Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.1 (1918).pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభుత్వము లభించినందున మఱింత గందరగోళము సంభవించినది. రామాయణమును తుదిమారు వ్రాసిన యాతనికి హిందూదేశపు భూగోళ వివరములు సరిగా తెలియవు. తెలిసినభాగమంతయు నొకఉత్తర హిందూస్థానము మాత్రమే. అట్లుండియు, అతఁడు, సుగ్రీవుఁడు సీతాస్వేషణమునకై వానరులను నలుదెసలకంపుచుండిన కధ గల సందర్భములో, ప్రపంచ భూగోళమును కేవలమూహపోహలతో నింపి వర్ణించియున్నాఁడు. ఈవర్ణనము నందు మేరువు ఉత్తరమునుండి యెగిరి ప్రపంచము యొక్క దక్షిణదిశాంతమునవచ్చి నిలచినది. రామాయణపుకుదికత౯ జ్యోతిశ్శాస్త్రజ్ఞానము లేని వాఁడగుట చేతకాఁబోలు, మేరువు పశ్చిమమున నుండనిచో నూర్యుఁడు మేరుపుచుట్టు తిరుగు టెట్లు సంభవించునని సందేహపడి యామేరువును పశ్చిమ దిశాంతమును స్థాపించెను!


సూర్యుఁడు తూర్పుకొండలయందుదయించి పడమటి కొండలలో నస్తంమిచుననియు - ఈకొండలు రెండూను ప్రపంచమునకు పూర్వపశ్చిమదిశలందు హద్దులనియు, వాని కావలి ప్రదేశములు మనుష్యులు ప్రవేశించుటకు వీలులేనివనియు - అస్త సమయమున సూర్యుఁడు మేరువు వేనుకకుబోయి, పడమటి కొండనుండి యుత్తరమునకుఁబోయి యుదయసమయము వరకు తూర్పుకొండవద్దికివచ్చు చుండుననియు మనవారి యూహ. మనవారొకరి నేయన నేల! భూమి పలకవలెనున్నదని నమ్ముచుండిన పూర్వకాలపు వారందఱికిని పశ్చిమమునకుఁబోయి యదృశ్యుఁడైన సూర్యుఁడు ఉదయము వఱకు తూర్పున కెట్లు వచ్చుచున్నాఁడోయనునది మహదాశ్చర్యకరమగు సమస్యయై యుండెను!


అప్పటికాలపు హింద్వార్యుల ప్రపంచ భూగోళ జ్ఞానము సరియైనదిగా నుండకపోయినను, వారికి మన దేశమును గుణించియు, మన చుట్టుప్రక్కలనున్న దేశములను గుఱించియు బాగుగాదెలిసియుండునని యొప్పుకొనక తప్పదు. హిమాలయము, కారాకోరము, అట్టాయ్ అనుమూడు పర్వతపంక్తులును - తిబెత్, తుర్కిస్థానము, సైబీరియాల యందుండిన “గోబీ”మున్నగు నెడాకులును, అనేక సరస్సులును వారికిఁదెలిసియుఁడెను. గ్రీకులను, పషి౯యనులను, సిథియనులను, హూణులను, చైనీయులను, ఉత్తర ప్రాంతములందు నివసించు అనాగరకజాతులను వారెఱిఁగియుండిరి. అలెగ్జాండరుని దండయాత్రయైన పిమ్మట మనవారికి పైన బేర్కొనిన జాతుల వారిపరిచయము కలిగెనని కొందఱువాదింతుకు కాని యది సరి కాదు. మహాభారతము లోని యొక శ్లోకము [1] నందు ఉత్తరదిశయందలి మ్లేచ్ఛులు పేర్కొనబడి యున్నారు. వారిలో హిందూదేశమున క్తుతరమున నివసించుచుండిన జాతులన్నియు చేరియున్నవి. క్షాత్ర యుగాంతమున అనఁగా అలెగ్జాండరుని దండయాత్రకు పిమ్మట ఈజాతులవారిని మనవారెఱుఁగుదురనుట యందు సంశయములేదు. కాని అంతకు పూర్వము కొన్ని శతాబ్దముల కాలము నుండియే మనవారు ఈజాతులకు కృత పరిచయులే యనుటకు కారణములు కలవు. “డెరయసు” అను పారశీక దేశపు రాజు సింధునదికి పశ్చిమముననున్న భూభాగమును తన సామ్రాజ్యమున గలిపికొని దానినొక సాత్రపీ (Satrapy)

గానేర్పఱచెను. కనుక పారసీక రాజధానియందును, పారసీక సేనలయందును జయింపఁబడిన మనవారిలోననేకులుండి యుందురు. కనుక మనవారు గ్రీకులను, సిధియనులను అలెగ్జాండరుని రాకకెన్నియో శతాబ్దములకు పూర్వము ఎఱిఁగినవారై యుండవలెను. " హీరోడోటసు" అనుచరిత్రకారుఁడు 'డెరయసు' పాలనము క్రిందనున్న పాత్రపీలను వణి౯ంచుచు, ఇరువదవ సాత్రపీయగు మనదేశము (హిందూదేశము) విశేష జనసంఖ్య కలదనియు, దీనికి తూర్పు సరిహద్దున నొక యెడారి యున్నదనియు చెప్పియున్నాడు? హీరోడోటసుపై చరిత్ర గ్రంథమును క్రీ.పూ. ౪౫౦ సంవత్సర ప్రాంతమున వ్రాసినాఁడు కనుక ఆకాలమున మనవారిని గ్రీకు లెఱిఁగియుండిరనుట స్పష్టము, అంతేకాదు, అస్సీరియనుల (Assyrians) తోడను చాల్డియనుల (Chaldians) తోడను హింద్వార్యులకు అంతకు పూర్వమే వత౯కసం

  1. ↑ యవనాళ్ళిన శాంభోజా, దారుణామ్లేచ్ఛజాతయః ౹౹ సకృదృహాః కులత్థాశ్చ, హూణాః పారనికైఃనహా౹ తథై వరమణాశ్వినాః తథైవదతమాలికా॥ ౼ బీష్ట పర్వము, ఆధ్యా:౯