చాళుక్యులకుఁ బూర్వము బ్రాహ్మణ భక్తిగల గోవిందవర్మ పుత్రుఁడగు మాధవవర్మాది క్షత్రియులచేఁ బాలింపఁబడినట్లును, గుద్దవాడయనఁగా గుడివాడ కాక గుద్రహరయనఁగా గోదావరి మండలమునకుఁ బేరనియు దెలియుచున్నది. గోవిందవర్మ రాష్ట్రకూటులలోనివాఁడని కొందఱనుచున్నారు.
కాఁబట్టి యింద్రవర్మ గోదావరి మండలములోని పిఠాపురమును భాలించిన రాజని నమ్మవలసినది. పిఠాపుర ప్రభువయిన యింద్రవర్మ యిచ్చిన శాసనము నేఁటికి 'ఒంగోలు' తాలూకా పాటిదిబ్బలలో బయటపడుటయునది తిరిగి మానగరమునందలి యాంధ్రపరిశోధక మహామండలికిఁ జదువవచ్చుటయు విచిత్రముగ లేగదా?
శాసనము వచ్చిన నాఁటికి నాకందలియక్షరములు చదువు నేర్పులేదు. ౮, ౧ం దినములలో గ్రంథసహాయములేని యిచ్చట పరిషత్ఫత్రికలతో నెట్లో యదిచదివి వ్రాయుచుంటిని. విషయము తెలిసికొనుటకు శ్రీజయంతి రామయ్యపంతులు గారు ప్రకటించిన శాసనములు నాకుఁ జాల సాయపడినవి. సంగతులు తెలియఁగానే వివరములు నాకుఁ దెలిసినంతవఱకుఁ బాఠకుల కెఱిఁగించితిని. ప్రస్తుతము · శాసనమునిచ్చిన మాగ్రామ భాండాగారమువారు పనియున్నదని యాశాసనమును దీసికొని పోయి మరల నాకంపలేదు. నేను వ్రాసియిచ్చిన కాగితపుఁ బ్రతినైన నీయరయిరి. ముందు వారిచ్చినప్పుడు సరిచూచు కొనవచ్చునని ప్రస్తుతము నాకడనున్న చిత్తుప్రతి నిందుతోఁ బ్రకటించితిని. శాసనములోఁ జివరభాగము రెండవమారు సరిపోల్పలేనందునఁ దప్పులున్నవి. ఈ చిత్తుప్రతియైనఁ బోవునేమో, దేహము లశాశ్వతములని ఇందుమూలమున బ్రకటించితిని. శాసనమును
సంపాదించినవారు మరియొకరి చేతనైన నాశాసన ప్రతిబింబములఁ బ్రకటింపఁ జేయుదురని నమ్ముచున్నాను. పరిషత్పత్రికలోఁ బ్రకటింపఁబంపిన సర్వోత్తమము! ఎవ్వరైనా నమలిమ్రింగునది లేదు. లోకము కొఱకుఁ గన్నులు మంటలెత్తునటులు చదివి ప్రకటింపవలసినదే కదా! నాచే నీమాత్రపుఁ బనియైనఁ జేయించిన శ్రీ సూర్యరాయ భాండాగారము వారికి నా వందనములు!
- ఇంద్రవర్మకోణ్దణగూరుశాసనము[1]
స్వస్తిశ్రీమతాం సకలభువనసంస్తూయమానమానవ్య సగో ! త్రాణాం హరితీ పుత్రాణాం స్వామిమహాసేనపదాన్యధ్యానధ్యా! నాణాం కాశికీవరప్రసాద లబ్ధరాజ్యానాం భగవన్నారాయణ ప్ర ! సాదాసమాసాదిత వరవరాహ లాఙ్చ సేకుణ&ణవశీక్రి (*) తాశేష ! మహీభృత అశ్వమేధావభృధస్నానపవి[త్రీ] క్రి(*)తమా | ణాం స్వయ శో విజయాక్రి (*) తత్రైలోక్యాణాంచలుక్యాణాం !
(కు) లనులంక్రి (*) త్యానిజజన్మనావిరాజమానాః శ్రీ కీర్తివర్మమహా | రాజస్యనప్తాశ్రీ విష్ణువర్ధన మహారాజః రణమువీగత (?)
రిపు | విజయసముపలభ్యః శ్రీవధూని వాసాయమాన విపులవక్ష స్తల | స్య పుత్రఃశక్తిత్రయ సమధిగతమహాజ్యతవిభూతిత్రి |
వర్గసేవా నిపుణఃపురాణపురుష ఇవబహులోకస్తుతః | పురారాతిరి వభూతగణప్రియః ద్వితీయ ఇవమకరధ్వజః | పులోమ(?)
యివ లోకపాలః పృధాగ్రసుత ఇవసత్యసన్ధః శరత్కాల ఇవక్రి(*) తబద్ధు జీవోత్యవః పూర్వాచలేన్ద్ర ఇవ మిత్రోదయానుకూల । మహిమా, మహీపతి మకుటతట పుటిత మహారత్న మరీచీ మ | ఞజరీఞ తచరణార విన్దయుగళః | శ్రీన్ద్రవర్మిమహారాజః త్యా | గధేన్వపరనామధేయః ఉదక పూర్వకం సర్వకరపరిహరోపేతం । జ్వమాదయతిత్వ (?) కొన్దణగూరనా - గ్రామ, గ్రామంహ్రదాతత
స్య గామస్య | దిగ్విభౌః (o) ఉత్తరతః మాజుణ్వరనామగ్రామ | పూర్వః పగుసిరునామగ్రా | మః దక్ష్మిణది గ్భాగతస్థితః
చేఱుపూరునామ గ్రామపశ్చిమతః ఇలు | తీనామగ్రామః| ఏతేషాంగ్రామాణాం మధ్యేనివాసీక్రి(*) తంవాజసనేయచ | చరణస్యదుర్గ శర్మణః బ్రహ్మవిహిత
- ↑ కృ 'ఋ' కారము పై విధముగా వ్రాయబడుచువచ్చెను, (0) దిక్కులు