స్తకమునందలి పుటలు 'నికెల్' పుటలే యైనచో అవి ౪౦,౦౦౦ లుండును. ౪౦,౦౦౦ ల పుటలను గలిగిన యీపుస్తక మప్పుడు ఒక పౌనుమాత్రమే తూగును".
సున్నితమైన కాగితము నుపయోగించినచో ఈనాటి గ్రంథప్రకాశకుడు అంగుళము దళసరిగల పుస్తకమునకు ౧౫౦౦ లు పుటలను పెట్టగలడు. సాధారణముగ పుస్తకమున కుపయోగించు ఇతర కాగితమునేవాడుకచేసినచో అంగుళము దళసరిగల పుస్తకమున ౩౫౦ పుటలు పట్టును.
కాగితమువలెనే నికెలు రేకులు సైతము సిరానుపిల్చును. ఇట్టి రేకులకై ప్రస్తుతముపయోగపడుచున్న నిరాకంటె బహుశహ మఱికొన్ని యితర పదార్థములతో సిద్ధముచేయబడిన క్రొత్తసిరా కావలసియుండును. అయినను ప్రస్తుత ముపయోగపడు సిరాకూడ చాలవఱకుపయోగించును. శ్రేష్ఠమైన 'క్యాలెండరు' కాగితము నెన్ని చాయలతో 'హాఫ్టోటోన్' బొమ్మలు అచ్చు౦త్తింపబడుచున్నవో అన్ని చాయలతోను ఆబొమ్మలు ఏరంగులోనైనను ఈనికెల్ రేకులమీద ముద్రింపవచ్చును. కాగితముమీద నేది యచోత్తింపబడినను అదియెల్ల నీ నికెల్ రేకులమీద వచ్చొత్తింపవచ్చును.
లోహపు 'కాగితము' ఎడిసను యొక్క రసాయనశాలలో తయారుచేయబడినది. అయిదు చతురపుటడుగుల పరిమాణముగల యిట్టి లోహపు రేకు నొకటి తయారు చేయుటకు ఒక నిమిషమును పైగా నొక యర నిమిషము పట్టును. ఈనికెలు రేకులను వర్తక వ్యాపారము జరుపుటకుకూడ వీలగునట్లు తయారు చేయవలయునన్న పెద్ద పెద్ద యంత్రములను గట్టుటయావశ్యకమై యున్నది.
నికెలుపుటలను కలిగియున్న పుస్తకమునకు అట్టలు కూడ ఆపదార్థముతో నేగాని అవసరమయినచోట ఉక్కుతోగాని తయారు చేయవచ్చును. ఆయట్టమీద లతలనుబోలిన యనేకములగు నందమైన కల్పనలను గూడ నచ్చువేయ వచ్చును. గుడ్డతో జేయబడిన 'బైండు' గాని, చర్మముతో జేయబడిన బయిండునుగాని తెలియజేయునట్టాయట్టలకు రంగు వేయవచ్చును.
ప్రస్తుతము పుస్తకము లచ్చువేయంచున్న కాగితము మిక్కిలి పల్చనైన దగుచో నూఱెడ్లలో నదిశిథిలమయిపోవునని గ్రంధభాండాగారికులు మొఱపెట్టుచున్నారు. వివిధ దేశములయందున్న అనేక వేలగ్రంధభాండాగారములనుండు లక్షలకొలది కోట్లకొలది గ్రంథముల నచ్చువేయించుటకు వ్యయమగు ధనమును గూర్చి యోచింపుడు. గ్రంధములన్నిటిని రక్షింపవలసియే యున్నచో దీనినన్నిటిని నూరే౦డ్ల కొక పర్యాయము మఱల బ్రచురింపవలసి యున్నది. అది యటుండ నీవఱలో వెన్నెన్ని యమూల్యములైన గ్రంధము లగ్నిహోత్రములపాలై భస్మమైనవో, యోచింపుడు! తగుమాత్రపు వేడికీని కెలుపుట లభేద్యమై యుండును. అవి కూడ కరుగుననుకొండు, కరిగినను వేడి మిక్కుటమైనప్పుడుకొని కరగవు. కాని వానియంతట అవి నిప్పంటుకొనవు. ఆదియునుగాక నికెలు పుస్తకము నెంతకాలమైనను నీటిలో నాననిమ్ము. తరువాత దానిని నీటిలోనుండి తీసి యాఱబెట్టవలసినరీతి నాఱబెట్టినచో క్రొత్తపుస్తక మెట్లుండునో అదికూడ నల్లే యుండును.
ఇట్టిలోహపుపుస్తకములవలన గలుగులాభము లింకను ననేకములు కలవు. నలుబదివేల పుటలుకలిగిన యొక లోహపుపుస్తకము అంగుళము దళసరి మాత్రమే యుండును. అంతేకాక అచ్చువేయుటకు గల స్థలమునుబట్టి చూచినచో నది యొక్కొక్కటి రెండువందల కాగితపుపుటలుగల రెండువందల పుస్తకములకు సమానముగనుండును. ఇట్టి రెండువందల కాగితపు పుస్తకములనే యొక దాన్ని పైనొకటి పెట్టుచోనని తొమ్మిదడుగులన్నరయెత్తుండును. అట్టి రెండువందల పుస్తకములలో పట్టువిషయమంతయు నొక్క యంగుళముమాత్రమే దళసరిగలిగిన నలుబది వేల పుటలుగల లోహపుస్తకమున ముద్రించుటకు వీలగును. క్రమక్రమముగ సారస్వత మభివృద్ధియగుటచే పుస్తకములను బెట్టుటకు గొప్పగొప్పభవనములు కట్టవలసివచ్చు చున్నవి. ఈనికెలు పుస్తకముల నుపయోగించినచో సంతటి గొప్ప భవనములను గట్టనవసరములేక చాలధనమును కూడబెట్టవచ్చును.