Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.1 (1918).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బంధములుండెను. కనుక మాయభిప్రాయమున, మన వారు 'యవను'లనబడు అయోనియనులను గుఱి౦చి క్రీ.౪౫౦ సంవత్సరము కంటె పూర్వమే చెప్పుకొనఁగా విని యుండవచ్చును. పరిచయము మాత్రము “డెరయసు” కాలమునుండి కలిగి యుండవచ్చును. మహాభారతమునందలియొక [1] శ్లోకము నందున్నట్టు, అలెగ్జాండరుని దండయాత్రయైన తరువాత వారితో మనవారికి మణింత సమీప సంబంధ మేర్పడి యుండవలెను. యవనులను గూర్చి చెప్పిన యీమాటయే పారసీకులు, సిథియనులు మున్నగు ఉత్తరదేశ వాసులకుఁ గూడ వర్తించుచున్నది.


ఇక హిందూదేశమునకు వత్తము. క్షాత్రయుగారంభము నుండి తద్యుగాంతము నాఁటివఱకును కొంత స్పష్టముగనైన నేమి కొంతయస్పష్టముగనైన నేమి, మనవారు ఈ దేశము నామూలాగ్రమెఱిఁగియు౦డిరి. వేదము నందు సముద్రము మాటవచ్చి యున్నది. సింధునదీ ప్రవాహము వెనువెంట నౌకలలోఁబోయి యుండిననేకాని వారికి సముద్రపు సంగతి తెలిసియుండదు. వేదము నందు పంజాబు నందలి ఐదుల పేళ్ళును, గంగా, యమునల పేళ్ళును,(వీనియుత్పత్తి స్థానములకు సమీపమున వారీనదుల నెఱిఁగియుండిరి.) వచ్చియున్నవి. రాముని కాలమున మనవారు తూర్పు సముద్రమును, గోదావరి నదిని, కొంత యస్పష్టముగా నైనను లంకాద్వీపమును, తెలిసియుండిరి. శ్రీకృష్ణుని కాలమున ఉత్తర హిందూస్థానము నామూలాగ్రమును, దక్షిణ హిందూ స్థానములోని చాల భాగమును మనవారెఱిఁగియుండిరి. ఇంతయేల? మహాభారతము తుదిమారు నిర్మింపబడుటకు ముందే, అలెగ్జాండరుని దాడికి ముందే, మనవారికి హిందూదేశము భాగుగాఁ దెలిసి యుండుననుటకు సందియపడవలసిన పనిలేదు.


అయినను పాశ్చాత్యవిద్వాంసులు ఈవిషయమున తప్పుగా నభిప్రాయపడియున్నారు. వారివ్రాతలను బట్టి చూచినచో, బుద్ధుని కాలమున మనవారికి దక్షిణ దేశము తెలియనే తెలియదు. చంద్రగుప్తకాల ప్రాంతమున నునవారు లంకాద్వీపమున నివసింపఁ బోయిరట! బుద్ధుని నిర్యాణ సంవత్సరమున లంకాద్వీపమున మొట్ట మొదట ఆర్యజనావాస మేర్పడెనను నభిప్రాయము తప్పనియు, నికాయములు వ్రాయఁబడుటకు ముందు ఆర్యులు సింహళమునకు వచ్చుట సంభవించి యుండదనియు, రైసుడేవిడ్సు వ్రాసియున్నాఁడు. ఇట్టివాదమున కాధారమేమునఁగా, బుద్ధుని కాలమున రచింపఁబడిన పైగ్రంథములలో చెప్పబడియున్న ౧౯ రాజ్యములలో ఒక రాజ్యము మాత్రము వింధ్యకు దక్షిణమున గోదావరి తీరమున నుండినట్టు చెప్పఁబడి యుండుటయట. “ఆగ్రంథములలో దక్షిణ హిందూస్థానము, లంకాద్వీపము, పేర్కొనఁబడి యుండకపోవుటేకాశ గంగానదికి తూర్పుననున్న వంగ, ఒరిస్సా దేశములు కూడలేవు; దక్షిణాపథము రాలేదు. “దక్షిణా పధమునకు వారు వచ్చుట నికాయముల కాలమున సంభవించినది. “వినయ” గ్రంథము నందు “భరుకచ్ఛ” పేరును, “ఉదాన" గ్రంథము నందు “నుప్పరక" పేరును వచ్చినవి. “రామాయణీయ ప్రాముఖ్యతగల దక్షిణ హిందూదేశమును గుఱించియు లంకాద్వీపమును గుఱించియు ఉల్లేఖనమే లేకపోవుటయు, ఆర్యుల పురోగమనము అంత పరిమితముగా నుండు నదియు ఆలోచింపఁదగిన యంశములైయున్నవి” [2] అని రైసుడేవిడ్సు వ్రాసెను.


పైవాదము మామనస్సునకు అసంగతమైనదిగా దోచుచున్నది. బుద్ధుని కాలపు ఒక గ్రంథమున పేర్కొనఁ బడిన ౧౬ రాజ్యములలో చెప్పఁబడని రాజ్యము ఆకాలమున అసలేయుండలేదను వాద మెట్టిదనఁగా, భారతమున రెండుమారులు వచ్చియున్న షోడశ మహారాజుల పేళ్ళలో లేని మహా హారాజెవ్వఁడు పురాతన హిందూ దేశమున నుండనేలేదను వాదము వంటిది. పూర్వకాలపు

గ్రంథములందు వచ్చిన యిట్టి పేళ్ళపట్టికలు సమగ్రమమైనవి యని యూహించుటకు కారణము కానరాదు. ఆగ్ర౦

  1. ↑ సర్వజ్ఞాయవనారాజ౯, శూరాశ్చైవవిశేషతః కర్ణపర్వము
  2. ↑ Budhist India by Rhys Davids.