Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.1 (1918).pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పుచ్చుకొనవచ్చును. దీని తరువాత తాలూకాగ్రంథనిలయములు గలవు. వీనియందు ౪౦౦౦ లేక ౫౦౦౦ ఫుస్తకములుండును. వీనికిని గ్రానగ్రంథాగారములకును పైన చెప్పబడినట్లే బాంధవ్యముకలదు.

స్థాయిగానుండు గ్రంథాగారములు లేక పుస్తకనిలయములు లేని పల్లెలకు సంచార గ్రంథాగారములు ౫౦, ౬౦ గ్రంథములతో పంపబడును. సుఱియును కేంద్రగంధాలయమునుండి “మ్యాజిక్కు లాంతరులు, సిని మెగ్రాఫులు" గ్రామములలోనికి పంపబడుచుండును. సాధ్యమయినంత వఱకు గ్రంధాలయముల కన్యోన్యసంబంధమేర్పాటు చేసిన యెడల విశేషలాభము కలుగగలదు.

ఇక గ్రంధనిలయమునకు వలయుధనమును గురించి యొకింతీయాలోచింతము - బరోడాలో ఉన్నవారలు గ్రంధాగారమునకై కొంత దందావేసుకొని పోగుచేసినయెడల తాలూకా జిల్లాబోర్డుల మూలధనమునుండియు రాష్ట్రీయ బొక్కసమును౦డిము గూడ కొంతమొత్తము సంగబడును. ఇదిగాక దేశమందసేక బాపతుల ఉమ్మడి సొమ్ము గలదు వీలు తెలిసిప్రయత్నించినచో నిట్టిధనము వలన ఆయాస్థలములయందు తగినన్ని గ్రంథాగారముల స్థాపించుట కభ్యంతరముండదు.

ఇట్టి గ్రంధనిలయమును స్థాపించిన తరువాత నది చిరస్థాయిగ నుండునటుల జాగ్రత్తపడవలెను. ఇట్టి సంఘమందు కొన్నికొన్ని దురాచారము లెప్పటికిని ప్రవేశింపకుండ జాగ్రత్తపడవలెను. మఱియు గ్రంధాలయములను “క్లబ్బులని" వ్యవహరింపబడువానికిని చాలవ్యత్యాసము కలదను విషయమొకటి ముఖ్యముగ గమనింపవలయును. త్రాగుడు జూదము మొదలగు దురాచారము లీగ్రంధాలయ పరిసరమందుగూడ జరుగకుండ జాగ్రత పుచ్చుకొనవలయును. ఊరిలోని వివాదలలో నీసంఘమెప్పుడు జోక్యము కలుగజేసికొనగూడదు. వర్ణమతభేదము లేక గ్రంథాలయములోని కందఱకును ప్రవేశ మొసంగవలయును. ఎల్లరకును దర్శనీయమై యుండవలయును.

ఆయాదేశములయందు సావకాశములున్నచో బాలురకు స్త్రీలకుగూడ విద్యాభివృద్ధికై ప్రత్యేకపు యేర్పాటులు చేయింపవచ్చును. ఊరిలోనుండు ప్రధమపాఠశాలతో సంబంధ మేర్పరుచుకొని బాలురనందఱను గ్రంథాగారమునకు గొంపోయి గాని, వారిబడికి పుస్తకములంపి గాని వారి జ్ఞానాభివృద్ధికై తోడ్పడుచుండవలయును. ఇందులకని ప్రతిగ్రంథాగారమునందును బాలుర కుపయుక్తములగు పుస్తకసముదాయము కొంత యుండవలయును. తరువాత ఊరిలో జరుగు హరికధా కాలక్షేపములు మొదలైన జనసామాన్యమునకు వినోదమును జ్ఞానమునుచేకూర్పు సమావేశములన్నియు నీ గ్రంథాగార పక్షమున జరిగించుటకు ప్రయత్నింపవలయును. ఇట్లొనర్చిన జనులకందఱకు గ్రంథాగారము ప్రీతిపాత్రమైవెలయుచుండును. వీలైనయెడల బడిపిల్లలకు పోటీ పరీక్షలు చేసి యుతీర్ణులగువారికి బహుమతులోసంగు చుండినయెడల వారందరును గ్రంథాలయములం దుత్సాహముకలవారై పెద్దవాండైన పిదప వీని నెంత్రియో వృద్ధిలోనికి తేగలుగుదురు.

ఇంతవరకు మనము చేసిన విచాణవలన మానవాభ్యుదయమునకు తోడ్పడు ప్రత్యుద్యమమును గ్రంథాగారమం దంతగ్గర్భితమై యున్నదని తేలినది. భావికాలనుందు సత్పౌరులై దేశోపకార మొనర్చునట్టిశక్తిని సంపాదించుకొనుటకై గ్రంథాగారము తగిన యుపదేశస్థలము. దురహంకారములు రూపుమాసిపోవును, సహిష్ణుతయును, సంఘీభావమును, పెంపొఁదును. ఊరిలోని యద్యమములన్నియును, గ్రంథాగారమునందే జనింపకున్నను అచ్చట తప్పక ప్రతిఫలించును. ఈ విధమున యధావిధిగ గ్రంధనిలయములు దేశమందంతటను స్థాపించినయెడల, అయ్యవి దేశజుల పురోభివృద్ధి కెంతయు తోడ్పడి, మాతృభూమి నింతకంటె వేయిమడుంగు లధికముగ 'ధనవంతముగను, సౌఖ్యవంతముగను, చేయ సమర్ధములగును.

[౧౯౧ సం. జనవరి నెల ౨౫ తేదీన దక్షిణహిందూదేశమున పుదుక్కోటసంస్థానమునందున్న “అలంగుడి” యందు జరిగిన గ్రంథాలయ ప్రతినిధులసభకు ఈ వ్యాసము పంపబడి, అందు ఆరవభాషయందు చదువబడినది.]

ఓంశాంతిశ్శాంతిశ్శాంతిః

- సూరి వేంకటనరసింహశాస్త్రి.