Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.1 (1918).pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హిందూదేశ గ్రంథభాండాగారుల సభ

ఈనామముతో ౧౯౧౮ సం॥ జనవరి ౪,౫, తేదీలందు లాహోరు పట్టణమున ప్రభుత్వమువారి యాదరణక్రింద నొకసభ సమావేశము గావింపబడినది. హిందూదేశప్రభుత్వమునందు విద్యాధికారియగు ఆనరబిల్' షార్పు దొరగారు అగ్రాసనాధిపత్యమును వహించిరి. వివిధ రాష్ట్రములయందలి ప్రభుత్వమువారి గ్రంథాలయముల నుండియు, కళాశాలలనుండియు ౩౧ మంది ప్రతినిధులేతెంచిరి. బరోడా రాజ్యమునుండి న్యూటమదత్తుగారుసు, హిందూవిశ్వవిద్యాలయమునుండి జాధూనాధ సర్కారుగారును కూడ లేతెంచిరి. ఆంధ్రదేశగ్రంథాలయసంఘమునుండిగూడ ప్రతినిధిని పంపెదమని వ్రాయగా, సభ్యుల సంఖ్య ఇదివరకే ఎక్కువగానుండి యుండుటచేత, స్థలముండినచో ప్రేక్షకునిగా మాత్రమంగీకరించెదమని తెలిపిగి, విశేష వ్యయప్రయాసలకు లోనై ఆంధ్రదేశమునుండి లాహోరుపట్టణ మేగినను, సభయందు పేరుకుడుగ నైన స్థలముదొరుకునో లేదో తెలియకపోవుట యటుండ - ఈగ్రంథభాండాగారుల సభవలన మనసార్వజనిక గ్రంథాలయోద్యమమున కేవిధమైన ఉత్సాహప్రోత్సాహములుసు లేవని గ్రహించి ఆసభకు ఆంధ్రదేశగ్రంథాలయ సంఘమునుండి ప్రతినిధులెవ్వరును పోయియుండలేదు. తుదకు ఫలితముకూడ ఊహించినట్లే జరిగినది.

హిందూ దేశముయొక్క వివిధభాగములనుండి గ్రంథాలయములయందారి తేరిన, వేత్తలందరిని ఒక చోటగూర్చుటవలన అమితమగులాభము చేకూరినదనియు, హిందూదేశమంతటను వెదజల్లబడియుండిన గ్రంధ రాజములను అందుబాటునకు దెచ్చుటను గూర్చి ముఖ్యముగ యోచింపవలెననియు అగ్రాసనాధిపతిగారు చెప్పిరి. జిజ్ఞాసులగువారికి కావలసినగ్రంథములు తరుచు గాలభించుట లేదనియు, గొప్పస్థలములయందు విశేషముగ గ్రంథములు సేకరింపబడుటయు అవి అందుబాటులో నుండు సదుపాయములు లేకుండుటయు తటస్థించుచున్నదనియు, కాబట్టి హిందూదేశమునందొక భాగమునందున్న విద్యాధి౯కా ఇంకొకభాగమునందున్న గ్రంథాలయములను ఉపయోగించునటుల చేయుట ఎట్లో ఆలోచింపవలసియున్నదనియు చెప్పిరి. హిందూదేశమందున్న వివిధ గ్రంధాలయములకును సంబంధమును గలుగ జేసి, ఒక దానియందున్న గ్రంధములు వేరొక దానికి నులభముగా లభ్యమగునటుల చేయుటకు మాగ౯ముల నాలోచించుటయే ఆసభయొక్క ప్రథానోద్దేశమనియు - ఈవిషయముతో బాటుగ, విషయములనూచికల నేర్పరుచుట, శాస్త్రవిషయిక పత్రికలపట్టికను తయారుచేయుట, గ్రంథాలయ సహకారులను తయారుచేయుట, పుస్తకములను పరస్పరము మార్చుకొనుట మొదలగు విషయములను గూర్చియాలోచింపవలెననియు జెప్పిరి. ఉన్నతవిద్యాభ్యాసకులకును ప్రత్యేక విషయములగూర్చి పరిశీలన జేయువారికిని సంబంధించిన విషయములనుగూర్చి మాత్రమే యోచింపుచున్నామనియు - విద్యార్థుల ఆశయములగూర్చిగాని కొన్ని రాజధానుల స్థాపింపబడుచున్న పల్లెటూళ్ళ గ్రంథాలయములను గూర్చిగాని, జనులందరికి పనికివచ్చువానినిగూర్చిగాని యోచింపుటలేదనియు జెప్పిరి. వ్యవధి ఉండిన ఈ విషయములను గూర్చి యోచించెదమనియు, ఏదోవిధముగ ప్రారంభించి, శాస్త్రవేత్తల పనికి సహాయము జేసిన, సామాన్యపాఠకునికిగూడ సహాయనుగుననియు జెప్పిరి.

పిమ్మట వివిధచర్చలుజేసిన తరువాత ఈతీర్మానములు చేయబడినవి:— హిందూ దేశమునందున్న గ్రంథాలయముల సంఖ్య వివరణమును తయారుజేయుట ముందు ఆవశ్యకమగుటచే, బెంగాలు ఏసియాటిక్ సొసైటీ, బొంబాయిఏసియాటిక్ సొసైటీ శాఖ, మద్రాసు విశ్వవిద్యాలయ గ్రంథాలయము, ఇంపీరియల్ లైబ్రరీ (కలకత్తా) మున్నగువానితో ఆలోచించి - అట్టి గ్రంథాలయముల సంఖ్యా వివరణమును తయారుజేయుటకై హిందూదేశప్రభుత్వమువారినికోరుచున్నారు. ఎట్టివానిని ఈ పట్టికలో చేర్చవలయునను నిణ౯యమును ప్రభుత్వము వారికే వదలిపెట్టిరి. ప్రతిగ్రంథాలయము యొక్క స్థలము, స్థాపన తేదీ,