Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.1 (1918).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రుచుల ననుగురించి మారుచుండును. కొందరికి, గ్రంధములను చదువవలయుననెడి ఆసక్తియే యుండదు. మరి కొందరికి, ఆసక్తి ఉన్నను ఏగ్రంథములను చదువవలయునో తెలియదు. అట్టిస్థితియందు వారేగ్రంధములను చదువవలయునో మనమే నిర్ణయము చేయవలసి యుండును అట్టివారికి స్థిరముగానుండు పుస్తకములు గలిగిన సంచార గ్రంథాలయములు అవశ్యకములు.

మరికొందరు తామే గ్రంథములను చదువవలయునో తెలిసినవారై యుందురు; కొందరు ఏదోయొక ప్రత్యేక విశిషయమును గూర్చి చదువవలయుననిగాని, పరిశ్రమ చేయవలెననిగాని తలంచువారుందురు. అట్టి వారికి స్థిరముగానుండు సంచార గ్రంథాలయములవలని లాభములేదు. అందుచేత వారికి కావలసిన గ్రంధములను ప్రత్యేకముగ వీరి సంచార గ్రంథలయముల యందు పెట్టి పంపుచుందురు.

సంచార గ్రంథాలయములు జయప్రదములగుటకు గాను, అందులో పెట్టుగ్రంధములను జాగ్రత్తగా నేర్పుట ప్రాధాన్యము. ఇందు పెట్టుగ్రంధములు హితకరమైనవిగను, చదువుట కింపైనవిగను ఉండవలయును. ఈ పెట్టెయందు కొద్దిగ్రంథములు మాత్రముండును గదా! ఈకొద్ది గ్రంధములందును వారి కనుగుణమైన గ్రంధము లభింపవలెను. అందుచేత శాస్త్ర విషయములైన గ్రంథములు వీరియందుండిన జనుల నాకర్షింపజాలవు. కావున ఉల్లాసకరములును, నిర్మలములును, హితకరములును, నగుగ్రంథములు - అందు ముఖ్యముగా కధలు - ఇందుండవలెను. ఇంతేగాక అవి మాధుర్యరసమును జిలుకునవియు, జ్ఞానబోధకములును నైయుండవలెను. కోరిన విషయములను గూర్చిన గ్రంథములుగల పెట్టెలను పంపునపుడు గూడ, ఆగ్రంధములు చదువరుల జిజ్ఞాసకు దోడ్పడునవియై యుండవలెను. ఈసూత్రముల ననుసరించి, స్త్రీలకు, చిన్నపిల్లలకు, వ్యవసాయదారులకు, చిత్రకారులకు, ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు - ఈప్రకారము వేర్వేరు మనోనృత్తులు గలిగిన వారికి వలయు గ్రంథములను ప్రత్యేకముగ నేర్చిపెట్టిరి:

గ్రంధముల ఉపయోగములు వృద్ధిజేయుటయే సంచార గ్రంథాలయముల పరమోద్దేశము. కావున పుస్తకముల నెరువిచ్చు నియమములుగూడ సులభములై అధికార నిరంకుశత్వమున కవకాశములేనివై యుండవలెను. పాఠశాలగల గ్రామమందు ఉపాధ్యాయుడు వ్రాసినయెడల సంచార గ్రంథాలయ మంపబడును. అదిలేని గ్రామమందు ఒకరు గాని, ఇద్దరుగాని, గ్రంథముల నెరువిచ్చి వానిని భద్రముగా గాపాడెదరుని వ్రాసిన జాలును, సంచార గ్రంథాలయమును ఒక గ్రామమునందు మూడుమాసముల కాలము ఉంచుకొనవచ్చును. పిమ్మట దానిని కేంద్ర గ్రంథాలయమున కంపివేయవలెను. అప్పుడా కేఁద్రగ్రంధాలయమువారు గ్రంధములను పరిశీలించి, మరమ్మతులు చేయవలసినవానికి చేసి, వేరొకస్థలమున కంపెదరు. కేంద్రగ్రంధాలయమునకు పంపకుండనే ఒక గ్రామమునుండి, వేరొక గ్రామమునకు సంచార గ్రంథాలయముల సంపవచ్చును, గాని అట్లు చేయుటవలన గ్రంధములకు గలిగిన నష్టములు ఏగ్రామమువారు చేసినదియు నిర్ణయించుట కష్టము.

మహారాజు గారు ఉచిత ప్రారంభ విద్యను నెలకొల్పి యుండుటచేత, ఈసంచార గ్రంథాలయములను రాజ్యములయందున్న గ్రామముల వారెల్లరు విరివిగ ఉపయోగించుకొనుచున్నారు. వీనియందుండు గ్రంధములన్నిటిని ప్రతి గ్రామమునందును చదువుదురనుటకు వీలులేదు. ఒక గ్రామమునందు ప్రథమదశయందు గ్రంథములను చదువువారు పది, పన్నెండుగురుకన్న నెక్కువగా నుండరు. వారికి గ్రంధపఠనాభిలాప వృద్ధియైనకొలది ఇతరులను చదివింపజేయుదురు; ఇంతేగాక ప్రధను దశయందు కథలు మొదలగు సులభగ్రంధములను చదువ ప్రారంభించినవారు, శాస్త్రవిషయములనుగూడ క్రమేణ చదువుట కభ్యాసపడుదురు.

ప్రధమ వత్సరమునందు, ౨౪౦౦ గ్రంధములు గలిగిన ౩౮ పెట్టెలతో ఈయుద్యమము ప్రారంభింపబడినది. ౧౯౧౭ సంవత్సర ప్రారంభమునందు ౧౪౦౦౦ గ్రంథములు గలిగిన ౪౪౪ పెట్టెలుగలవు. ౧౯౧౧ సంవత్స