నిపనులు జరుగుచున్నవి. దీనికి డబ్బులేదు. ఎప్పటికప్పుడు ఏదో యొక సమాధానము. దీనికి డబ్బులేదు సరే. జనులు యజ్ఞానమును తమ స్వయంసహాయమున దేశమున వెడలగొట్టజూచు నీ గ్రంథాలయమున కేల దొరతనమువారు సహాయము చేయరాదు? వీనికి వారిప్పుడు చేయుచున్న సహాయమేమి? గౌరవనీయులగు పోలవరం జమీందారు గారు రేవువచ్చెడి చట్టనిర్మాణసభలో దొరతనమువారు మనరాష్ట్రమున, ఈనిలయములకు చేసిన సహాయ మేమియో కనుగొన ప్రశ్నవేసియున్నారు. రాష్ట్రము మొత్తముమీద నీవెచ్చ మెంతయో తేలగలదు. మనమండలములో నిది మనమెరుఁగుదుము. దొరతనమువారి ప్రత్యక్ష సాహాయ్యము నున్న స్థానికస్వపరిపాలనమువారి సహాయము రెండింటికి. అంగలూరునకు జిల్లా బోర్డువారు, రామమోహన భాండాగార మునకు బెజవాడ మ్యునిసిపాలిటీవారు. ద్రవ్యమును, ఉపాధ్యాయులును లోపము గాని ప్రారంభవిద్య నిర్బంధముగా సభ్యసింపజేయుటకు వేరాటంకములేదని దొరతనమువారు చెప్పుచున్నారు. నిర్బంధమునకు మున్ను దానిప్రయోజనము జనులకు బోధపడవలయును. లేకున్నా తత్కార్యము లాభదాయకమయ్యను జనులయసంతృప్తికి కారణమగును. జనసామాన్యమున, ఆ ప్రయోజనము వ్యాప్తముచేయుటకు గ్రంథాలయములకన్న వేరుమార్గ మేమున్నది? పాలకులు నేడో, రేపో, పూననున్నా యీ కార్యమునకు ముందుగా సాధనసామగ్రి సన్నాహము చేయవలదా? భూమి దున్నకుండ విత్తులు చల్లినప్రయోజన మేమి? టీకాలు వేయుట జనసామాన్యమున నలుగురికిని మంచిరియని తెలియుట కెంతకాలము పట్టినది? గ్రంథాలయములు, ఆక్షరాస్యునకును నిరక్షరకుక్షికి నిగూడ జ్ఞానదాయకములుగదా! వీనిమూలమున విద్య యూరూరను వ్యాప్తమయిన, విద్యవలని ప్రయోజన మనుభవసిద్ధమై తమ పిల్లలకు విద్య నభ్యసింపసేయ నలవాటుపడుదురు. అప్పుడే నిర్బంధము సహ్యమగును. "సర్వార౦భాః తండుల ప్రస్థమూలా" అన్ని కార్యములకును ధనము కావలెను. ధనము వచ్చుమార్గము లేకున్న నేకార్యమును నెరవేరదు. గ్రంథాలయము లత్యుత్సాహముతో దేశోపకారమునకై బయలుదేరుచున్నవి. వానికి ధనము పల్లెటూళ్ళలో విద్యావిహీనులకడనుండి రావలెను. వారికి లాభము తెలియదు. వారియ్యరు. ఆపయిన నిచ్చెదరు నాశతో బయలు దేరిన గ్రంథాలయములకు తిండిలేదు. కూరత్వముతో రంభమయిన కార్య మట్టె గుంటపూవులు పూయు చుండును. దొరతనమువారి సాహాయ్యమే వీరికి గలిగిన పూనిన కార్యము దినదినము 'మూడుపువ్వులు నాలుగు కాయలు' వృద్ధినొంది, యీపాటికి యీయ్యద్యమము దేశమున వేరునాటియే యుండును. బరోడా సంస్థానమునందు ౧౯౧౦ సంవత్సరమున నీయుద్యమము ప్రారంభమయినది. ఆ రాజ్యమున ౩౯ పట్టణములును, ౪౨౬ పెద్ద పల్లెలును గలపు ఇప్పుడు అచ్చట ౪౪౦ గ్రామగ్రంథాలయములును, 3౯ పట్టణ థాలయములును, 3 జిల్లా గ్రంథాలయములును స్థాపింపబడినవి. దొరతనమువానీయుద్యమమునకు, ఏటేట దాదాపు ౫౦,౦౦౦ రూవ్యములు వెచ్చబెట్టుచున్నారు. దేశరుంతయు కృష్ణాజిల్లాకు మించి లేదు. తన్మూలమున జనుల ఉత్సాహము కలిగి దొరతనము సహాయము వారి సంపాదించుటకై, ఆలయస్థాపనకు కావలసిన ద్రవ్యములో మూడవవంతు చందాల మూలమున పోగుచేసికొనుచున్నారు. స్థానిక స్వపరిపాలనమువా రొకవంతును రాష్ట్ర పరిపాలనమువా రొకవంతును సహాయము సేయుచున్నారు.