నిబంధ నలనగా, సంఘము యొక్క పనిని ఆటంక పరచునట్టి కఠినమైన నిబంధనలు గావు. ఈ యుద్యమము ప్రారంభమై మూడు సంవత్సరములు మాత్రమైనది. అట్టి స్థితియందు కఠినమైన నిబంధనలను జేసి, సంఘము యొక్క యభివృద్ధి సరికట్టిన లాభములేదు, కావున స్వల్పముగ నిబంధనల నేర్పరచి, ఆదాయమును గల్పిం చెదరని మనవి చేయుచున్నాడను.
పిమ్మట, మహాసభకు రాజాలమికి వగచుచు, పోలవగం జమీందారు, రావుబహద్దరు కందుకూరి వీరేశలింగం పంతులు, రావుబహద్దరు కిలాంబి రామానుజాచార్యులు, విక్రమ దేవవర్మ, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి; ఏ.వి. రామయ్య, ఆదూరి వెంకటస్వామిశెట్టి, ఆంధ్ర ప్రచారిణీ గ్రంథనిలయము, వరహగిరి వెంకట జోగయ్యగార్లు వ్రాసిన లేఖలు జదువబడెను.
తరువాత గ్రంథాలయ ప్రదర్శనము నందలి బాలశాఖను గూర్చి, జయంతి జగన్నాధముగారు విఫలముగా జెప్పిన పిమ్మట, గ్రంథాలయ ప్రదర్శనము దెరువబడినది.
ప్రథమ గ్రంథాలయ ప్రదర్శనము
సభా మంటపమునకు 'వెనుక భాగమందున్న బోర్డు పాఠశాల భవనమునందు ఈ ప్రదర్శన మేర్పాటు గావింపబడినది. అమెరికా, ఐరోపా, మున్నగు విదేశముయందును బరోడా రాజ్యమునందును, ఆంధ్రదేశము నందును ప్రాముఖ్యత వహించియున్న గొప్ప గ్రంథాలయములయొక్క బయటి ఆకారములను లోపలి యాకారుములను జూపు పటములును ప్లానులును అసేకములు గోడలయందు వ్రేలాడ గట్టబడి చూపబడి యున్నవి.
ఆయా దేశములందు గ్రంథాలయములనుగూర్చి ప్రత్యేకముగ ప్రకటింపబడు పత్రికలు, గ్రంథాలయశాస్త్రమును గూర్చి ఆంగ్లేయభాష యందున్న ఉద్గ్రంధములు అనేకము ప్రదర్శింపబడినవి. ఇంతేకాక ప్రపంచమునందు ప్రబలియున్న వివిధతములగు గ్రంథవర్గీకరణ పద్ధతులును తెల్పుగ్రంధములును, వర్గీకరణమును గూర్చి ఆంధ్రదేశమునఁదు జరిగినపనిని దెలుపు వ్రాత గ్రంథములును చూపబడినవి. పలువిధములైన గ్రంథములపట్టికలు తయారుజేయు పరికరములు తేబడినవి. ఇదిగాక ప్రత్యేకముగ బాలశాఖ ప్రదర్శింపబడి యున్నది. ఈ బాలశలయందు బాలుఁహృదయముల నాకర్షించి వారికి జ్ఞానాభివృద్ధిజేయు ఆనేకవిధములులైన ఆటలు, ఆంగ్లేయభాష యందు బాలురకై ప్రత్యేకముగ వ్రాయబడిన పలుగ్రంధములు, గుడ్డలమీద ముద్రింపడిన గ్రంథములు, ప్రదర్శింపబడినవి. ఇంతేగాక, ఆంధ్రభాషయందు బాలురు ఉపయోగించుకోనుట కనువుగనున్న గ్రంథములన్నిటిని సేకరించి ప్రదర్శించిరి. బాలశాఖయందు ప్రదర్శింప బడిన వస్తువులు గ్రంధములు అన్నియును బెజవాడ రామమోహన ధర్మగ్రంథాలయవారు ప్రదర్శించిరి. గుంటూరుజిల్లా తెనాలి తాలూకా పెదపాలెము గ్రామముసందున్న బాలసమాజమువారు తమ గ్రంథ భాండాగార భవనముయొక్క ఆకారమును ప్రదర్శించిరి. ఈ ప్రదర్శనమునందు ప్రదర్శింపబడిన వివిధమైన వస్తువును గూర్చియు, గ్రంథములను గూర్చియు, అయ్యంకి వెంకటరమణయ్యగారు ఎల్లరకును విక్కిలి ఓపికతో తెలియజెప్పిరి. ఇంతేగాక వీరి ప్రత్యేక పరిశ్రమవలననే ఈ ప్రదర్శనమింత జయప్రదముగ జరిగినదని జెప్పవచ్చును.
ప్రతినిధులును, ప్రేక్షకులును, ఈ ప్రదర్శనమును జూచి, అనేక అమూల్యవిషయములను దెలిసికొనిరి. గ్రఁథాలయములను గూర్చి ప్రత్యేకముగ ప్రకటింపబడునట్టి పత్రికలన్ని ఆంగ్లేయ భాష యందుగలవాయని ప్రశ్నించువారు కొందరు. గ్రంథాలయ శాస్త్రమును గూర్చి ప్రదర్శింపబడిన ఆంగ్లేయ గ్రంథములను ప్రశంశించువారు కొందరు, గుడ్డమీద పిల్లలకొరకై ముద్రింపబడిన పుస్తకములనుచూచి ఆశ్చర్యపడువారు మరికొందరు. ఆటలమూలమున పిల్లలకు జ్ఞానాభివృద్ధిని విద్యయందాసక్తిని గెలుగజేయుట ఎన్నడైనజూచితిమాయని ని ప్రశ్నించువారు ఇంకొక కొందరు. ఇట్లు ఈ ప్రదర్శనము అమీతమైన ఉత్సాహమున గలుగ జేసినది. మధ్యాహ్నము ప్రతినిధులు తమ పని లోని లోపములను పరస్పరము దెలుపుకొనిరి. పిమ్మటసాయంకాలము