కావున, నవీనపరివేష్టనమునకును, భావములకును సరిపడి ప్రాతయేగ్పాటులందుగల్గు మేలుపద్ధతులు నశింపకుండ నిలుపజాలు నొక క్రొత్తయేర్పాటును కనుగొనుట యవసరమై కన్పట్టుచున్నది. ధర్మపుస్తకాగారమీ కార్యనిర్వహణమునకు సమధ౯మని చెప్పవచ్చును. కావున ఈ యుద్యమనాయకులు పుస్తకనిలయములు జ్ఞానదానము చేయుటకు తగినయేర్పాటులు చేయనాలోచింప వలయాను. ఇదిచేయుటెట్లు? అనుసమస్య ముందాలోచింపవలయును.
పుస్తకా గారమునకు కావలసిన పరికరము లివియేయని సామాన్యముగా అందరకును స్ఫురించును:- ఎల్లరకు ప్రవేశముగల యొక భవనము, కొన్ని పుస్తకపుటరలు, చదువుకొనుటకు చాపలు, కొన్నిపుస్తకములు, మాసపత్రికలు, వారపత్రికలు, ఒకరిద్దరు భాండాగారికులు, ఒకరిద్దరునౌకరులు. ఆభావము సరికాదు.
ఈగ్రంథాలయముల కార్యసిద్ధికి ముఖ్యసాధనము అందుకృషి చేయువారల శక్తిసామధ్యములేకాని కేవలధనసమృద్ధి కాదను విషయము మాత్రము ముఖ్యముగ గమనింపవలయును. ఒక గ్రంథాలయమునకు మంచిపుస్తకసముదాయము, విశేషధనమును గలిగినను అయ్యవి సద్వినియోగము కాకపోవచ్చును. కాని మంచి గ్రంథములు కొలదిమాత్రమేగలిగియు మఱియొకపు పుస్తకనిలయము పరిసర ప్రదేశమునకంతకును జ్ఞానపీపమువలె ప్రకాశింపవచ్చును. కావున యీయుద్యమమునకు నాయకులై యుండువారు సత్వరమా విధిని రూఢిగగుతె౯ఱింగి, గ్రంథాలయములను సమర్థులైన కార్యదర్శులకొప్పజెప్పవలయును.
మన పట్టణములందును పల్లెలందు నిట్టి పుస్తకనిలయములను స్థాపించుటకు పరికరములు గలవా లేవా? దేవ భాషాపారంగతులైన విద్వాంసులు మన దేశమునందు ప్రతి గ్రామమునందును గలరు. ఆంధ్రమునందు మంచి ప్రవేశముగలవారును గలరు. తరువాత క్రొత్తచదువుల యంత్రశాలలో సగము తయారై తత్ఫలసిద్ధిని పొందనివారును మెట్రిక్యులేష్౯ తప్పినవారలును గ్రామములందు రా దచ్చటచ్చటగలరు. అటుపైన చదువు వచ్చియు రానివారును నిరక్షరకుక్షులు నైన పాటకజనమెంతయో కలదు.
కావున పైనుదహరింపబడియున్న తరగతులవారందరికిని ఉపయోగకారియగునట్లుగ గ్రంథాలయమేర్పరుపబడ వలయును. మనము తరుణ వయస్కులగువారి విషయమేకాక బాలురవిషయమైకూడ ఆలోచింపవలయును. అన్ని తరగతులవారునొకచోటగూడి వారి వారివిద్యల శక్త్యానుసారముగ అన్యోన్యాభివృద్ధి కొరకై వినియోగించుకొనుట మనకు సాంప్రదాయ సిద్ధమైన యాచారమైయున్నది. ఈవిషయము మనమునందుంచుకొని గ్రామములయందు మనముపుస్తకాలయముల స్థాపింపవలయును. పండితుడును, భగ్నమనోరధుడైన యాంగ్ల సంభవుడును - నిరక్షరకుక్ష్కులగు వ్యావసాయిక పారిశ్రామిక జనమందఱును గ్రంథాలయమునకు అకిషి౯౦పబడు ఉపాయమొండుగన్నెట్టవలయును. మఱియును వీరందఱు స్వవృద్ధికై పాటుబడుచు, ఆన్యోన్యము సహాయము చేసికొనునట్లుగా ఏర్పాటు చేయవలయును. ఇదియెట్లు సాధ్యమో ఇటుపైన కొంతవిచారింతము.
ఆంధ్రమందు గాని గీర్వాణమునందుగాని ప్రవేశము గలిగియున్న పండితునకు, స్వదేశపద్ధతులెగాని పరదేశ సాంప్రదాయము లేమియు తెలియవు; కాని తెలిసికొనవలయునను నిచ్చమాత్రముకలదు. కావున ఆంగ్లజ్ఞానము కలవాడీతనికి వాతా౯పత్రికలు చదివి - జలాంతర్గాములు, ఆకాశవిమానములు మొదలైనయీనాటియద్భుత నిర్మాణములను గురించియు, నిత్యమునుపయోగపడు పట్టణపారిశుధ్య, పారిశ్రామికాది విషయముల గుణించియు చెప్పుచుండవలయును. పండితుడన్ననో జనసామాన్యమునకు పూర్వపు మనసాంప్రదాయములను గుఱించి బోధయెనర్చుచుండవలెను. ఈవిధముగ పండితుడును ఆంగ్లేయవిద్య నభ్యసించిన వాడును, ఒకేగ్రంథాలయమునందు కలియుటవలన అన్యోన్యము సహాయముచేసికొని జ్ఞానాభివృద్ధియొనర్చుకొనవచ్చును. విద్యావిహీనులయ్యు మూల్యమైన లౌకికజ్ఞానముగల రయితులు మొదలైన