Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.1 (1918).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వారును ఇతరులవలన మేలందుచుండియు తామే తమ ప్రపంచజ్ఞాన విశేషముచేత సాంఘికులకెంతియు ఉపయోగపడుదురు.

ఇకముందు కష్టతరమైన సమస్యయొకటి ఆలోచింపవలసియున్నది. గ్రంథాగారము అన్ని తరగతులవారికిని ప్రీతిపాత్రమై యుండునట్లొనర్చుటెట్లు? తనకడకేతెంచినవారికేదియో కొంతజ్ఞానముకలుగజేసి, తన యాస్తిపోకుండ కాపాడుకొనుట మాత్రమేకాక, తన్నుదానుప్రచురపఱచుకొని చుట్టుప్రక్కలనుండుమనుజుల చాకషి౯౦చుట మేలొందించుటగూడ నవీనపుస్తకనిలయముయొక్క విధియైయున్నది. ఇట్లొనర్చుట యెట్లుపొసగునని యాలోచించిన, మనపూర్వపు పద్ధతులే కొన్ని మాగ౯ములనుసూచించుచున్నవి. మనహరికథలు, మనకాలక్షేపములు, మనయూరేగింపులు, మనబొబ్బిలి కధలు, ఇవన్నియు సంతోషజనకములు మాత్రమేకాక జ్ఞానప్రదాయకములు గూడనగుచున్నవి; వీనియందు, జనులనఁదఱ నొకచోగూర్చి ఒక పరమార్థచింత యందు వారి నానాత్వములను పఱచిపోవునటుల జేయజాలుశక్తిగర్భితమై బీజరూపమై యుండియున్నయది. కావున, ఈ పూర్వపుపద్ధతుల నూతనభావములకను గుణ్యముగ మార్చి పునర్జీవమిచ్చి విలువబెట్టినచో, నయ్యవి జనులయభివృద్ధికనేక విధములతోడ్పడునట్లు చేయవచ్చును.

ఇట్లు ఆనేకములైనరుచులను, ఉద్యోగములనుగగిన యిందరిని గలిపి యొకసంఘమును నిర్మించుటెట్లను విషయ మిటుపై నాలోచింపవలసియున్నది. ఈపనికై ఈ కాలపు సంఘనిర్మాణపద్ధతుల నవలంబింపవలయును. సాంఘికులగుటకొరకై నెలసరి చందా కొంతయొసగునట్లు యేర్పాటుచేయవచ్చును. సాంఘికులందరినుండియును కార్యనిర్వాహక సంఘమొకటి యేర్పాటుచేయవచ్చును. ఏవోకొన్ని లెక్కలు జాబితాలుగూడ నుంచుటయు నవపరము. ఈ లెక్కలను జాగ్రతగ పరిశీలించి సాంఘికులందఱికి యేడాదికొకసారి వినిపించవలయును. మఱియు పుస్తకనిలయ సాంవత్సరోత్సవము జరుగునప్పుడు వీనిని యూరివారందఱకిగూడ వినిపింపవలయును. ఈసాంవత్సరోత్సవమునకు ఊరివారినందఱను పిలుచుట యేకాక దగ్గఱ పట్టణములలో నున్న విద్యావంతులగువారిని, ఉపన్యాసము లిచ్చుటకును అగ్రాసనాధిపత్యమువహించుటకును ఆహ్వానము చేయవచ్చును. సాంవత్సర సమావేశమునందు రాబోవుసంవత్సరపు ఖర్చువివరము వ్రాసి యద్ధానికి సాంఘికుల సమ్మతిని పొందవలయును. మఱియు సంఘకార్య నిర్వహణమునకై కొన్ని నిబంధనల నేర్పాటు చేయవలయును.

ఇట్లేపేర్పాటుకాబడిన సంఘము పూర్వపుగ్రామ సంఘమువలెనే యుండును. గ్రామస్ధులకు ఇతరవిషయములలో నేమిభేదాభిప్రాయములున్నను సాంఘికుల నెన్నుకొనుట - అనేకతరగతులవారు జ్ఞానసంపాదనకై ఏకత్రసమావేశమగుట - అను విషయములలో వారికి భేదమువచ్చుటకవకాశము లేకుండజేయుటవలన నూరిలో కొంత యైకమత్యతయును సంఘీభావమును కలుగజేయవచ్చును. అందరకును మేలొనర్చు నీపనికొఱకు తమకదివఱకు గెలుగు క్షుద్రములైన యంతఃకలహముల మాని వేయుదురు. ఈవిధముగ నిట్టిసంఘ మేర్పాటుచేయబడిన ప్రతి స్థలమందును స్వపరిపాలనా కార్యసమర్థతకు తగిన పరికరములను సమకూర్పవచ్చును. ఇట్లనేక స్థలములయందు పుస్తకనిలయముల నేర్పాటు గావించి వీని యన్నిటికిని కొంత అన్యోన్యసంబంధము గల్పింపవలయును. దొరతనమువారిచే విశేషధనముతో ప్రతిష్ఠాపింపబడు నేదియోయొక పుస్తకాగారముతప్ప తక్కినవన్నియు పరిపూర్ణముగనుండుటకు వీలుండదుగావున ఈ గ్రంథాలయములొకటి కొకటి సాహాయ్యముచేసికొనుట కేర్పాటు చేయవచ్చును. బరోడా రాజ్యమందిట్టి పద్ధతి నవలంబించి యున్నారు. అక్కడ ౨ లక్షల గ్రంధములుగల యొక కేంద్రగంధాలయము గలదు. ఈ కేంద్ర గ్రంథాలయమునకు సంబంధించిన యేపుస్తకనిలయమయినను అచ్చటనుండి పుస్తకములను తీసికొనవచ్చును. ఈకేంద్రగ్రంథాలయము తరువాత ౨౦,౦౦౦ పుస్తకములుగల జిల్లా గ్రంథాలయములు గలవు. గ్రామగ్రంథాలయములకు వలయుగ్రంధములు వీనివద్దనుండి యవసరమగునప్పుడు