క్షాత్రయుగమునాఁటి హింద్వార్యులు - వారి భూగోళశాస్త్ర జ్ఞానము
క్షాత్రయుగారంభమున హింద్వార్యులకు భూగోళశాస్త్రజ్ఞాన మెంతయుండునో యూహించుటకష్టము; కాని తద్యుగాంతము నాఁటికి వారికి హిందూదేశమును గుణించియు చుట్టు ప్రక్కలనున్న దేశములను గురించియు బాగుగాఁ దెలిసియుండెనని చెప్పవచ్చును. ప్రపంచ భూగోళమును గుఱించి వారికి వివరము లంతగాఁ దెలిసి యుండలేదు. ఆ ప్రకారము తెలియనిచోట్లయందెల్ల వారు ఊహతో పనిగొనిరని తెలిసి యున్నది. వీర కావ్యము లందు వచ్చియున్న వర్ణనలను బట్టి వారి “ప్రపంచము” ఎట్టిదిగానండెనో చూతము.
మహాభారతానుసారము:- ప్రపంచము అనేక ద్వీపములుగా భాగింపఁబడి యున్నది. మనముండు భూభాగమునకు "జంబూ ద్వీపము" అనగా జంబూ వృక్షముకల ద్వీపము అని పేరు. ఈద్వీపము అనేక 'వర్షములు' గా విభజింపఁబడి యున్నది. [1] (పటము జూడుఁడు) భూమికి ఉత్తరపు సరిహద్దున క్షీరసముద్రమున్నది. దక్షిణపు హద్దున లవణసముద్రము కలదు. పూర్వ పశ్చిమలందును సముద్రము లున్నవి. [2] భూమధ్యప్రదేశమున మేరు పర్వతము మున్నది. దీనికి దక్షిణమున మూఁడు పస్వత పంక్తులు పూర్వ పశ్చిమదిశల వ్యాపించి యున్నవి. దీని పేళ్లు నిషధపర్వతము (అల్టాయ్); హేమకూటము (కారాకోరము) హిమాలయము; హిమాలయమునకు - దక్షిణమున భారతవర్షమును, ఆయక్షాంశముననున్న ఇతర దేశములును కలవు. వీని కుత్తరమున హైమవతవర్షమున్నది. నిషధపర్వతమున కుత్తరమున ఇలావృతవర్షము కలదు. మేరువు, చిన్నవగు మఱి రెండు పర్వతములు (మాల్యవంతము గంథమాదనము, అనునవి) ఈభూ భాగమును నాల్గు చిన్నభాగములుగాఁ జేయు చున్నవి. ఈ నాల్గు భాగములలో నొకటి జంబూ ద్వీపము. ఈద్వీపమునకీ పేరు అతివిశాలమగు