Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.2 (1918).pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భారతరామాయణములం జూడుడు. ఒక్క అక్షరాస్యునకు మాత్రమేవచ్చి తక్కినవారికి రాకుండపోయినవా? ఉగ్గుపాలతో పట్టువడిన భాష యెంత చిక్కుగల భాష యైనను అనర్గళముగ పట్టువడును. తదన్య మెంత సుళువైనదైనను పట్టిచ్చుచునే యుండును. ఆంగ్లేయభాషకన్న చిక్కు గలభాష యున్నదా? ఆంగ్ల బాలాకుల౦ జూడుడు. ఎంతజాతీయముగ, యెంతధారాళముగ, యెంత సుళువుగా మాట్లాడుదురో? మన మెన్ని నాళ్లు యెంతెంత శ్రమపడి యభ్యసించినను, ఆజాతివాని జాతీయత మనకు లభించునా? ప్రయత్న సాధ్యమే యగుననుకోన్నను దేశమునందది యెంతమందికి లభ్యముగాగలదు. లభ్యమైనను అది యాయొక్కనికే యుపయోగము గాని తోడిదేశమున కది యేమియుపయోగము ? దేశభాషలలో గ్రంధములు వర్ధిల్లవలె. దేశాభివృద్ధికలుగవలె. మన

యాంధ్రభాష

కేవలస్వతంత్ర భాష కాక మొదటినుండియును సంస్కృతమువలనను సంస్కృతభాషావేత్తలవలనను అభివృద్ధినఁదిన భాష యగుటచే తద్భాసాస్వరూపస్వభావములు తెలిసినఁగాని ఆంధ్రభాషాస్వామ్యము కుదరదు. భాషా స్వామ్యములేకుఁడ వ్రాసిన గ్రంథములు సుబోధములు గాకుండి చేయవలసినంత పని చేయ నేరవు. వారికి గ్రంథరచనయు సులభ సాధ్యముకాదు. ఎంత జ్ఞానవేత్తలయినను భాషాప్రాభవము లేని వారు వ్రాసిన గ్రంథములు దుర్గ్రా హ్యములుగానే యుండును. భావముల స్పష్టీకరించుటకు భాషా సౌలభ్యమాపశ్యకము. ఆంధ్రభాషా స్వామ్యము గీర్వాణ భాష వలన గాని లభింపదు. ఆంగ్లభాషయే మనకు జీవనాధారమై రాజభాష యగుటచే దేశమునందు ఆంధ్రభాషాభ్యాసముపోయి నిత్యకృత్యభావములను కూడ ధారాళముగ మనమిపుడాంధ్రభాషను వ్యక్తీకరింపలేకున్నాము. పుట్టుకలోభావము లాంగ్లేయభాషను బుట్టు చున్నవి. వాని నాఁధ్రీకరించి ఆభాషరానివారికి దెలుపుటకై యెట్లో వెడల గ్రక్కుచున్నారము. ఇట్టి దుస్థితిలో దేశభావయున్నపుడు మనమెంత జ్ఞానవంతులమును ప్రతిభావంతులము నైననేమి మనయూహల నెట్లు దేశీయులకు వ్యక్త పరుపగలుగుదుము? పాశ్చాత్యులైహిక సాధనములం దెక్కువకృషిచేసి వానియందు మేరమీరిన విజ్ఞానమును సంపాదించియున్నారు. ఆముష్మిక విషయముల మనదేశ మెట్లువర్ధిల్లినదో యట్లే పాశ్చాత్యదేళములు నేడైహికజ్ఞాన మంతసంపూర్ణముగ సంపాదించినవి. పాశ్చాత్యవిజ్ఞానము భాషాస్వామ్యముగల దేశభాషావేతలకడ లేదు. వారు వ్రాసిన గ్రంధములవలన దేశమునకుగలుగు ప్రయోజన మత్యల్పము. పాశ్చాత్యజ్ఞానసంపాదకులకు దేశభాష రాదు. విద్యావంతు లీ మాదిరివారై గ్రంధములు వ్రాయుచున్నపుడు ఆగ్రంధములవలన సామావ్యజనుల కెట్టియభివృద్ధి కలుగునో జెప్పెడిదేమి ? ఆంధ్ర సాహిత్యమును పాశ్చాత్యవిజ్ఞానమును జతగా నభ్యసించుటకు తెగినయిరవు ఏర్పడుటకు దేశభాషాప్రాధాన్యములగు బడులు బయలుదేరువరకును దేశముయొక్క దుస్థితి యిట్లుండవలసినదే. మనమాంధ్రులముకదా ?

ఆంధ్ర సాహిత్యము

నిప్పుడు ప్రత్యేకముగ సంపాదించుటకు ఒక్కబడియైన దేశమునందున్నదేమో చెప్పగలరా? దేశభాషలయందు విద్వత్పరీక్షుల విశ్వవిద్యాలయమువారు పెట్టినారా! దానివంక నెవ్వరైన జూచుచున్నారేమో కనిపెట్టితిరా? ఆపరీక్షులకు విద్య నభ్యసించుటకు సాధనములున్నవా? పరీక్షలయం దుత్తీర్ణులైనవారికి బొట్టబోసుకొనునుపాధులున్నవా? మదరాసు రాష్ట్రమున గవర్నరు పనిచేసిన సర్ థామస్ మన్రో గారు 3౧-౧౨-౧౮౨౪ తేదీని ఈస్టుయిండియా కంపెనీవారికి వ్రాసిన యుత్తరసారాంశమందు కేవలజ్ఞానమువలన ప్రయోజనమును గూర్చి యీ క్రిందిరీతిని వ్రాసియున్నారు. 'ఏయుగమందు గాని యే దేశమునందు గాని కీర్తియును, ధనమును, అధికారమును, అనునవియేజ్ఞానము సంపాదింపవలెనని కోరిక పుట్టించు చుండును. దేశపరిపాలనమునగల వివిధధర్మములయందు తమశక్తిసామర్ధ్యములనుబట్టి తమకున్న ప్రజ్ఞయంతయు వినియోగింపరేని దేశసేవచేయు మహత్కార్యమునకు