Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.1 (1918).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అజవిలాపము

తే. ఈ కుసుమమాలికయ చంపునేని, యేల
నన్నుఁ జంపద యెద నిడికొన్నఁ గాని?
నిషము నమృతంబయగు నొక్క వేళ, ననుృత
మేనియు విషంబయగు నేమొ యీశ్వరేచ్ఛ!

తే. అదియుఁగా దేని నా యభాగ్యంబు కృతన
యిట్టు లీ క్రొత్తపిడుగు నిర్మించె బ్రహ్మ;
మ్రాని నియ్యది గూల్పశ్, దానికొమ్మ
నాశ్రయించిన లేఁదీఁగ నగడువతి చె!

క. తొలినుండి యెన్ని తప్పులు
పలుమఱు చేసినను గోపపడియు నెఱుఁగ వో
చెలీ! తప్పులేనివాఁడను ;
బలుకవు నేఁడేల యొక్క పారిX నాతోకా ?

తే. టక్కు కూరిమిఁ జూపువాఁడను శకుండ
నేనని తలంచినావుసూ నిజము, గాన
మధురహాసిని యరిగితి మరలకుండ
నాకుఁ జెప్పకయే పరలోకమునకు.

తే. దయిత వెన్నంటి చనినది, దాని విడిచి
యిట్లు వెన్కకు మరలంగ నేల నాడు
కూళ జీవము? తాఁజేసికొన్న తప్పు
వలని వలవంత లిపుడు సైఁపంగ వలయు

తే. సురత భేదంబుచేఁ బొడసూపినట్టి
చెమట తుంపుకు లింకను జెడువు నుదుట !
ఇంతలో నస్తమించితి విట్టు లకట
నీవు ! దేహుల బ్రదుకెంత నీరసంబు !

తే. ఆత్మలో నేని, మున్ను నీ కప్రియంబుఁ
జేసియెఱుఁగను నన్నేల పాసితబల?
పేరు క్షితిపతిఁ గాని, భావింప భావ
సిద్ధమగు కూర్మి నాకు నీ చెంతఁ గాదె?

తే. గండుఁదేఁటుల నిగ్గులు గలిగి, పువులం
గూర్పఁబడియుండు నీ వక్రకుంతలములఁ
గదలఁజేయుచు మరల నీబ్రదుకునందు
నాసపుట్టించెడిని గాలి, యబల! నాకు.

తే. నాదు ప్రాణమ! వేగ కన్దవను విచ్చి
లెమ్ము నాదు విషాద భరమ్ము మాన్ప;
రేఖ హిమవంతు గుహ నావరించు తమము
వెలఁగి తొలగించు నోషథి విధము దోఁప.

తే. అలకలు చలింపఁ బొలిచి మాటాడలేని
నీదు నెమ్మోము నన్నుఁ గుందించె నిపుడు !
లోనఁ జిక్కిన తేంట్ల నిస్వాన మడఁగ
రాత్రి నిదిరించు కొందామరయును బోలె.

తే. చందమామను రాతిరి, చక్రవాకి
తోడిపులుగును భానియుఁ గూడు మరలఁ;
గాన విగ్రహాంతరం బోర్వఁగలుగు ; నీవు
మరలకయ చన్న నోర్తు నెమ్మాడ్కిఁ జెపుమ?

తే. ఎల చివురుటాకు పాన్పుపై నిడినఁగాని
కందిపోవును నీదు చొక్కంపు మేను;
అట్టిది లతాంగి ! యిఁకపయి నెట్టు చెపుమ
యోర్వఁగల్గును జితిపయి నుంచినపుడు ?

ఆ. ఇదిగో చెలువు ! నీకు నేకాంత సఖి రత్న
గళన, జీవకళ దొడంగి నీవు
నడ బెడంగులెల్ల నుడుగఁ, జప్పుడు లేక
నీదు వెంటనె మరణించెఁ బోలె.

తే. కోయిలలయందు ముద్దుఁ బల్కులు, మరాళి
కాల సగతులు, లేఁడి
కన్నియలయందుఁ జలకటాక్షములు, పవన
చలితలతలందు విభ్రమ విలసనములు,
తెల్లముగ నిల్పినావుసూ, దివికి నేఁగ
వలచియుండియు నీవు నాపాటుఁదలఁచి;
కాని, యనియెల్ల నీవియోగమునఁ గుందు
నాదు హృదయము నాదుకొనంగ లేవ.

తే. అల్ల మాకందతరువుఁ బ్రియంగులత యు
నలుపు గాఁ బెంచితివి మిధునమ్ము గాఁగ;
బెండిలి సేయకుండఁ
దగలివోవుట యిటు నీకుఁ దగదు సుమ్ము!

తే. సుదతి ! నీ చేసినట్టి దోహదము వలనఁ
బెరిగిన యశోక మిడి, నీదు కురుల కెకట!
సొమ్ములుగు నిచ్చుచుండిన సుమములిప్పు
డెట్టులు నివాపనేళ నీకిత్తుఁ జెపురు?