రమునందు ౪౦ గ్రామములకు ౬౦ పెట్టెల నంపగా, ౨౫౭౪ మంది ౭౦౦౦ గ్రంధములను చదివిరి. ౧౯౧౪ సం॥న ౩౦౨ గ్రామములకు ౩౫౪ పెట్టెల వంపగా, ౭౫౫౬ మంది ౧౫౩౦౩ గ్రంధములను జదివిరి - ౧౯౧౫, ౧౯౧౬, సంవత్సరము లందీపెట్టెలనన్నిటిని కేంద్రగ్రంథాలయమునకు దెప్పించి, క్రొత్త ఏర్పాటులను చేయుచుండుటచేత, ఆరుమాసములకాలము గ్రామాదులకు పంపనేలేదు. అందుచేత ఈ రెండు సంవత్సరములందును కొంచెము ప్రచారము తగ్గినది. సంవత్సరమునకు ఈ సంచార గ్రంథాలయముల క్రింది ఖర్చు రు ౩౦౦౦ లు.
మొదటి ఆరు సంవత్సరములందును రు ౧౧౪౧౩-౭-౪ లు గ్రంథములకును, రు ౨౪౬౩-౧౨౯ లు పెట్టెలు చేయించుటకును, రు ౨౬౯౧-౦-౦ లు ఇతర ఖర్చుల క్రిందన, వెరశి రు ౧౬౫౮-౪-౧ లు వ్యయమైనవి.
ఉచిత నిర్బంధ విద్యాప్రదానమునకు వలెనే, సంచార గ్రంథాలయములను జనులకు ఉచితముగ ప్రసాదించుట యందుగూడ బరోడారాజ్యము భారతవర్షమంతకును మూగ్గదర్శకమై వెలయుచున్నది.
కేంద్ర గ్రంథాలయము - బరోడా

సంచార గ్రంథాలయముల పెట్టెలు
కేంద్రగ్రంథాలయము - బరోడా
సంచార గ్రంథాలయపేటిక

బొంబాయి గవర్నరు గారి సతీతిలకమగు వెల్లింగుటను ప్రభ్విగారు
కేంద్రగ్రంథాలయమును దర్శించినప్పుడు ఆమెకు బహుమతిగా నియ్యబడినది.
దాని మీదనున్న రాజచిహ్నము వెండితో చేయబడినది
గ్రంథాలయ స్థాపన
బ్రిటిషుఇండియాయందును స్వదేశసంస్థానములందును గ్రంథాలయోద్యమమును గూర్చిన కృషి జరుగుచుండుట దేశాభ్యుదయమునకు శుభసూచకము. పుస్తకాగార ప్రతిష్టాపనగూర్చిన వివరములు తెలుపకముందు ఈయుద్యమముయొక్క వ్యాప్తిని గూర్చియు పరమావధిని గూర్చియు కొంతచర్చించుట అవసరము. రాజకీయ, సాంఘిక, శారీరక, నైతికాథ్యాత్మికాది మానవశక్తుల - నింతయేల - ఏమేమి సంపూ౯ముగా పౌరుషమును ప్రకాశింపజేయగల్గునో యదియంతయు ఈ యుద్యమము యొక్క అంతర్భాగమేయైయున్నది. పైన చెప్పిన ఈమానవశక్తుల నన్నిటిని హాయిగ పరస్పర విరోధములేకుండ వ్యక్తీకరింప చేసుకొనుటకు సాంఘికుల కేగ్రంథాలయమవకాళమీయగల్గునో అదియ కృతార్థతను పొందునని చెప్పవచ్చును. అందువలన ముకుళించుకొని యవ్యక్తమైలోనున్న మానవశక్తుల ప్రకాశింపచేసుకొనుటకు తగినయవకాశమునోసగుట ఈయుద్యమ నాయకులకు విధియైయున్నది.
సంఘపురుషుని యందు వ్యక్తమైయుండు నీవివిధళక్తుల వికసింపచేసికొనుటకు తగినయవకాశము లీహిందూదేశమునందీ పిదపరోజుల నాగరకతా ప్రచారణకు పూర్వము కలవాలేవా యనుచర్చ యొకింత చేయవలసియున్నది. ఇట్టిప్రతిష్టాపనలు మనదేశమున నెన్నియో కలవని మనకు స్ఫురించకమానదు. హిందూదేవాలయమిట్టి ప్రతిష్టాపనలలో సగ్రగణ్యమని వేరుగ చెప్పనక్కరలేదు. దానిని ఎట్లువణిం౯పనగును. వివాహములకు సాక్షి; ప్రమాణమునకురచ్చ; ధర్మశాస్త్రచర్చలకు సభాభవనము; పరదేశీయులకు ధర్మశాల; పనివాండ్రకు ప్రాపు; సన్యాసులకుమఠము; భక్తవరులకునికి పట్టు; ఇడియదియన నేల - ప్రజలజీవ నాధారమై విద్యాపోషకమై జ్ఞానదాయకమై సౌందర్యస్థానమై ఆనందాంబుధియై దేవళంబు విరాజిల్లుచుండు. అద్దానియందు సాంఘిక జీవనమంతయు పుంజీభవించియుండును. సంఘశక్తులకన్నిటికిని ఆయ్యది మచ్చులచావడివంటిది. పెద్దలు, పిన్నలు, విద్యావంతులు, చదువులేనివారు, ధనవంతులు, పేదలు, లౌకికులు, భక్తులు, వీరు వారననేల సాంఘికులు యావన్మంగియును ఈస్థలమున కాకషీ౯౦పబడిన పరమాధ౯మును గుతె౯రిగి తమతమపృధక్త్వమును వీడగల్గిరి.
మనతీధ౯యాత్రలును పండుగలును ఈ విధముగనే యుపయోగపడుచుండెనని చెప్పవచ్చును. ఇవికాక మన గ్రామసంఘములును కొద్దిలోనిట్టులే మానవశక్తులను వృద్ధిచేయ ప్రయత్నించుచుండెడివి. కారణాంతరములచే ఈ యేర్పాటులన్నియు ప్రస్తుతము తోలుతటి జవసత్వములుడిగి సరిగ పనిచేయుట లేదు.