తమశక్తియెల్ల ధారవోయలేని యెవ్వరెన్ని విద్యల నేర్చిననేమి ప్రయోజనము? విశ్వవిద్యాలయమువారు ఆంగ్లేయ భాషాపరిక్షలకడ దేశభాషలను చేరకుండ కొట్టినారు. పాలకులు వారివిధ్యుక్త ధర్మమును నీవిధముగ విసర్జింయున్నప్పుడు దేశభాషవృద్ధిలోనికివచ్చెడు మార్గము లేదు. దేశీయులు వారికర్తవ్యమెరుంగకున్నారు. గ్రంథాలయములవారు ఈపనులకు పూనుకొని, ఆంధ్రగీర్వాణ సాహిత్యము పూర్వపుమార్గమున వృద్ధిపొంది దానితోడ పాశ్చాత్యవిజ్ఞానము జతపడుమార్గమున విద్యాశాలలు స్థాపింపవలయు. లేకున్న కొంత కాలమునకు గ్రంథాలయములు అలంకారవిద్యార్ధులు గావలసివచ్చును. గ్రంథాలయము లొకవైపున జ్ఞానసంపాదనకు తెగువు ఆరయవలయు. ఒకమూల జ్ఞానవ్యాపనకు మార్గ మాలోచింపవలయు. రెండుచేతుల రెండునుబట్టి పనిచేసినగాని మనకు కావలసిన కార్యము కావలసినంతత్వరలో కానేరదు. ఆంధ్ర సాహిత్యాభివృద్ధికై సర్వసాధనములుగల ఆంధ్ర సాహిత్య పరిషత్తువారు పూనుకొనుట విధ్యుక్తధర్మము. కాని యాసంస్థాపన యేటేట విందులారగించుటతోడనే సంతుష్టి పొందుచున్నది గాని తన విధ్యుక్తధర్మము నెరవేర్ప కున్నది. ఇప్పుడు
స్వరాజ్యము
ను గురించిన యాందోళనము దేశమున నెక్కుడుగ జరుగుచున్నదికదా? దేశవిద్య కభివృద్ధిలేకున్న స్వరాజ్యమెక్కడిది? దేశీయులందరునుకూడి రాకుండిన స్వరాజ్యము మనకలవడునా? నాగేశ్వరరావు పంతులుగారి పుణ్యమాయని, ఆంధ్రపత్రిక బయలువెడలి, దేశము నలుతట్టుల దిరిగి, స్వదేశ విదేశపరిస్థితులు దేశమున నలువురి చెవుల బడవేయుచున్నది. తన్మూలమున దేశీయులిప్పుడు తమకును, అన్యదేశములకును గల తారతమ్యమును గ్రహింపగలుగుచున్నారు. దానితోడ నా౦దోళనము తల చూపినది. ఇంతలో బెసెంటమ్మ బయలుదేరినది. స్వారాజ్యసమితుల దేశము నలుతట్లు మొలక లెత్తజేసినది. మనబండారము బయలుపడి, మనలోపములు మనకు దెలియుచున్నవి. ఇంతకొలదికాలములో నింతకృషిజరుగుటకు గ్రంథాలయములును, పఠనమందిరములే, సహాయకారులయినవి. దేశహితైకాభిలాషు లందరును, ఈగ్రంథాలయోద్యమమునకు మ్రొక్కవలసియున్నది. 'తిలకు' మహాశయుఁడు బెసెంటమ్మగారు పాడుచున్న యీస్వరాజ్యపుపాటను ఎన్నినాళ్ళనుంచి పాడుచున్నవారు కారు? ఎంత లెంకలు కష్టములకు పాలైనారు కారు? దేశవిద్యాభివృద్ధికై యెంత కష్టపడినారు? తోడిదేశీయులు వెనుకబడియున్నారు. ప్రయోజనము లేకపోయినది. మహారాష్ట్ర దేశమునను బంగాళమునను దేశవిద్య యెంత విరివిగ ప్రబలినదో జూచితిరా? - ఒక్క 'ఆంధ్రపత్రిక' బ్రతుకుటకు మనదేశమునం దెన్నో బొములు పడు చున్నది. రెండు వేలకు మించి చందాదారులు లేరు. మహారాష్ట్రమునందు గల 'కేసరి' పత్రికకు ముప్పదివేల మంది చందాదారులున్నారు. బంగాళమునందు 'హితవాదికి' ఇరువది వేలమంది యున్నారు. దేశభాషయందంతజ్ఞానము విజృంభింపబట్టియే 'తిలకు' మహాశేయుడు ఆంగ్లదేశమున కిప్పుడుబోవనున్న స్వరాజ్యప్రతినిధుల వెచ్చమునకై ధనము సేకరించుటలో, ఆశ్రమముగ వేన వేలుజనులు పోగుపడి, ఆయన వచ్చి రాకమునుపే వేలకొలది ధనమునుపోగుచేసి ఒక మాసముదినములలో దాదాపు రెండులక్షలరూప్యముల నొసంగినారు. ఈఒక్క నిదర్శనముచాలదా? స్వరాజ్యప్రాప్తికిని దేశవిద్యలకును సంబంధమున్న పనుటకు పదుగురును వృద్ధిపొందినగాని స్వరాజ్యము రాదు. స్వరాజ్యములేకున్న స్వతంత్రతలేదు. “సర్వం పరవశందుఃఖం సర్వమాత్మవశం సుఖం” పదుగురును కలియుటకు దేశవిద్యలే సాధనములు,
ఆంధ్రరాష్ట్రము
కావలెనని ఆంధ్రదేశమిప్పుడు కృషిచేయంచున్నది కదా? దాని యాదర్శమేమి ? భాషాప్రయుక్తరాష్ట్ర నిర్మాణము కాదా? భాషతో రాష్ట్రము విభజనము గావలయునని కోరువారు తద్భాషావ్యాప్తి కొంతపాటుపడ వలయు? భాషావ్యాప్తికి పరమసాధనము వాఙ్మయము.