Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.1 (1918).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నేను వస్తానోయి ♦ నేను వస్తాను
మొగ్గమల్లను నేను ♦ మురిపాల మొలక !
నీయుత్తరీయంబు ♦ నడబట్టికొని
నీకప్పురపుతమ్మ ♦ నిగ్గునందికొని
నీనిల్వుతిలకమ్ము ♦ లోన చెమ్మగిలి
నీరాగమాలలో ♦ దారమైపెనగి
వలపుతో కడదాక ♦ నిలచియుంటాను.

సన్నజాజిని నేను ♦ సరసాలచైత్ర!
తేనెచిమ్మను నేను ♦ తీపారుపుత్ర!
నీ సిగపూలలో ♦ వాసనైయణగి
నీ కంఠమాలలో ♦ రేకునైకలసి
పూలు రేకులుకూడ ♦ పొలుపారుదాక
నీ వాక్కుకర్థమై ♦ నే వెల్దుతాను
చూపుపాపనై ♦ నే నటిస్తాను.

ఎడబాట్లు కలిగేటి ♦ యెండ కాలమున
ననునీడక కృశించు ♦ ననరాణియెవత?
నా వేణువను కిరు ♦ ణమ్ముగానూది
అప్పగింతలుపాడు ♦ నార్ధకాలమున
ఎల్లెడనాకులు ♦ అల్లుడువేళ
అంటియుంటానువ్యు ♦ రపుడు నాదండ

గన్నేరుమొగ్గనే ♦ గరువాలగడ్డ!
నిన్నుమోహించాను ♦ నిండారుకూర్మి
నీదు కౌగిటనన్ను ♦ నిలువనిమ్మోయి
నీ శయ్యనన్ను రా ♦ ణింపనిమ్మోయి
నీ నవ్వుచల్వలో ♦ నాననిమ్మోయి
నీ లాలనసుఖాన ♦ జోలనిమ్మోయి

మందారమునునేను ♦ మాధీృపిపాసి
నీకుపచ్చనిరూపు ♦ నేకోరినాను
ఏ కిన్నెరస్వరాన ♦ ఎలుగెత్తిమమ్ము
పిలిచితో ఆముద్దు ♦ పిలుపులోపలనె
కలదు నీదువియోగ ♦ గద్గదస్వరమె
నే నెఱుంగుదునోయి ♦ నీరహస్యములు
ఎందుకో అలస్య ♦ మెందుకోఅలత
ఎందుకో సందేహ ♦ మెందుకోకొణత
అందుకోవోయి! మో ♦ హనసూత్రధారి
నాప్రేమపూస లం ♦ గపుదండగట్టి.