Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.1 (1918).pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నొక జంబూ వృక్షమునుండి యుత్పత్తియై ఉత్తరకురు శమువైపు ప్రవహించిన జంబూనదినిబట్టి వచ్చినది. తక్కిన మూఁడింటిలో పశ్చమదిశనున్న రెండు దేశములకు ‘భద్రాశ్వము' 'కేతుమాల' యని పేర్లు. పైనవచ్చిన హైమవతవర్షమునందు, ఇప్పటి జపాను, మంచూరియా,మంగోలియా, ఉత్తర తుర్కిస్థానము,జర్మనీ, ఇంగ్లాండు చేరియుండవలెనని యనేకుల యభిప్రాయము. ఇఁక మేరువు అనునది ఉత్తర ధృవసమీపమున నుండెనని యూహించినచో, ఇలావృతవర్షమున ఇప్పటి రష్యా, స్వీడెను, నార్వేలు ఒక వైపునను, ఉత్తర అమెరికా ఇంకొక వైపునను చేరియుండెనని చెప్పవచ్చును. ఇచ్చటి భూమి బంగారపుదని మనవారు చెప్పియున్నారు. ఉత్తర కనడాలోని యొక భాగమున బంగారుదొరకు చున్నమాట వాస్తవమేకాని ఈసామ్యము కాకతాళీయముగా సంభవించినదని తోచుచున్నది. ఈవర్షమునందే చేరియున్న రష్యా సైబేరియాలు ఇప్పటి కాలమందంత సుఖప్రదమైనవి కాకపోయినను పురాతనకాలమున నిప్పటికంటె నెక్కువ వాసయోగ్యములుగా నుండి యుండవచ్చును. ఇంతేకాక, అవి యార్యుల అతిపురాతన నివాసస్థలములైన కారణమున వారు ఆప్రదేశమును “పుణ్యభూమి? గా నెంచుచుండిన నుండవచ్చును. మేరువున కుత్తరమున నున్నవని చెప్పబడి యున్న మూఁడు పర్వతములు దక్షిణముననున్న మూఁడు పర్వతపంక్తులను బట్టి కల్పింపఁ బడినవై యుండవచ్చును. దక్షిణముననున్న పర్వతపంక్తులను మాత్రము మనవారెఱిఁగియే యుండిరనుట నిస్సంశయము. ఏలయనంగా, కైలాసపర్వతమున కుత్తరమున నున్న హరి వర్షమునం దొక విశాలమైన ఇసుక యెడారియు నొక సరోవరమును ఉండినట్టు వర్ణింపఁబడి యున్నది. మహాప్రస్థానిక పర్వము నందుఁ గూడ పాండవులు ఉత్తరాభిముఖులై పోవునప్పుడు, ఒక యిసుక యడారిని దాటిరని చెప్పబడి యున్నది. ఈయిసుక యెడారియే యనియు, దారి ఇప్పటి "గోబీ” యెడారియే యనియు, సరోవరము "ఆరల్ సముద్రము”(Sea of Arl) అనియు స్పష్టముగాఁ దెలియుచునే యున్నది కదా.

కొంత యదార్థమును కొంత యూహాజనితమును నగు పైసెణ౯నయే ఇంచుకమార్పుతో రామాయణము నందు వచ్చినది; కాని రామయణమునందు ఊహకు నిరంకుశ