గ్రంథాలయ సర్వస్వము
తే. ఆశ్యదుర్లభముగ మ్రోయు నందె లొప్ప
నీవడుగుఁదమ్మిఁదాఁచి మన్నించు టెల్లఁ
దలఁచికొనిఁ పూలకన్నీళులొలుకు నిదిగో !
చెలియ ! చూడు మశోక మేడ్చెడిన పోలె.
తే. నీదు నిట్టూర్పు తావి రాణించు పొగడ
పువుల నాతోడ నీవరపొదిగినట్టి
యీవిలాసంపు మొలనూలి నిటుముగింప
కుండఁ గిన్న రకంఠి ! పరుండె దేల?
తే. చెలులు సుఖముఃఖములను బంచికొనువారు ;
క్రొన్నెలనుబోలు గారాబుఁ గొడుకు వీఁడు
నిన్నె నమ్మిన యే నున్న కట!
నీవు పట్టిన పట్టెంత నిష్ఠురంబు !
తే. తెలివి సెడీయేకు; ధైర్యము దెగియెఁ; బాట
సొగసు గెడ చెను; ఋతువుల చొక్కు ముగి సె ;
సొమ్ములన్నియు నిఁక్రమీఁద వమ్ములయ్యె;
నకట! పడుకయుఁ బరిశూన్యమయ్యె నాకు!
తే. సతివి, మంత్రివి, యేకాంత సమయమందుఁ
జెలివి, ప్రియశిష్యు కాలవు చిత్రకళల;
నిన్ను హరియించి మృగ్యువు నిద్దయాత్ముఁ
డేమీ మిగిలించినట్లయ్యె నింక నాకు ?
క. మదిరాక్షి ! వధురమై మ
ద్వద నార్పితమైన చూసవముఁ గ్రోలు గు వే
మొద ; లెట్టులు గ్రోలెద ని
పు దివంబున బొప్పదుష్టము నివాపఁబుక్ !
తే. ఎంతి వైభవముండినయేని యజున
కెల్ల సుఖములు ముగిసిన వెఱుఁగుమిరిక ?
నేఱు పేరాసలేక జీవించు నాకు
సుఖములన్నియు నీతోడి సొత్తులబల !
--రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ.
నిశీధము
భానుమంతుఁడు లోకై క బాంధవుండు
చక్రరక్షణదక్షుడు చండ తేజుఁ
డస్తమింపఁగ జగ మెల్ల నార్తినొందె
భూనభోంతరములు మసిపూసినట్లు
బంధ కారము ఘోరమై యలముకొనియె
మిన్నువన్నును నేకమై యున్న కతన
కన్నులున్న ఫలంబును గలుగదయ్యె
నిదర లేచిన దాడిగా ముదరమునకు
విధి విరామము లెరుగని వెతలఁబడుచు
దినమునం దెల్లచోటులుఁ దిరిగి తిరిగి
స్వాశ్రమంబుల జేరుకొన్నట్టి ప్రాణి
కోటి యెంతయు విశ్రాంతిఁ గోరుచుండె
కాలమను ముచ్చు నిదురను గాటమైన
మచ్చుమందును జల్లి మైమరచి కీలు
లూడిపడియున్న బొమ్మలజాడనున్న
ప్రాణికోటుల చైతన్యను నెడు సొమ్ము
నపహరించెను నిశియయ్యె సంత పకృతి
కలసిపోయెను నిశ్శబ్దగగనమందు
జంతుసంతాన మూపిరి సలుపు ధ్వనియు
గలవరింతలచేఁ గల్గు కలకలంబుఁ
గాక కొండొక శబ్ద మెక్కడ నొకింత
శ్రవణపుటముల సోకదా సమయమందు
ప్రొద్దుఁదెలి పెడు గడియారములవలనను
చమురుఁబీల్చెడు ఘన దీపచయమువలన
కెరలి నర్తించు నుకవి లేఖినులవలన
గాలిచేఁగద లెడు వృకు,గణమువలన
మూర్లి రెడు పెద్ద పర్వత గుహలవలన
నెడ తెగక ప్రవహించాడు "నేళ్లవలన
సంబుధి తరం,, సంఘట వంబువలన.
గ్రహనముల నేర్చు కార్చిచ్చు కడిమివలన
గాక కొండొక శబ్ద మెక్కడనులేదు.
పులులు తోడేళ్ళు గుడ్లగూబలును పిల్లు