Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.1 (1918).pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అవస్థపడుచున్నారు. ఈలోపములను గ్రహించియే గోపాలకృష్ణ గోఖలే గారు ప్రారంభోచిత నిర్బంధ విద్యాపౌరశాసనమును ప్రవేశపెట్టను. ప్రభుత్వమువా రంగీకరింపలేదు. పోనించు, మనకర్తవ్యమును మనము నెరవేర్చుటకై ప్రయత్నించెదము. ప్రభుత్వమువారు మనకు పన్నులువేసి చేసెడిపని మనంతట మనమేల చేయకూడదు. కనుక ఆపనిని చేయబూచెదము.

దేశములో చదువుకొన్నవారికి ముందుగ చదువునందుదిభిరుచి కలిగించెదము. చదువుమానినతోడనే పల్లెటూరికాపు మొదలుకొని బి.ఏ. ప్యాసయిన యానితరువాత పుస్తకములను మూలను వైచి తర్వాత ఎప్పుడుయినను పుస్తకము తెరచిన పాపమునపోరు. పల్లెటూరువారు ఏపార్టీలతో ఏతప్పుసాక్ష్యములతో ఏజూదములతో ఏవ్యాజెృములతో తమశక్తిసామర్థ్యములను, ధనమును, విద్యను థారవోయుచున్నారు. ఇకను బి.ఏ. స్యాపయిన యాతడన్ననో గాపువానికంటె బుద్దిశాలి కాదు. ఏడస్కుబల్లయొద్దనో కూర్చొని కాలము గడుపుచు రూపస్థమండూకమువలె తనజీవయాత్రను గడపును. వీరిద్దరికి ఇట్టిగతి పట్టుటకు కారణమేమి? చదువుకొనుటకై తగిన యవకాశములు లేకపోవుట చేతనే. గ్రంథలయమును ఎప్పుడు దర్శించెదరో అప్పుడే, వీరి మనసులు లు జ్ఞానవంతములగును. ఈ మార్పు గ్రంథాలయములను విశేషముగ దర్శించువారికి స్పష్టముగ తేటపడును. అట్టిమార్పు కలుగని మూఢులులేరని నేను చెప్పజాలను గానీ, అప్పుడగూడ వారికి విద్యయందభిలాష కలుగదేని వారిగతి ఆధోగతియని చెప్పనగును.

ప్రతిగ్రంథాలయమునకును చందాలిచ్చు సభ్యులున్నారు; పనిచేయువారలు కొందరున్నారు. ఈపని చేయువారలు చాలమంది . నిరుద్యోగులైయున్నారు. వీరు తీరికచేసికొని కొందరు బీదలకు చదువు చెప్పవచ్చును. క్రిస్తవమత ప్రచారకుల సంఘమువారు, ఊరికొక బడిపెట్టుచున్నారు. అంతయు వారిదాతృత్వపనుకొని మోసపోవుచున్నావారికి ఈపాఠశాలవలన ఎంతవ్యయనుగుచున్నదో లెక్కచూడడు. బహుస్వల్పము. వారు ఖర్చుపెట్టు సొమ్ములో చాలభాగము ప్రభుత్వము వారినుండి గ్రాంటులు రూపమునవచ్చును. కనుక మనముగూడ శక్తికొలని ప్రయత్నించి గ్రంథాలయముల పక్షమున పాఠశాలలను గూడ స్థాపించవలయును. ఈపాఠశాలల ద్వారా చదువుగానివారికి విద్యాదానమును చేయవలయును. కేవలము నాలుగు పుస్తకములనొకమూల పెట్టుకొని కూర్చుండినచో లాభములేదు. గోపాల గోకలే గారి జ్ఞాపకార్థము చెన్నపట్టణములో నొక హమును వేయించినంత మాత్రమున ఆయనయాత్మ శాంతికలుగదు. దేశములో నెల్లెడల విద్యావ్యాపచేయుటయే ఆయన స్మరణచిహ్నమును నెలకొల్ప ఇట్టియత్కృష్ట కార్యమును చేయుట కవకాశము కనుకనే ఈ యుద్యమము దేశాభివృద్ధికి అత్యవసరమనిచెప్పా సాహసించుచున్నాను. ఆంధ్రదేశమున ౪౦౦ గ్ర౦థాలయముల యభివృద్ధికై పాటుపడువారి సంఖ్య ఆధమము ౪౦౦ ల కంటే తక్కువయుండఁదు. ఈ నాలుగువందల మంది సాధారణముగ ఉత్సాహఃవతులును, దేశసేవాతత్పరులును, అగు యువకులైనన్నారు. వీరికి మరియొక పనియేమియు లేదు. వీరియదర్శమొక్కటియే. వీరి యూహ యొక్కటియె ఇట్టి దేశారాధనపరులయొక్క శక్తిని ఫలవంతముగ చేముటకై దేశీయులెల్లరు ప్రయుత్నించవలయును. స్థానబలిమి యుండుటవలన వీరు పల్లెటూళ్ళయందు ఎక్కువపనిజేయుట కవకాశములు కలవు. ఎవరో ముఖమెరుగనివారు వెళ్ళి ఎన్నియుపన్యాసము లిచ్చినను వారికి రుచింపదు. కావున ఈ ౪౦౦ ల మందికి తగినశిక్షు నొసంగి వారియొక్క దేశాభిమానమును పల్లెటూరి జనులయందు జ్ఞానాభివృద్ధిని చేయుటయందు వినియోగించినచో, అద్భుతమైన అభివృద్ధి కన్పింపగలదు.

ప్రతిగ్రంధాగారమును పాలించుటకై కార్యనిర్వాహకసంఘముగలదు. ఈ కార్యనిర్వాహక సంఘములు గ్రంథాలయములయొక్క పరిపాలన సరిగా చేయుట ఎప్పుడు సంభవించునో అప్పుడే స్వపరిపాలనశక్తి లభించుచున్నది. గ్రంథాలయమున్నచోట పరపతి సంఘమును అవసరమైన ఇతర ప్రతిష్టాపనలకు గూడ స్థాపించుట మిక్కిలి సులభమగుకార్యము.

కావున, దేశప్రముఖులారా ! దేశముయొక్క స్థితి నారయుడి! పునాదినుండి దేశముయొక్క స్థితిని బాగుపరచుటకై ప్రయత్నింపుడి! ఈవత్సరము మే నెలలో విశాఖపట్నంజిల్లా అనకాపల్లియందు ఐదవ ఆంధ్రదేశ గ్రంథాలయప్రతినిధుల మహాసభ జరుగనున్నదిగదా! అప్పుడు, దేశప్రముఖులందరును విచ్చేసి ఈయుద్యమము దేశమును ఇంకను ఎక్కువ ప్రకాశవంతముగ చేమనటుల చేయుదురుగాక.

- గోపరాజు బ్రహ్మానందము.