Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.1 (1918).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రంథాలయ సర్వస్వము


గుణవిశిష్టంబైన ♦ కోవనుగూర్చి
విశ్వేశునర్చించు ♦ వేళ రాకు న్నె?
సచ్చిదానంద ప్ర♦శాంత భావమున
నైక్యానుసంధాన ♦ మబ్బక యున్నె?
పొగడకుఁబొన్నకు ♦ బూవులమైన
వాస నావశత నీ ♦ వాంఛజనించె
నిది యపరాధమం ♦ చెవరనఁగలరు?

--వేంకటపార్వతీశ్వరకవులు.

పల్లకీ బోయీలు

[ శ్రీమతి సరోజినీ దేవిచే వ్రాయబడినదాని భాషాంతరీకరణము. ]

మొయ్యిరా అమ్మోర్ని మొద
మొయ్యిరా పల్లకీ మొయ ·
౧, మనపాట గాలిలో నన లెత్తు పువ్వురా,
కన్నె పెదవులజారు కలలోని నవ్వురా,
యేటినురగల పైని నీడేటి బాతురా,
దారమున ముత్యంపుతీరుగల నాతిరా,
ఆడుచూ పాడుచూ,
అందముగ వడచుచూ,
మొయ్యిరా అమ్మోర్ని మొక
మొయ్యిరా పల్లకీ మొయ్,
9. అలలతల పై గెంతు యెలమావి మొక్కరా,
మన తే నెపాటల మంచులో చుక్కరా,
వెండిబుడల్లోన నిండు పన్నీరురా,
పెండ్లికూతురుకంట వెడలుకన్నీరురా,
ఆడుచూ పాడుచూ,
అందముగ నడచుచూ,
మొయ్యిగా అమ్మోర్ని మొలకు
ముయ్యి రా పల్లకీ మొయ్.

--అధికార్ల సూర్యనారాయణరావుగారు.

బి. ఏ., బి. ఎల్.

“శ్లోకమైన శోకము” [ అజవిలాపము. ][1]

నిద్దుం జన్ను 'వ పయి నిలిచి నిమిష
మాత్ర సఖి యైన యా సుమమాలఁ గాంచి,
సోలి కన్నులుమూసె భూపాలు దయితే ;
నెలను రాహువు మ్రింగ వెన్నెలయుఁబోలె.
ఆ. ఆతఁడేడ్చె సహజమైన ధైర్యము గూడఁ
గలఁగిపోవ, భాష్పగద్గదముగ ;
ఇనుముగూడఁ దాప మెనసిన మెత్తనౌఁ;
దనువు గల్గువారిఁ దడవవలెనె?.

తే. " అకట! యించుక మై సోఁకి నంతఁ బువులు-
సైత మాయువుఁబోకార్పఁ జాలు నేని,
పాపిదైవమ్మునకు నింకఁ బ్రాణికోటిఁ
జంపవలెనన్న దేనితోఁ జంపరాదు ?

తే. కాక, మృదు వైన వస్తువుఁ గాకు సేయ
మృదు పదార్థంబ తెచ్చునో మృత్యు వెపుడు?
మంచు సోఁకున నలగు తామరసవల్లి
కనుఁగొనిన నిందు మొదటి తార్కాణగాదె?

  1. నాచే నాంధ్రీకృతమైన రఘువంశమునుండి యెత్తఁబడినది.